English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ఎప్పుడు వెన‌క్కు తీసుకోవాలి?

Written By:
Subscribe to GoodReturns Telugu

చాలా మంది పెట్టుబ‌డుల‌ను ల‌క్ష్యాల కోసం కాకుండా పొదుపు కోసం పెడుతుంటారు. అందుకే మార్కెట్ క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి మ‌ళ్లీ అద‌న‌పు పెట్టుబ‌డుల‌ను పెట్ట‌డం, లాభాల కోసం పెట్టుబ‌డుల‌ను వెక్కి తీయ‌డం వంటివి చేస్తుంటారు. లాభాలు పంచే మదుపు సాధనం నుంచి నిష్క్ర‌మించేందుకు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. ఒక ఫండ్ స్కీమ్‌ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేటప్పుడు, తిరిగి పెట్టుబడులు చేసేటప్పుడు ఎదురయ్యే రిస్క్‌లు, లావాదేవీల ఛార్జీలు వంటివాటిని పరిశీలించాలి. ఇందుకోసం ఏయే విష‌యాలు గ‌మ‌నించాలో ఈ కింద తెలుసుకుందాం.

1. మార్కెట్లు ఆల్‌టైం గరిష్టాలను చేరుకున్నాయి కాబట్టి.. ఇప్పుడు యూనిట్స్ అమ్మేయచ్చా?

1. మార్కెట్లు ఆల్‌టైం గరిష్టాలను చేరుకున్నాయి కాబట్టి.. ఇప్పుడు యూనిట్స్ అమ్మేయచ్చా?

మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నపుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ చేయాలని చాలామంది ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అలాగే మార్కెట్లు పతనం అవుతున్నపుడు కూడా వీలైనంత త్వరగా పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకోవ‌డం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని అనుకుంటారు. అయితే, మార్కెట్ల కదలికలను అంచనా వేయడం ఏ ఇన్వెస్టర్‌కు సాధ్యమయ్యే విషయం కాదని, వారి వ్యూహానికి వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉందని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు చెపుతుంటారు. లాభాల‌ను స్వీక‌రించ‌డం, నష్టాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టడం వంటి చర్యలను మీ ఫండ్ మేనేజర్ ఇప్పటికే ప్రారంభించి ఉంటారనే విషయాన్ని మదుపర్లు గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలికంగా అంతగా ప్రయోజనం చేకూర్చని స్టాక్స్‌ను విక్రయించడం, మైరుగైన రాబ‌డులుండే కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. అందుకే మార్కెట్లు పెరుగుతున్నాయనో.. పతనం అవుతున్నాయనో.. ఇప్పటికిప్పుడు ఫండ్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు.

2.నేను తీసుకున్న స్కీమ్ అంతగా బాగా ఉండ‌టం లేదు, నిష్క్ర‌మించాలా?

2.నేను తీసుకున్న స్కీమ్ అంతగా బాగా ఉండ‌టం లేదు, నిష్క్ర‌మించాలా?

మీరు తీసుకున్న ఫండ్ స్కీమ్ కొంతకాలంగా అండర్‌పెర్ఫామ్ చేస్తూ ఉంటే, మీ పెట్టుబడిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అర్ధం చేసుకోవాలి. ఒకవేళ మీరు పెట్టుబడి చేసిన లక్ష్యానికి తగినట్లుగా ఆ ఫండ్ ప్రదర్శన లేకపోయినా, ఓ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించిన అనంతరం, ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ తీసుకోవడం సమంజసం.

 3.నాకు హ‌ఠాత్తుగా డబ్బులు కావాలి. నేను మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌ను రెడీమ్ చేసుకోవచ్చా?

3.నాకు హ‌ఠాత్తుగా డబ్బులు కావాలి. నేను మ్యూచువల్ ఫండ్ యూనిట్స్‌ను రెడీమ్ చేసుకోవచ్చా?

ఓపెన్-ఎండ్ మ్యూచువల్ ఫండ్స్‌కు లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ముందుగా ప్రణాళిక చేయని ఖర్చు కోసం మీకు నగదు అవసరం ఉంటే, తప్పని అవసరం అయితే.. అపుడు లిక్విడ్, కంజిటెన్సీ ఫండ్‌ వైపు చూడడం సహజం. అయితే, ఏదైనా నిర్ణీత లక్ష్యం కోసం చేసిన పెట్టుబడులలో యూనిట్స్‌ను మాత్రం కదిలించవద్దు. దీనిపై పన్ను భారం ఉండవచ్చు, అలాగే ఎగ్జిట్ లోడ్ కూడా ఛార్జ్ చేయవచ్చు.

4.నా లక్ష్యాల‌కు ఇంకా ఏడాది దూరం మాత్రమే ఉంది. నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని రెడీమ్ చేసుకోవచ్చా?

4.నా లక్ష్యాల‌కు ఇంకా ఏడాది దూరం మాత్రమే ఉంది. నేను ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని రెడీమ్ చేసుకోవచ్చా?

పిల్లల ఎడ్యుకేషన్, పెళ్లి, కారు కొనడం, విదేశీ ప్రయాణం వంటివాటి కోసం అనేక మంది ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు చేస్తుంటారు. వారి లక్ష్యం సుమారుగా ఓ ఏడాది దూరంలో ఉండగా ఆతృత మొదలైపోతుంది. ఇలాంటి సమయంలో డెట్ ఫండ్, లిక్విడ్ ఫండ్‌ను సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్‌కు మార్చడం, లేదా మొత్తం నగదు అంతా డెట్ ఫండ్‌లోకి మార్చడం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఈక్విటీ మార్కెట్ల ఊగిసలాట సమయంలో ఫండ్స్‌లో వచ్చే మార్పులను ఎవాయిడ్ చేయవచ్చు.

5.ఈక్విటీ మార్కెట్ల పెరుగుదల కారణంగా నా అస్సెట్ అలాకేషన్ మారిపోయింది. కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయించవచ్చా?

5.ఈక్విటీ మార్కెట్ల పెరుగుదల కారణంగా నా అస్సెట్ అలాకేషన్ మారిపోయింది. కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయించవచ్చా?

మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉన్నాయని నిర్ధారించుకునేందుకు, మీ రిస్క్ ప్రొఫైల్‌కు తగినట్లుగా పెర్ఫామ్ చేస్తున్నాయని ధృవీకరించుకునేందుకు.. అస్సెట్ అలాకేషన్ నిబంధనలను తప్పనిసరిగా ఫాలో కావాలని, ఏడాదికోమారు పోర్ట్‌ఫోలియోను సమీక్షించాలని ఫైనాన్షియల్ ప్లానర్స్ సలహా ఇస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లు పెరిగినప్పుడు లేదా తగ్గినపుడు.. మీ అస్సెట్ అలాకేషన్ 5 శాతం వరకూ మార్పు చెందినట్లయితే.. అంతవరకూ మార్పులు అవసరం లేదు. ఉదాహరణకు మీ ఈక్విటీల కేటాయింపు 60శాతం అనుకుంటే.. మార్కెట్లు పెరిగినపుడు అది 70 శాతానికి చేరిందని భావిద్దాం. అపుడు పోర్ట్‌ఫోలియోను తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ఈక్విటీ యూనిట్స్‌ను విక్రయించి డెట్‌ ఫండ్స్‌లోకి మార్చుకోవాలి.

English summary

selling your mutual fund units keep these points in mind

Obviously the investment goal with which you have made your money parked in mutual fund kitty will push you to pull out the funds from these investments. Nonetheless you should note these important points before redeeming mutual fund units
Story first published: Tuesday, January 9, 2018, 11:02 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns