For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక

|

ఈ మధ్య బ్యాంక్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ఇలా చీటింగ్ చేసేవాటిల్లో ఎనీడెస్క్ యాప్ కూడా ఒకటి. దీనిని ఎవరూ ఉపయోగించవద్దని ఆర్బీఐ ఇదివరకే ప్రకటించింది. ఎనీడెస్క్ యాప్ ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ను ఈజీగా హ్యాక్ చేసి, ఖాతాలోని డబ్బులు మార్చుకుంటున్నారు. మీ ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు అన్నీ ఈ యాప్ ద్వారా సేకరించి అకౌంట్లోని డబ్బులు కొట్టేస్తారు. నకిలీ యాప్స్ ద్వారా కూడా మోసం చేస్తారు. ఈ నేపథ్యంలో HDFC కూడా తమ కస్టమర్లకు సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది.

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

ఇలా చేయకండి...

ఇలా చేయకండి...

మీ అకౌంట్లో మోసాలు జరగకుండా ఉండేందుకు కొన్ని సూచనలు పాటించాలని HDFC సూచించింది. ఇవి చేయవద్దు అంటూ.. కొన్ని జాగ్రత్తలు తమ కస్టమర్లకు మెసేజ్ చేస్తోంది.

- UPI PIN/MPIN, Debit/Credit Card, CVV, ఎక్స్‌పరీ డేట్, OTP, ATM పిన్, బ్యాంక్ అకౌంట్ వంటి మీ ఫైనాన్షియల్ వివరాలు ఎవరితోను షేర్ చేసుకోవద్దు.

- మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్ ఎవరితోను షేర్ చేసుకోవద్దు. అలాగే మీ మొబైల్ ఫోన్లో షేర్ చేసుకోకపోవడం మంచిది.

మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు జాగ్రత్తలు

మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు జాగ్రత్తలు

- యాప్ స్టోర్ నుంచి లేదా ప్లే స్టోర్ నుంచి మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దు. అలాగే, మీ మొబైల్ సెట్టింగ్స్ ఇన్‌స్ట్రక్షన్స్ కోసం వారి సూచనలు తీసుకోవద్దు.

- వివిధ మర్చంట్స్, ఎన్టీటీలు, బ్యాంకులు తదితర కస్టమర్ సర్వీస్ నెంబర్ల పైన ఆధారపడవద్దు.

ఆర్థిక కార్యకలాపాలు

ఆర్థిక కార్యకలాపాలు

- ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాల్లో గూగుల్ సెర్చ్ ద్వారా తిరిగి పొందే ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే పేక్‌వి ఉంటాయి.

- ఏదేనీ టెక్ కంపెనీ లేదా బ్యాంకు నుంచి తాము ప్రతినిధులమని చెబుతూ ఆయాచితంగా వచ్చే లేదా తెలియని ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పుడు వాటికి సమాధానం ఫార్వార్డ్ చేయవద్దు.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

- ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, కాన్ఫిడెన్షియల్ సమాచారం ఇవ్వాలని ఎవరి నుండి అయినా కాల్స్ వస్తే అలర్ట్‌గా ఉండండి. అలాంటి కాల్స్‌ను వెంటనే కట్ చేయండి.

వెంటనే డిలీట్ చేయండి

వెంటనే డిలీట్ చేయండి

- ఇప్పటికే మీరు ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే కనుక.. దాని అవసరం లేదు. వెంటనే ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

- మీ పేమెంట్ లేదా మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన యాప్ లాక్‌ను ఎనేబుల్ చేయండి.

- మీకు ఏదైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయండి. లేదా ధృవీకరించిన కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయండి.

English summary

మీ మొబైల్ ఫోన్‌తో జాగ్రత్త..! ఇలా చేయండి: HDFC హెచ్చరిక | Safeguard yourself against fraudulent access to your mobile phone

HDFC alert message to customers. Be alert to fraudulent calls that ask you to download apps or shae confidential information.
Story first published: Wednesday, July 17, 2019, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X