For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలు

|

ఢిల్లీ: ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం ఎంపిక చేసే మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC-పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) అన్ని రకాల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఏకీకృత మార్గదర్శకాలను రూపొందించారు. డిస్ట్రిబ్యూషన్‌షిప్ ఏరియా, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ ఆపరేషన్స్ కోసం కావాల్సిన కనీస సౌకర్యాలు, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ పద్ధతి, డిస్ట్రిబ్యూషన్‌షిప్ కాలపరిమితి తెలుసుకుందాం....

డిస్ట్రిబ్యూటర్‌షిప్ ఏరియా రకాలు

డిస్ట్రిబ్యూటర్‌షిప్ ఏరియా రకాలు

- అర్బన్ ఏరియాలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ మెట్రో సిటీ/సిటీ/టౌన్ పరిధిలోని మున్సిపల్ లిమిట్స్‌లో సేవలు అందిస్తారు. వీరిని షెహెరి విత్రక్ అంటారు.

- ఓ అర్బన్ ఏరియాలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ స్పెసిఫైడ్ రూరల్ ఏరియాలోను సేవలు అందిస్తే రర్బన్ విత్రక్ అంటారు. మున్సిపల్ లిమిట్స్ పరిధిలో 15 కిలో మీటర్ల వరకు వీరు సేవలు అందిస్తారు లేదా OMC పేర్కొన్న ప్రాంతంలో సేవలు అందిస్తారు.

- గ్రామీణ ప్రాంతంలోని ఎల్పీజీ డీలర్‌షిప్‌ను గ్రామీణ్ విత్రక్ అంటారు. స్పెసిఫైడ్‌ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తారు. సాధారణంగా 15 కిలో మీటర్ల పరిధిలో సేవలు ఉంటాయి లేదా OMC పేర్కొన్న ప్రాంతాల్లో సేవలు అందిస్తారు.

- కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు వంటి కష్టతరమైన ప్రాంతాల్లోని ఎల్పీజీ డీలర్‌షిప్‌ను దుర్గమ్ క్షేత్రియ విత్రక్ అంటారు. OMC పేర్కొన్న ప్రాంతాల్లో వీరు సేవలు అందిస్తారు.

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు

- భారతీయుడై ఉండాలి. భారత్‌లో నివసించాలి.

- కనీసం పదో తరగతి చదివి ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సమాన విద్య

- ఫ్రీడమ్ ఫైటర్ (FF) కేటగిరీకి చెందిన దరఖాస్తుదారుకు విద్యార్హత ప్రమాణాలు వర్తించవు.

- కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. 60 ఏళ్లు దాటకూడదు.

- ఫ్రీడమ్ ఫైటర్ (FF) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వయో పరిమితి లేదు.

- దరఖాస్తు చేసేనాటికి OMC కుటుంబంలో ఉద్యోగి అయి ఉండకూడదు.

- మాల్‌ప్రాక్టీస్/అడల్ట్రేషన్ నిరూపితమైన వారు అనర్హులు.

- దరఖాస్తు చేసే నాటికి ఎల్బీజీ గోడౌన్ నిర్మాణం కోసం కావాల్సిన భూమి ఉండాలి లేదా ఎల్పీజీ సిలిండర్ స్టోరేజ్ గౌడౌన్ ఉండాలి.

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. గోడౌన్

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. గోడౌన్

ఎల్పీజీ సిలిండర్స్ ఉంచేందుకు గౌడౌన్ ఉండాలి. ఎక్స్‌ప్లోజివ్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) చీఫ్ కంట్రోలర్ ఆమోదించిన లైసెన్స్ ఉండాలి.

- షెహరీ విత్రక్, రర్బన్ విత్రక్‌లు 8,000 KG LPG సామర్థ్యం కలిగిన గోడౌన్ కలిగి ఉండాలి.

- గ్రామీణ్ విత్రక్‌లు 5,000 KG LPG సామర్థ్యం కలిగిన గోడౌన్ కలిగి ఉండాలి.

- దుర్గమ్ క్షేత్రియ విత్రక్‌లు 3,000 KG LPG సామర్థ్యం కలిగిన గోడౌన్ కలిగి ఉండాలి.

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. ప్లాట్

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. ప్లాట్

ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ దరఖాస్తుదారు కనీస ప్లాట్‌ను కలిగి ఉండాలి.

- షెహరీ విత్రక్, రర్బన్ విత్రక్‌ అయితే 25 మీటర్లు x 30 మీటర్లు ప్లాట్ కలిగి ఉండాలి. (మున్సిపల్/టౌన్/విలేజ్ లిమిట్స్‌లలో 15 కిలో మీటర్ల దూరంలో ఉండాలి.)

- గ్రామీణ విత్రక్ అయితే 21 మీటర్లు x 26 మీటర్లు ( అడ్వర్డయిజ్డ్ లొకేషన్ నుంచి 15 కిలో మీటర్లు)

- దుర్గమ్ క్షేత్రియ విత్రక్ అయితే 15 మీటర్లు x 16 మీటర్లు (గ్రామంలో/సమీపంలో)

డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. గౌడోన్ ఎక్కడ

డిస్ట్రిబ్యూటర్‌షిప్ నిర్వహణ ప్రాథమిక సౌకర్యాలు.. గౌడోన్ ఎక్కడ

- ఎల్పీజీ గోడౌన్ కోసం సిద్ధంగా ఉన్న భూమి ప్లెయిన్‌గా ఉండాలి. ఓవర్ హెడ్ ట్రాన్స్‌మిషన్ లేదా టెలిఫోన్ లైన్స్ ఉండరాదు. పక్క పక్కన ప్లాట్‌లు ఉండకూడదు. కెనాల్స్, డ్రెయిన్స్, నల్లాలు పారని ప్రాంతం అయి ఉండాలి.

- గోడోన్‌కు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లేందుకు అనువుగా కనీసం 2.5 మీటర్ల వెడల్పులో రోడ్డు ఉండాలి. పబ్లిక్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే ప్రయివేటు రోడ్డు విషయంలో... అది సొంతది అయి ఉండాలి/రిజిస్టర్డ్ లీజు అయి ఉండాలి లేదా భూమి యజమాని నుంచి హక్కు కలిగి ఉండాలి.

- అడ్వర్టయిజ్‌మెంట్ లొకేషన్‌లో ప్రమాణిక లేఅవుట్ ప్రకారం 3 మీటర్ల నుంచి 4.5 మీటర్ల షోరూమ్ ఉండాలి.

ఎల్బీజీ డెలివరికీ మౌలిక సౌకర్యాలు

ఎల్బీజీ డెలివరికీ మౌలిక సౌకర్యాలు

ఎల్పీజీ సిలిండర్లకు స్టోరేజ్ గోడౌన్, షోరూంతో పాటు డెలివరీ వెహికిల్స్ వంటి మౌలిక సౌకర్యాలు ఉండాలి. హోమ్ డెలివరీ కోసం వాహనాలు అవసరం.

దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తు ప్రక్రియ

- ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ దరఖాస్తు కోసం.... షెహరీ విత్రక్ నిమిత్తం అర్హత కలిగినవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- ఇతర డిస్ట్రిబ్యూటర్‌షిప్స్ కోసం OMC వెబ్ సైట్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేయగలిగిన అప్లికేషన్ ఫార్మాట్ ద్వారా సమర్పించవచ్చు.

ఎన్ని చోట్ల అయినా దరఖాస్తు చేసుకోవచ్చు

ఎన్ని చోట్ల అయినా దరఖాస్తు చేసుకోవచ్చు

ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ లొకేషన్‌లలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అతడు లేదా ఆమె ఆయా లొకేషన్స్ కోసం వేర్వేరు దరఖాస్తులు ఇవ్వాలి. ప్రతి అప్లికేషన్‌కు కూడా అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.

దరఖాస్తుదారు ఒక లొకేషన్ నుంచి ఒకే దరఖాస్తు చేయాలి. ఒకవేళ ఒకే లొకేషన్ కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ దరఖాస్తులన్నింటిని ఒకటిగానే పరిగణిస్తారు. ఒకే లొకేషన్ కోసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు ఇస్తే వాటిని ఒకటిగానే పరిగణించడంతో పాటు మిగతా అప్లికేషన్స్ ఫీజును జఫ్తు చేస్తారు.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ

మూడు దినపత్రికలలో ప్రచురించబడిన ప్రకటనల ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఒకటి రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రిక, అలాగే ఆ జిల్లాలో అత్యధిక సర్క్యులేషన్ కలికిన రెండు పత్రికల్లో ప్రకటన ఇస్తారు. అర్హత కలిగిన దరఖాస్తులను ఒక్కచోట చేర్చి డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.

డీలర్‌షిప్ కాలపరిమితి

డీలర్‌షిప్ కాలపరిమితి

ఎల్పీజీ డీలర్‌షిప్ కాలపరిమితి ప్రాథమికంగా 10 సంవత్సరాలు ఉంటుంది. అయిదేళ్లకు రెన్యూవల్ చేసుకోవాలి. అయితే సంబంధిత OMC పంపిణీదారుల పనితీరును పరిశీలించి, నిర్ణయం తీసుకుంటారు.

Read more about: lpg ఎల్పీజీ
English summary

LPG డిస్ట్రిబ్యూటర్‌షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలు | Criteria for LPG Distributorships

The Government has modified the selection guidelines for LPG distributorship and a Unified set of Guidelines have been framed for all types of LPG distributorship of Public Sector Oil Marketing Companies (OMCs).
Story first published: Friday, August 16, 2019, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X