For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

life insurance: ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉండవచ్చా, ఎందుకు?

|

జీవిత బీమా పాలసీ ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఎప్పుడు ఎవరికి ఏమౌతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వివిధ బీమా పాలసీలు తీసుకోవడం మంచిది. కరోనా నేపథ్యంలో చాలామందికి ఆరోగ్య బీమా అవశ్యకత తెలిసి వచ్చింది. అందుకే ఆ తర్వాత హెల్త్ ఇన్సురెన్స్‌లు పెరుగుతున్నాయి. ఇక, జీవిత బీమా పాలసీల పట్ల పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ మొదటి నుండి చాలామంది వీటికి మొగ్గు చూపుతారు. ఏదైనా ప్రమాదం జరిగితే యాక్సిడెంటల్ పాలసీ, అనుకోకుండా మనకు ఏమైనా జరిగితే మనపై ఆధారపడిన వారికి ఆర్థిక బలాన్ని ఇస్తుంది జీవిత బీమా.

ఇలాంటి ఇన్సురెన్స్ పాలసీలను ఒకటి కంటే ఎక్కువ కొనుగోలు చేయవచ్చునా? అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. జీవిత బీమా పాలసీలు ఒకటి కంటే ఎక్కువగా కొనుగోలు చేయవచ్చు. కానీ హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ(HLV) అంచనా ద్వారా విధించిన పరిమితిని గుర్తుంచుకోవాలి. HLV అనేది మీ ఆదాయాన్ని బట్టి ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు కానీ

ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు కానీ

మన దేశంలో కరోనా తర్వాత బీమా పైన అవగాహన పెరిగింది. అది జీవిత బీమా కావొచ్చు లేదా ఆరోగ్య బీమా కావొచ్చు. గత ఏడాది వ్యవధిలో చాలా మంది కొత్త పాలసీలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత వివిధ ఇన్సురెన్స్ పథకాలపై ఆసక్తిని కనబరుస్తోంది. దీంతో పలువురు ఒకటికి మించి పాలసీలు కూడా తీసుకుంటున్నారు.

నిపుణుల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉండవచ్చు. అయితే మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను సరిగ్గా ప్లాన్ చేసుకొని, సరైన ఒక పాలసీని తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఎక్కువ పాలసీలు ఉంటే నిర్వహణ భారంగా మారవచ్చు. ఒక పాలసీ కొనుగోలు చేసిన, కొద్ది రోజులకు మరో పాలసీ కొనుగోలు చేస్తే.. ఖర్చు పెరుగుతుంది. ఏ పాలసీ ప్రీమియం చెల్లింపులో జాప్యం జరిగినా క్రెడిట్ హిస్టరీ పైన ప్రభావం పడుతుంది.

ఈ-ఇన్సురెన్స్ అకౌంట్

ఈ-ఇన్సురెన్స్ అకౌంట్

అయితే మీ పాలసీలను ఒకేచోట నిర్వహించడానికి ఈ-ఇన్సురెన్స్ అకౌంట్‌ను ఉపయోగించవచ్చు. ఈ-ఇన్సురెన్స్ అకౌంట్ అంటే డీమ్యాట్ అకౌంట్‌ను పోలి ఉంటుంది. ఇక్కడ మీరు మీ అన్ని పాలసీలను చూడవచ్చు... అలాగే నిర్వహించుకోవచ్చు. ఈ-బీమా ఖాతా మీ బహుళ జీవిత బీమా పాలసీలను నిర్వహించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్స్ మినహా ఇతర సేవా అభ్యర్థనలను దాఖలు చేయవచ్చు.

పాలసీ గురించి వెల్లడి

పాలసీ గురించి వెల్లడి

ఒక పాలసీని తీసుకుంటే అంతకుముందు తీసుకున్న పాలసీల గురించి వెల్లడించవలసి ఉంటుంది. కొత్త పాలసీ తీసుకున్న ప్రతిసారి దీనిని వెల్లడించాలి. అలాగే ఆ పాలసీల వెనుక ఉద్దేశ్యం ఏమిటో వెల్లడిస్తే, క్లెయిమ్ సమయంలో రిజెక్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే ఇబ్బంది తప్పదు. లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంపై పన్ను మినహాయింపు ఉంది. ఎన్ని పాలసీలు ఉంటే అన్నింటిపై రాయితీలు ఉండకపోవచ్చు. కానీ మీరు చెల్లిస్తున్న వాటిలో అత్యధిక ప్రీమియం దేనికి ఉంటే దానికి మినహాయింపు ఉంటుంది.

అందుకే ఎక్కువ పాలసీలు

అందుకే ఎక్కువ పాలసీలు

వయస్సు పెరుగుతుంటే బాధ్యతలు పెరగడం సహజం. పిల్లలు, వారి చదువులు, ఇంట్లో ఖర్చు, పిల్లల పెళ్లిళ్లు.. వంటి వివిధ ఖర్చులు ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ అవసరం. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా పాలసీలు పెంచుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్లలో తీసుకున్న పాలసీ 50 ఏళ్ల అవసరానికి సరిపోకపోవచ్చు. కాబట్టి అప్పటి అవసరాలు మీకు అవగతమవుతున్న కొద్దీ పాలసీలు పెంచుకోవాలి.

English summary

life insurance: ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉండవచ్చా, ఎందుకు? | can we have more than one insurance policy, Know the details

You can buy as many life insurance policies as you want but, you should take care of the limit imposed by the human life value (HLV) estimate.
Story first published: Thursday, September 23, 2021, 15:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X