For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్య‌క్తిగ‌త రుణం విష‌యంలో క్రెడిట్ కార్డు లోన్, ప‌ర్స‌న‌ల్ లోన్ ఏది బెట‌ర్?

లోన్ తీసుకునే విషయంలో క్రెడిట్ కార్డు లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అన్న సందిగ్ధత చాలా మందిలో ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్ధిక నిపుణులు దేనిని సూచిస్తున్నారో చూద్దాం.

|

అత్యవసర సమయాల్లో డబ్బు అవసరం ఏర్పడితే స్నేహితులు లేదా బంధువులు వద్ద అప్పు తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి వద్ద నుంచి సరైన సహాకారం లభించకపోతే క్రెడిట్ కార్డు లేదా పర్సనల్ లోన్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే లోన్ తీసుకునే విషయంలో క్రెడిట్ కార్డు లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అన్న సందిగ్ధత చాలా మందిలో ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్ధిక నిపుణులు దేనిని సూచిస్తున్నారో చూద్దాం.

1. ప‌రిమితిని బ‌ట్టి రుణం

1. ప‌రిమితిని బ‌ట్టి రుణం

క్రెడిట్‌ కార్డుపై ఉన్న పరిమితిని వినియోగించుకోలేని సందర్భంలో ఆ మేరకు కొంత మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రుణం ఈ పరిమితికన్నా అధికంగా ఉండవచ్చు.

2. అన్ సెక్యూర్డ్ రుణాలు

2. అన్ సెక్యూర్డ్ రుణాలు

పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డులపై లోన్‌ రెండూ అన్‌సెక్యూర్డ్‌ రుణాలే. ఈ రెండింటికీ ఎలాంటి కొల్లాటరల్‌ ఉండదు. వడ్డీ రే ట్లు, రుణ మంజూరీకి సంబంధించిన ఫీజులు దాదాపు సమాన స్థాయిలో ఉంటాయి.

తగ్గుతున్న నిల్వ ఆధారంగా వడ్డీ రేటును లెక్కిస్తారు. ఈ రెండు రకాల రుణాలనూ నెలవారీ వాయిదాల ద్వారా చెల్లించవచ్చు.

3. ప్రీ పేమెంట్ పెనాల్టీ

3. ప్రీ పేమెంట్ పెనాల్టీ

వ్యక్తిగత రుణాన్ని కొన్ని ఈఎంఐలు చెల్లించిన తర్వాత ముందస్తుగా మొత్తం రుణాన్ని చెల్లించడానికి కొన్ని బ్యాంకులు అనుమతిస్తాయి. క్రెడిట్‌ కార్డుపై తీసుకున్న రుణాన్ని కూడా ముందుగానే చెల్లించవచ్చు.

వ్యక్తిగత రుణంపై వార్షిక వడ్డీ రేటు 15.5-24 శాతం వరకు ఉంటుంది. క్రెడిట్‌ కార్డు రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు 3 శాతం ప్రీ పేమెంట్‌ పెనాల్టీ ఉంటుం ది. వ్యక్తిగత రుణంపై మాత్రం ఇది ఉండదు.

4. రెండు రుణాల‌కు తేడా

4. రెండు రుణాల‌కు తేడా

క్రెడిట్‌ కార్డు రుణం, వ్యక్తిగత రుణం దాదాపు ఒకే విధంగా కనిపించినా కొన్ని మాత్రం వేరుగా ఉంటాయి. ఉదాహరణకు.. వ్యక్తిగత రుణం తీసుకునే వ్యక్తి ఆ బ్యాంకు కస్టమర్‌గా ఉండాల్సిన అవసరం లేదు. క్రెడిట్‌ కార్డు రుణానికి మాత్రం బ్యాంకు క్రెడిట్‌ కార్డు కలిగి ఉండాలి.

5. ఆదాయం బ‌ట్టి రుణం విష‌యం

5. ఆదాయం బ‌ట్టి రుణం విష‌యం

తక్కువ మొత్తంలో రుణం అవసరం ఉందనుకున్నప్పుడు క్రెడిట్‌ కార్డు రుణాన్ని ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఎక్కువ మొత్తం రుణం కావాలనుకుంటే మాత్రం వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకోవడం మంచిది. వ్యక్తిగత రుణం పొందాలనుకునే వారి ఆదాయం ఎక్కువగా ఉంటే ఎక్కువ రుణం పొందవచ్చు.

6. డాక్యుమెంట్ల విష‌యంలో

6. డాక్యుమెంట్ల విష‌యంలో

క్రెడిట్‌ కార్డుపై రుణం పొందడం సులభం. ఈ రుణానికి దరఖాస్తు చేసే సందర్భంలో ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్‌ కార్డు రుణాన్ని ఆన్‌లైన్‌ ద్వారా లేదా బ్యాంకు హెల్ప్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు. కొన్ని గంటల్లోనే ఈ రుణానికి అనుమతి లభిస్తుంది. అనుమతి రాగానే సంబంధిత సొమ్ము ఖాతాలో జమవుతుంది.

7. రుణం వ‌చ్చే స‌మ‌యం

7. రుణం వ‌చ్చే స‌మ‌యం

వ్యక్తిగత రుణం కోసం ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అడ్రస్‌ ప్రూప్‌, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, సాలరీ స్లిప్‌లను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిన్నింటినీ పరిశీలించి రుణాన్ని మంజూరు చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.

8. ముగింపు

8. ముగింపు

అత్యవసరంగా డబ్బుల అవసరం ఏర్పడితే స్నేహితులు లేదా బంధువుల దగ్గర అప్పు తీసుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ అన్ని సందర్భాల్లో వీరి నుంచి తగిన ఆర్థిక సహకారం లభించకపోవచ్చు. ఇలాంటి తరుణంలో క్రెడిట్‌ కార్డు ద్వారా లేదా వ్యక్తిగత రుణం ద్వారా అవసరానికి తగిన స్థాయిలో సొమ్మును పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే అప్పు తీసుకునే విషయంలో క్రెడిట్‌ కార్డు రుణానికి ప్రాధాన్యం ఇవ్వాలా లేక వ్యక్తిగత రుణానికి ఓటు వేయాలా అన్న సందిగ్ధత చాలా మందిలో ఉంటుంది. పై పాయింట్ల‌న్నీ చ‌దివి రెండింటిలో మీకు ఏది సూట‌వుతుందో చూసుకుని తెలివైన నిర్ణ‌యం తీసుకోండి

Read more about: credit card personal loan
English summary

వ్య‌క్తిగ‌త రుణం విష‌యంలో క్రెడిట్ కార్డు లోన్, ప‌ర్స‌న‌ల్ లోన్ ఏది బెట‌ర్? | which is best credit card loan OR personal loan

Credit card provides you with the facility of cash withdrawal but it is quite costly in terms of the interest expense. Let’s say you have an emergency cash requirement and you have only one or two days in your hand.
Story first published: Thursday, January 4, 2018, 14:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X