For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ న్యూస్: వీసా డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం, మరిన్ని వివరాలు తెలుసుకోండి

|

వీసా డెబిట్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి మీరు కొనుగోలు చేసే వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ సేవలు కేవలం వీసా డెబిట్ కార్డు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?

ఆన్‌లైన్ కొనుగోళ్లకు వర్తిస్తుంది

ఆన్‌లైన్ కొనుగోళ్లకు వర్తిస్తుంది

ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల నెట్ వర్క్ వీసా.. ఇక నుంచి తన అన్ని రకాల డెబిట్ కార్డులపై ఈఎంఐ (నెలవారీ చెల్లింపు) సదుపాయాన్ని ప్రకటించింది. ఈ కామర్స్ సంస్థల నుంచి జరిపే ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ఆన్‌లైన్ లావాదేవీల పైన మాత్రమే ఈఎంఐ ఉంటుంది.

 22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం

22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం

మన దేశంలో 4.5 కోట్ల క్రెడిట్ కార్డులు, 93 కోట్ల డెబిట్ కార్డులు ఉన్నాయి. 2 కోట్ల యూనిక్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. మొత్తం డెబిట్ కార్డు ఉపయోగించేవారిలో 22 కోట్ల మందికి క్రెడిట్ సౌలభ్యం ఉంటుంది. బ్యాంకులు, మర్చంట్లను ఒక ప్రత్యేక ప్లాట్ ఫాం ద్వారా అనుసంధానం చేయడం ద్వారా విస్తృతస్థాయిలో డెబిట్ కార్డుదారులకు ఈఎంఐ సదుపాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.

 ఇలా ఇదే మొదటిసారి

ఇలా ఇదే మొదటిసారి

ఇప్పటికే కొన్ని ఈ-కామర్స్ సంస్థలు బ్యాంకులతో జతకట్టి డెబిట్ కార్డులపై కూడా ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక్కడ బ్యాంకుకు, మర్చంట్‌కు మధ్య డైరెక్ట్ ఒప్పందం ఉంటుంది. అదే సమయంలో వీసా ప్లాట్ ఫాం విషయానికి వస్తే భాగస్వామ్యమైన ఏ బ్యాంకు అయినా ఏ మర్చంట్‌తో అయినా భాగస్వామ్యం కుదుర్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక పేమెంట్స్ నెట్ వర్క్ కంపెనీ ఈ సదుపాయాన్ని కల్పించడం ఇది తొలిసారి.

English summary

గుడ్ న్యూస్: వీసా డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం, మరిన్ని వివరాలు తెలుసుకోండి | EMI facility on your debit card? Visa introduces new platform: here's all you need to know

The global payments technology company Visa has recently introduced a platform where debit card holders from across the globe can get access to EMI facilities for their online purchases on e-commerce websites.
Story first published: Thursday, March 28, 2019, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X