For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోంలోన్ తీసుకుంటున్నారా?: ఇవి తెలుసుకోండి, మీ ఈఎంఐ ఈ 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది

|

మీరు హోమ్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? ఏ బ్యాంక్ అయినా ఫర్వాలేదు హోమ్ లోన్ తీసుకొని ఇళ్లు కొనుగోలు లేదా కట్టుకోవాలని భావిస్తున్నారా? హోమ్ లోన్ తీసుకుంటే మీ ఈఎంఐ ప్రధానంగా ఈ మూడు ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుందని తెలుసా? ఏ బ్యాంక్ అయినా వారు ఇచ్చే హోమ్ లోన్ రేట్ ఎంఎల్‌సీఆర్, రీ సెట్ పీరిడయ్, మేకప్ ఇన్ లోన్ పైన ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 1, 2016 నుంచి అన్ని బ్యాంకులు హోమ్ లోన్లు సహా అన్ని లోన్లకు ఎంసీఎల్ఆర్‌ను (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్) లింక్ చేశాయి.

<strong>ఇళ్లు, కార్లు కొనేవాళ్లకు గుడ్‍‌న్యూస్: మీ ఈఎంఐ తగ్గనుంది! మీరు ఎంత సేవ్ చేస్తారంటే..</strong>ఇళ్లు, కార్లు కొనేవాళ్లకు గుడ్‍‌న్యూస్: మీ ఈఎంఐ తగ్గనుంది! మీరు ఎంత సేవ్ చేస్తారంటే..

 బ్యాంక్ ఎంఎసీఎల్ఆర్ రేటు

బ్యాంక్ ఎంఎసీఎల్ఆర్ రేటు

మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే తొలుత ఆ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును అడిగి తెలుసుకోండి. ఎంసీఎల్ఆర్ రేటు తెలుసుకుంటే దాని ఆధారంగానే మీరు ఎంత వడ్డీని చెల్లిస్తారో తెలుస్తుంది. ఒకవేళ ఎసీఎల్ఆర్ ఎక్కువగా ఉంటే హోమ్ లోన్ రేట్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందని అర్థం. హై ఇంట్రెస్ట్ మీకు బర్డెన్. అన్ని బ్యాంకులు కూడా వారి ఎంసీఎల్ఆర్ రేటును వారి వెబ్ సైట్లలో ఉంచుతాయి. మీరు వాటిని పోల్చి చూసుకోవచ్చు.

రీసెట్ పీరియడ్

రీసెట్ పీరియడ్

కొన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్‌ను రాత్రికి రాత్రి లేదా నెలకోసారి లేదా ఆరునెలలకు లేదా సంవత్సరానికి డిక్లెర్ చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ, దాదాపు అన్ని బ్యాంకులు కూడా 12 నెలల కాలపరిమితికి హోమ్ లోన్‌లను అనుసంధానం చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు ఆరు నెలలకు లింక్ చేస్తాయి. ఇది రీసెట్ పీరియడ్. ఇలాంటి సందర్భాల్లో హోమ్ లోన్ తీసుకునేవారు 12 నెలల కాలపరిమితిని చూజ్ చేసుకుంటే మీ ఈఎంఐ 12 నెలలకు రీసెట్ చేస్తారు. ఆరు నెలలు ఎంచుకుంటే అప్పుడే చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా 12 నెలల రీసెడ్ పీరియడ్‌తో మార్చి 2019లో హోంలోన్ తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు ఎంసీఎల్ఆర్ 8.9 శాతంగా ఉందని భావిద్దాం. ఆ తర్వాత కాలంలో ఎంసీఎల్ఆర్ ఎన్నిసార్లు తగ్గినా, పెరిగినా, 2020 మార్చిలో ఉన్న ఎంసీఎల్ఆర్ వర్తిస్తుంది.

 మేకప్ ఇన్ లోన్

మేకప్ ఇన్ లోన్

బ్యాంకులు వారి ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించవు. మార్కప్ ఛార్జీలు ద్వారా అనుమతించే అవకాశముంది. చాలా తక్కువ బ్యాంకులు ఈ పద్ధతిని అవలంభిస్తున్నాయి.

ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్‌డ్ రేటు

ఫ్లోటింగ్ రేటు, ఫిక్స్‌డ్ రేటు

మీరు హోం లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేట్లు, ప్లోటింగ్ లేదా ఫిక్స్‌డ్ అని రెండు రకాల వడ్డీ రేట్లను ఎంచుకోవచ్చు. ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ హోంలోన్ అంటే రుణ కాలపరిమితి మొత్తానికి ఒకే వడ్డీ ఉంటుంది. ఎవరైనా పది శాతం ఫిక్స్‌డ్ వడ్డీకి హోంలోన్ తీసుకుంటే అతని ఈఎంఐ రూ.10,000గా ఉంటే, రుణ కాలపరిమితి మొత్తానికి అతడు అదే మొత్తం చెల్లించాలి. ఫ్లోటింగ్ రేట్ అంటే మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి. అందుకు అనుగుమంగా వడ్డీ రేట్లు పెరుగుతాయి, తగ్గుతాయి. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా కూడా మారుతాయి.

English summary

హోంలోన్ తీసుకుంటున్నారా?: ఇవి తెలుసుకోండి, మీ ఈఎంఐ ఈ 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది | Your home loan EMIs will depend on these 3 factors: Find out

If you are looking for a home loan from any bank, there are quite a few things to know before you walk into a bank branch. From April 1, 2016 all banks have been asked to link all their loans including home loans to the bank’s MCLR.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X