For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టూవీలర్ బీమా క్లెయిమ్స్ పొందడమెలాగో తెలుసా ?

By Jai
|

టూవీలర్ల వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు వాహనం చెడిపోవచ్చు, వాహనదారు గాయాల పాలుకావచ్చు లేదా మరణించవచ్చు. లేదా ఎదుటి వ్యక్తికీ దెబ్బలు తాకోచ్చు. వాహనానికి సంభందించి సమగ్ర బీమా పాలసీని తీసుకున్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తగిన పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామంది టూవీలర్లు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే బీమాను తీసుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని ప్రతి ఏడాది రెన్యూవల్ చేయడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ నష్టాన్ని వారే భరించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు వాహనం కొనుగోలు చేసినప్పుడే మూడేళ్ళ కాలానికి బీమాను జారీ చేస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే...

ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే...

* ప్రమాదం జరిగినప్పుడు అందుకు తగిన పరిహారాన్ని బీమా కంపనీ నుంచి పొందాలంటే ముందు క్లెయిమ్ ఫారం ను పూర్తి చేసి కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది.

* ఇన్సూరెన్సు పాలసీ లేదా కవర్ నోట్ పాలసీ ఉండాలి.

* బైక్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కాపీ, పన్నుకు సంభందించిన రిసిప్ట్

* ఒకవేళ థర్డ్ పార్టీ ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు, గాయాలు అయినప్పుడు పోలీసులు ఇచ్చే పంచనామా లేదా ఎఫ్ ఐ ఆర్ అవసరం

* వాహనానికి డ్యామేజీ జరిగినప్పుడు దాని రిపేర్ కు ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ తీసుకోవాలి

* రిపేర్ కు సంబంధించిన బిల్లులు లేదా చెల్లింపులకు సంబంధించినవి.

వాహనం దొంగతనానికి గురయితే...

వాహనం దొంగతనానికి గురయితే...

ఈ మధ్య కాలంలో వాహనాల దొంగలు పెెరిగిపోతున్నారు. ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు లేదా ఇంటివద్దనే ఉంచినప్పుడు వాహనాలు దొంగతనానికి గురవుతున్న ఉదంతాలను చూస్తున్నాము. ఇలాంటప్పుడు బీమా ఉంటేనే తగిన పరిహారం లభిస్తుంది.

* బీమా తీసుకున్న వారు క్లెయిమ్ ఫారం సమర్పించాలి

* పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్

* ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు కాపీ లేదా సర్టిఫికెట్ లేదా పన్ను చెల్లింపు రిసిప్ట్

* ఇంతకు ముందటి ప్రీమియం వివరాలు, పాలసీ నెంబర్

* అన్ని కీలు/సర్వీస్ బుక్లెట్ / వారంటీ కార్డు

* పోలీస్ పంచనామా/ఎఫ్ ఐ ఆర్ / తుది దర్యాప్తు నివేదిక

* వాహనం దొంగతనానికి గురైందని తెలియజేస్తూ ఆర్టీవో కు రాసిన లేఖకు సంబంధించిన కాపీ.

* ఫార్మ్ 28, 29, 30 సమర్పించాలి

* అవసరమైతే ఫైనాన్సియర్ నుంచి ఎంవోసీ

* రెవిన్యూ స్టాంపుపై సంతకం చేసిన క్లెయిమ్ డిశ్చార్జీ వోచర్

బీమా కంపెనీ క్లెయిమ్

బీమా కంపెనీ క్లెయిమ్

వీటితో పాటు బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్ మెంటుకు సంభందించి మరిన్ని డాక్యూమెంట్లు కోరవచ్చు. క్లెయిమ్ సెటిల్మెంట్ కు ఆయా కంపెనీలు అనుసరించే నియమ నిబంధనలు తెలుసుకోండి. పైన తెలియజేసిన విషయాలు అవగాహన నిమిత్తం అందజేసినవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిభంధనల్లో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది.

English summary

టూవీలర్ బీమా క్లెయిమ్స్ పొందడమెలాగో తెలుసా ? | How to claim two wheeler insurance?

Contact your two wheeler insurance company.Lodge an FIR (First Information Report) with the Police. Get your damage evaluated and approved by an authorized representative/surveyor.
Story first published: Wednesday, July 10, 2019, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X