For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

23.24 కోట్ల మంది ఖాతాల్లో ఆ వడ్డీ జమ, ఈ 4 మార్గాల్లో చూసుకోవచ్చు

|

పీఎఫ్ చందాదారులకు గుడ్‌న్యూస్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం వడ్డీ చొప్పున 23.44 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేసింది. మీ ఖాతాలో వడ్డీ జమ అయిందా లేదా తెలుసుకోవడానికి ఓసారి చెక్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. '23.34 కోట్ల అకౌంట్‌లకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం చొప్పున వడ్డీని క్రెడిట్ అయింది' అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. మీ అకౌంట్లో వడ్డీ క్రెడిట్ అయిందా లేదా తెలుసుకోవడానికి వీటిని చూడండి.

వెబ్ సైట్ ద్వారా..

వెబ్ సైట్ ద్వారా..

- ఈపీఎఫ్ఓకు చెందిన పోర్టల్ ఈ-సేవా పోర్టల్ ద్వారా మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇందుకు మీ యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్(UAN) అవసరం.

- ఈ పోర్టల్ ద్వారా మీరు ఈ-పాస్ బుక్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

- www.epfindia.gov.in పోర్టల్‌లోకి లాగ్-ఇన్ కావాలి.

- Our Services మెనులోని For Employees ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

- Services ఆప్షన్ కింది Member Passbook పాస్ బుక్ పైన క్లిక్ చేయాలి.

- ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి. యాక్టివేటెడ్ యూఏఎన్ నెంబర్ అవసరం.

- యూఏఎన్ నెంబర్ లేకుంటే epfoservices.in/epfo/ లింక్ పైన క్లిక్ చేయాలి.

- అక్కడ మీ పీఎఫ్ అకౌంట్ నెంబర్, మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, Submit పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.

SMS పంపించడం ద్వారా

SMS పంపించడం ద్వారా

ఎస్సెమ్మెస్ ద్వారా కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

- 7738299899 నెంబర్‌కు 'EPFOHO UAN ENG' సందేశాన్ని పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ENG అంటే మీ భాష. మీకు తెలుగులో సందేశం కావాలనుకుంటే TEL అని టైప్ చేయాలి. ఈ సేవలు పది వివిధ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

- ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే మీ బ్యాంకు అకౌంట్, ఆదార్, పాన్ నెంబర్‌తో యూఏఎన్ నెంబర్‌ను సింక్ చేయాలి.

ఈ నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి..

ఈ నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇచ్చి..

- 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

- అయితే ఇందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలి.

ఉమాంగ్ యాప్

ఉమాంగ్ యాప్

ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వివిధ ప్రభుత్వ సేవల కోసం దీనిని ఉపయోగించవచ్చు. దీని ద్వారా ఈపీఎఫ్ పాస్ బుక్ చూడవచ్చు. మీ ప్రావిడెంట్ ఫండ్‌ను క్లెయిమ్ చేయవచ్చు. మీ క్లెయిమ్‌ను ట్రాక్ చేయవచ్చు. మీ మొబైల్ ద్వారా ఈ యాప్‌లోకి రిజిస్టర్ కావాలి.

English summary

23.24 కోట్ల మంది ఖాతాల్లో ఆ వడ్డీ జమ, ఈ 4 మార్గాల్లో చూసుకోవచ్చు | 23.34 crore accounts credited 8.50% interest, How to find out your own balance

Giving the much needed joy ahead of the New Year to lakhs of PF subscribers, Employees' Provident Fund Organisation (EPFO) has already begun the process of crediting 8.50 percent interest to provident fund accounts for the financial year 2020-21.
Story first published: Monday, December 13, 2021, 20:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X