For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఇవి తెలుసుకోండి

|

కరోనా మహమ్మారి దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ కోసం మాత్రమే వెళ్లవచ్చు. సాధారణ పరిస్థితుల్లోనే ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. దీంతో వివిధ కంపెనీలు డెలివరీ సేవలు అందిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు లేకపోవడంతో చాలామంది చేతిలో డబ్బులు లేకుండా పోయాయి లేదా దాచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దిగ్గజ కంపెనీల్లో వేతనాల కోత: అదే జరిగితే టాప్ 100లో 27 కంపెనీలు షాకిస్తాయ్దిగ్గజ కంపెనీల్లో వేతనాల కోత: అదే జరిగితే టాప్ 100లో 27 కంపెనీలు షాకిస్తాయ్

అమెజాన్ పే.. ముందు కొనండి.. తర్వాత చెల్లించండి

అమెజాన్ పే.. ముందు కొనండి.. తర్వాత చెల్లించండి

ఇలాంటి వారి కోసం అమెజాన్ ఇండియా సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. ముందు కొనండి.. తర్వాత చెల్లించండి ( అనే సదుపాయంతో ముందుకు వచ్చింది. అమెజాన్ చెల్లింపుల విభాగమైన అమెజాన్ పే సాయంతో 'అమెజాన్ పే లేటర్' సదుపాయం ప్రవేశ పెడుతోంది. డిజిటల్ పద్ధతిలో సైనప్ అయ్యాక వెంటనే రుణం మంజూరు అవుతుంది. అప్పుడు కావాల్సిన సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయవచ్చు. బిల్లుల చెల్లింపుకు తీసుకున్న రుణం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.

సులభ వాయిదాల్లో..

సులభ వాయిదాల్లో..

అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు. తదుపరి నెలలో ఈ మొత్తం చెల్లించవచ్చు. జీరో వడ్డీ రేటు ఉంటుంది. లేదంటే నామమాత్రపు సులభమైన వాయిదాలపై 12 నెలల పాటు చెల్లించవలసి ఉంటుంది. వడ్డీ రేటు 1.5 శాతం నుండి 2 శాతం మధ్య ఉంటుంది. అయితే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడు ఎలా చెల్లింపులు జరపనున్నది ముందే సమాచారం ఇవ్వాలి. ఇలా రూ.60వేల లోపు గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

మీరు అర్హులా.. ఎంత రుణం తీసుకోవచ్చు

మీరు అర్హులా.. ఎంత రుణం తీసుకోవచ్చు

అమెజాన్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా అమెజాన్ పే లేటర్ సర్వీస్‌ను రిజిస్టేషన్‌ చేసుకోవాలి. ఈ సేవలు ప్రస్తుతం డెస్క్ టాప్ యూజర్లకు అందుబాటులో లేవు. అమెజాన్ పేని రిజిస్టేషన్‌ చేసుకునే కస్టమర్లు KYCని పూర్తి చేయాలి. అనంతరం మీరు అర్హులో కాదో డాష్ బోర్డుపై 'నో యువర్‌ స్టేటస్' వద్ద చెక్‌ చేసుకోవచ్చు. మనం ఎంత రుణం వస్తుందో కూడా డ్యాష్ బోర్డుపై చూపిస్తుంది.

క్రెడిట్ కార్డు అవసరం లేదు

క్రెడిట్ కార్డు అవసరం లేదు

- ఇది సులభమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్.

- మీరు కొనుగోలు చేసిన వాటికి బిల్లును వచ్చే నెలలో ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. లేదా 12 సులభ వాయిదాల్లో తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది.

- క్రెడిట్ కార్డు అవసరం లేదు.

English summary

ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఇవి తెలుసుకోండి | Amazon Pay Later Launched in India

Amazon has introduced a new credit service called Amazon Pay Later in India. The service offers customers an instant zero-interest credit on any of the listed products on Amazon India and even allows them to repay it in monthly instalments up to 12 months.
Story first published: Friday, May 1, 2020, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X