For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఎంతో సులభం: ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు స్టెప్ బై స్టెప్

|

ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) సబ్‌స్క్రైబర్స్ తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఉద్యోగిగా ఉన్న సమయంలోను విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ అన్ని సందర్భాలలోనూ వెనక్కి తీసుకోలేం. ఉద్యోగం చేస్తున్నప్పటికీ పీఎఫ్ మొత్తాన్ని ఏయే సందర్భాలలో వెనక్కి తీసుకోగలమంటే.. అనారోగ్యం, పెళ్లి ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, ఇంటి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, ప్రత్యేక సందర్భాల్లో రుణ చెల్లింపులు వంటి సమయాల్లో మాత్రమే పీఎఫ్‌ను వెనక్కి తీసుకోగలం.

పీఎఫ్ సబ్‌స్క్రైబర్స్ నెలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే 75 శాతం విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ గత ఏడాది అనుమతి ఇచ్చింది. వరుసగా రెండు నెలలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే మిగతా 25 శాతం పీఎఫ్ ఖాతా డబ్బులు కూడా ఉపసంహరించుకోవచ్చు. పీఎఫ్ ఉపసంహరణ కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో కూడా సులభంగా దరఖాస్తు చేసుకొని విత్ డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్‌ను ఆన్‌లైన్ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు అంటే..

పన్ను ఆదా కోసం చివరి నిమిషంలో పరుగు: ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్పన్ను ఆదా కోసం చివరి నిమిషంలో పరుగు: ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా ఎలాగంటే?

ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా ఎలాగంటే?

- మొదట ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్‌ను ఓపెన్ చేయండి. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

- ఆ తర్వాత మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత కాప్చా అడుగుతుంది. అది సరిగ్గా ఎంటర్ చేసి, సైనిన్ కావాలి.

- ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కుడివైపున మెంబర్ ప్రొఫైల్ చూడవచ్చు. ఆ తర్వాత 'manage' ట్యాబ్‌ను క్లిక్ చేయండి. KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.

- తర్వాత పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత క్లెయిమ్ (Form-31,19 & 10C)ని ఎంచుకోండి.

- ఇప్పుడు అక్కడ మెంబర్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్‌లోని చివరి నాలుగు నెంబర్లను ఎంటర్ చేయాలి.

- ఆ తర్వాత 'I want to apply for' నుంచి ఫాం 31ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం 'Proceed for online claim' పైన క్లిక్ చేయండి.

 పది రోజుల్లో అకౌంట్లో డబ్బులు

పది రోజుల్లో అకౌంట్లో డబ్బులు

ఆ తర్వాత ఈపీఎఫ్ఓ మీ 'కేవైసీ' వివరాలను కలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రొసీడ్ అవుతుంది. అంటే అప్పుడు మీ విత్ డ్రా ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్రూవ్ అయిన పది రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి.

వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్ ట్రాన్సుపర్ క్లెయిమ్ అవసరం లేదు

వచ్చే ఏడాది నుంచి ఈపీఎఫ్ ట్రాన్సుపర్ క్లెయిమ్ అవసరం లేదు

ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్స్‌కు ఇక్కడ మరో సూచన. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ట్రాన్సుఫర్ క్లెయిమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగం మారగానే ఆటోమేటిక్‌గా పీఎఫ్ అకౌంట్ ఆటోమేటిక్‌గా ఫార్వార్డ్ అవుతుంది. ప్రస్తుత ఏడాదికి మాత్రం ట్రాన్సుఫర్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది దాదాపు 8 లక్షల ఈపీఎఫ్ ట్రాన్సుఫర్స్ వస్తున్నాయి.

Read more about: epf pf online పీఎఫ్
English summary

పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడం ఎంతో సులభం: ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు స్టెప్ బై స్టెప్ | EPF withdrawal: A step by step guide to withdraw Employee Provident Fund online

Retirement fund body EPFO (Employees' Provident Fund Organization) subscribers can withdraw their Employee Provident Fund (EPF) during the course of employment. Last year EPFO allowed its subscribers to withdraw up to 75 per cent of their EPF if unemployed for more than one month and remaining 25 per cent if unemployed for more than two months.
Story first published: Thursday, March 28, 2019, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X