For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారు సరే.. అసలు ఖర్చు ఎంతో తెలుసా?

|

ఇంటిని సొంతం చేసుకోవడం చాలామంది కల. చాలామంది తమ అతిపెద్ద ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా ఇంటిని ఎంచుకుంటారు. చిన్న చిన్న అవసరాలకు పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ కంటే హోమ్ లోన్ దీర్ఘకాలమైనది. మిగతా రుణాల విషయం పక్కన పెడితే, హోమ్ లోన్ అనేది మంచి రుణం. ఇల్లు ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి సొంతిల్లు లేని వారికి ఇది మంచి పెట్టుబడి సాధనం. సాధారణంగా హోమ్ లోన్ కాలపరిమితి ఇరవై ఏళ్ల వరకు ఉంటుంది. కరోనా మహమ్మారి అందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే బ్యాంకు బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ 2021 ప్రకారం గత రెండేళ్ల కాలంలో మహమ్మారి మన జీవితాలను చాలా వరకు ప్రభావితం చేసింది. అయినప్పటికీ చాలామందికి ఇల్లు లక్ష్యంగా ఉంది. 90.7 స్కోర్‌తో ఇల్లు లక్ష్యంగా చాలామంది పేర్కొన్నారు.

మన దేశంలో చిన్న ప‌ట్ట‌ణాల నుండి నగరాల వరకు వివిధ ప్రాంతాల్లో నివసించే వారికి సొంతిల్లు కల. చేతిలో నగదు లేనివారు చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఇంటిని కొనుగోలు చేస్తారు. హోమ్ లోన్ తీసుకునే ముందు చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇల్లు సొంతం చేసుకునే ఖ‌ర్చు వార్షిక గృహ ఆదాయానికి 10 రెట్లు అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. ప్ర‌త్యేకించి రియాల్టీ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్న నగరంలో ఇల్లు కొనాల‌ని ప్లాన్ చేస్తే ముప్పై ఏళ్ల వరకు వడ్డీతో తిరిగి చెల్లించే విధంగా ఇంటిని కొనుగోలు చేసేలా హోమ్ లోన్ తీసుకుంటారు. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు పలు అంశాలను తెలుసుకోవడం ముఖ్యం.

Actual cost of buying a house with the help of a home loan

ఇంటి కొనుగోలు అంత ఈజీ అంశం కాదు. దీని కోసం డబ్బులు భారీగా ఖర్చు చేయాలి. రుణం తీసుకున్నప్పటికీ చేతిలో ఆ డబ్బులో కనీసం పది శాతం మన వద్ద ఉండాలి. పలుచోట్ల మీ వార్షిక ఆదాయం కంటే ఇల్లు రేటు పది నుండి పదిహేను శాతం ఎక్కువగా ఉండవచ్చు.

హోమ్ లోన్ తీసుకుంటే సాధారణంగా 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటే పది శాతం నుండి అంతకంటే ఎక్కువగా మన చేతిలో నగదును అట్టిపెట్టుకోవాలి. అలాగే, మనం ఎంత డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లిస్తే అంత ఈఎంఐ తదనుగుమంగా వడ్డీ రేటు తగ్గుతుంది. రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే పలు బ్యాంకులు 75 శాతం రుణాన్ని మాత్రమే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా 25 శాతం డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. కానీ సుదీర్ఘకాలానికి ఇది అధిక వ్యయమే. వయస్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఆస్తి వ్యాల్యూ, లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి వంటి పలు అంశాలపై హోమ్ లోన్ వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.30 లక్షల వ్యాల్యూ కలిగిన ఇంటిని తీసుకోవాలంటే కనీసం పది శాతం డౌన్ పేమెంట్ చేయాలి. అంటే మీ వద్ద రూ.3 లక్షలు ఉండాలి. అంటే బ్యాంకులు రూ.27 లక్షల వరకు రుణం ఇస్తాయి. అదే సమయంలో మీ ప్రాపర్టీ రూ.1 కోటి అయితే మీ వద్ద 25 శాతం అంటే రూ.25 లక్షలు ఉండాలి. రూ.30 లక్షల వ్యాల్యూ కలిగిన ఇంటి కోసం మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వ్యక్తికి బ్యాంకు ముప్పై ఏళ్ల కాలపరిమతితితో రూ.27 లక్షల రుణం ఇస్తే మీ నెల ఈఎంఐ రూ.17వేలకు పైన ఉంటుంది. రూ.1 కోటి వ్యాల్యూ కలిగిన ఇంటి కోసం బ్యాంకు రూ.75 లక్షల రుణం ఇస్తే మీ ఈఎంఐ రూ.49 వేలకు పైన ఉంటుంది. ముప్పై ఏళ్ల కాలంలో మీరు చెల్లించే మొత్తం రూ.1 కోటి దాటుతుంది.

అయితే ఫ్లోటింగ్ రేటు హోమ్‌లోన్ తీసుకున్నవారు.. మధ్యలో తమ వద్ద డబ్బులు ఉన్నప్పుడు కొంత అదనపు మొత్తాన్ని చెల్లించి భారం తగ్గించుకోవచ్చు. ఇందుకు పెనాల్టీ ఉండదు. తీసుకున్న రుణం కూడా ముందుగానే తీరుతుంది. మొట్ట‌మొద‌టి హోమ్ లోన్ అయితే ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద వ‌డ్డీ రాయితీలు పొంద‌వ‌చ్చు. బ్యాంకు హోమ్ లోన్ వ్యవధిలో ఆస్తి టైటిల్ డీడ్‌ను కలిగి ఉంటాయి. అన్ని బకాయిలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు ఈ ఎంఓడీటీ ఛార్జీలు అని పిలువబడే టైటిల్ కోసం డీడ్ కోసం బ్యాంకులు 0.1 శాతం నుండి 0.3 శాతం వరకు ఛార్జీ వసూలు చేస్తాయి. లీగల్ ఒపీనియన్ ఛార్జీలు, ఎంఓడీటీ ఛార్జీలు రుణంలో ఒక శాతం కంటే తక్కువగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఇవి మాఫీ అవుతాయి. ఒక్కోసారి డిస్కౌంట్స్ కూడా ఇస్తాయి బ్యాంకులు.

హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లీగల్ ఒపీనియన్ ఛార్జీలు, ఆస్తి, వ్యాల్యుయేషన్ ఫీజు వంటి హోమ్ లోన్ రుణం కింద బ్యాంకులకు కొన్ని అదనపు ఛార్జీలు చెల్లించాలి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కింద డాక్యుమెంటేషన్, లీగల్ ఒపీనియన్, వ్యాల్యుయేషన్ ఫీజులను కలిపి తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు విడిగా కూడా వసూలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆస్తి ట్రాన్సాక్షన్ పైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు విధిస్తాయి. ఈ ఛార్జీలు ఇతర అంశాలతో పాటు ఆస్తి స్థానం, ధర, పరిమాణాన్ని బట్టి మారుతాయి. ఆస్తి వ్యాల్యూలో ఇది మూడు శాతం నుండి ఆరు శాతం వరకు ఉంటుంది.

రూ.30 లక్షల వ్యాల్యూ కలిగిన ఇల్లు తీసుకుంటే రూ.3 లక్షల డౌన్ పేమెంట్ చెల్లీంచాలి.
ముప్పై ఏళ్లకు మీరు చెల్లించే అసలు, వడ్డీ రేటు (వడ్డీ 6.75 శాతం వద్ద) కలిపి రూ.63 లక్షలు అవుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఫీజు ఎంవోడీటీ ఛార్జీలు రూ.13,500 వరకు ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, బ్రోకరేజీ రూ.2 లక్షలకు పైన అవుతుంది.
ఎలక్ట్రిసిటీ, వాటర్, పార్కింగ్, అమెనటీసి, ఫర్నీషింగ్, మెయింటెనెన్స్ కాస్ట్ (30 ఏళ్లకు) రూ.11.75 లక్షలు అవుతుంది.
మొత్తం ఖర్చు రూ.79.99 లక్షలు అవుతుంది.

రూ.1 లక్షల వ్యాల్యూ కలిగిన ఇల్లు తీసుకుంటే రూ.25 లక్షల డౌన్ పేమెంట్ చెల్లీంచాలి.
ముప్పై ఏళ్లకు మీరు చెల్లించే అసలు, వడ్డీ రేటు (వడ్డీ 7.00 శాతం వద్ద) కలిపి రూ.1.8 కోట్లు అవుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఫీజు ఎంవోడీటీ ఛార్జీలు రూ.37,500 వరకు ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, బ్రోకరేజీ రూ.7 లక్షలకు పైన అవుతుంది.
ఎలక్ట్రిసిటీ, వాటర్, పార్కింగ్, అమెనటీసి, ఫర్నీషింగ్, మెయింటెనెన్స్ కాస్ట్ (30 ఏళ్లకు) రూ.25.50 లక్షలు అవుతుంది.
మొత్తం ఖర్చు రూ.2.38 లక్షలు అవుతుంది.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారు సరే.. అసలు ఖర్చు ఎంతో తెలుసా? | Actual cost of buying a house with the help of a home loan

Buying a home isn’t cheap. At times, the cost of owning a home could be as high as 10-15 times your current annual household income if not more, especially if you plan to buy a property in a big city where real estate prices are very high.
Story first published: Tuesday, August 31, 2021, 20:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X