English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

రిస్క్ కెపాసిటీని బ‌ట్టి ఎవ‌రికి ఏ ర‌క‌మైన ఫండ్లు?

Written By:
Subscribe to GoodReturns Telugu

ప్ర‌స్తుత సాంకేతిక యుగంలో అవ‌స‌రానికి తగ్గట్టు సమయానికి త‌గినంత‌ డబ్బు సమకూర్చుకోవాలి. లేకపోతే కష్టాలు తప్పవు. అయితే సంపాద‌న త‌క్కువ ఉన్నా ఖ‌ర్చులు మాత్రం ఆగ‌వు. అలాగ‌ని అంద‌రి జీతాలు 5,6 అంకెల్లో ఉండ‌వు. అలాంట‌ప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారానూ ఆర్థిక అవసరాల నుంచి గట్టెక్కవచ్చు. అదెలాగంటే....

ప్ర‌తి మ‌నిషి ఆర్థిక అవ‌స‌రాల‌ను మూడు ర‌కాలుగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. అవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘ కాలిక అవసరాలు. స్టాక్‌ మార్కెట్లో పెద్దగా రిస్కు తీసుకోలేని ఇన్వెస్టర్లు వారి వారి అవసరాలకు అనువైన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఎంచుకోవచ్చు. ఇందుకోసం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అనేక రకాల పథకాలను అందిస్తున్నాయి. వాటి గురించి మ‌రింత లోతుగా తెలుసుకుందాం.

స్వల్పకాలిక లక్ష్యాల కోసం..

స్వల్పకాలిక లక్ష్యాల కోసం..

ఏడాది లోపే సాధించాల్సిన వాటిని ఆర్థిక ప‌రిభాష‌లో స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాలుగా పేర్కొన‌వ‌చ్చు. ఇందుకోసం పెట్టే పెట్టుబడుల కాల పరిమితి చాలా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ఈ తరహా పెట్టుబడులపై రాబడులు స్వ‌ల్పంగానే ఉన్నా, పెట్టుబడులకు ఏమాత్రం ఢోకా ఉండకూడదని పెట్టుబ‌డిదారులు కోరుకుంటారు. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకుని వాడుకునేలా ఈ పెట్టుబడులు ఉండాలి.

ఇలాంటి ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే స్వల్పకాలిక డెట్‌ ఫండ్స్ వైపు మొగ్గుచూప‌డం మంచిది. ఈ పథకాల పెట్టుబడులపై అసలుకు దాదాపుగా ఢోకా ఉండదు. రాబడులూ బ్యాంకుల పొదుపు ఖాతా డిపాజిట్లపై చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగానే ఉంటాయి. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న తరుణంలో వీటిలో పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా మారాయి. కాకపోతే నిర్ణీత వ్యవధి కంటే ముందే ఈ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలంటే కొంత ఎగ్జిట్‌ లోడ్‌(నిష్క్ర‌మ‌ణ రుసుము) చెల్లించాల్సి ఉంటుంది. ఫండ్‌ హౌజ్‌ను బట్టి ఇది అర శాతం నుంచి రెండు శాతం వరకు ఉంటుంది. రుణ పత్రాల్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసే లిక్విడ్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ సమస్యలూ ఉండవు.

మధ్యకాలిక లక్ష్యాల కోసం..

మధ్యకాలిక లక్ష్యాల కోసం..

ఏడాది నుంచి ఐదేళ్ల లోపు పూర్తి చేయాల్సిన ఆర్థిక లక్ష్యాలను మధ్య కాలిక లక్ష్యాలు అంటారు. ఆస్తులు, వాహనాల కొనుగోళ్ల కోసం చేసే డౌన్‌ పేమెంట్లు, పిల్లల పెళ్లి ఖర్చులు లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం వంటి ‘ఆర్థిక' లక్ష్యాలు ఈ కోవలోకి వస్తాయి. ఇందుకోసం పెట్టుబడులకు పెద్దగా రిస్కు లేకుండా కనీస సగటు రాబడులైనా ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాన్ని ఎంచుకోవాలి. మార్కెట్‌ ఆటుపోట్లతో ఈ ఫండ్‌లో మదుపరుల పెట్టుబడులకు ఢోకా కూడా ఉండకూడదు. ఈక్విటీ షేర్లతో పాటు, రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టే బ్యాలెన్స్‌డ్‌ మరియు హైబ్రిడ్‌ ఫండ్స్‌ ఇందుకు అత్యంత అనువుగా ఉంటాయి. రెండేళ్లలోపు ల‌క్ష్యాలు ఉండేలా మీ అవసరాలుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌కే చెందిన నెలవారీ ఆదాయ పథకాలను ఎంచుకోవాలి. ఈ పథకాలు తమ పెట్టుబడి నిధుల్లో శాతం మాత్రమే ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసి, మిగతా మొత్తాన్ని రుణ పత్రాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. లేదా ఐదేళ్ల వరకు వేచి చూడగలిగితే మీ పెట్టుబడుల్లో 35 శాతం వరకు ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే రుణ పథకాన్ని ఎంచుకోవడం మంచిది. దీన్లో ఎక్కువ‌గా రిస్కు ఉన్నా, మార్కెట్ ప‌నితీరు మంచిగా ఉంటే రాబ‌డులు అదే రీతిలో ఉంటాయి.

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం...

దీర్ఘకాలిక లక్ష్యాల కోసం...

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణమైన పథకాలను షేర్ల లానే మ్యూచుల్‌ ఫండ్‌ సంస్థలు అందిస్తున్నాయి. ఐదేళ్లకు పైబడి వేచి చూడగల ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాలను ఎంచుకోవడం మంచిది. ఈ పథకాల రాబడులు మార్కెట్‌ ఆటుపోట్లపై ఆధారపడి ఉంటాయి. మార్కెట్‌ బాగుంటే అత్యధిక రాబడులు పొందవచ్చు. లేకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని సైతం ప్ర‌తి ఇన్వెస్ట‌ర్లు గుర్తు పెట్టుకోవాలి. అయితే ఐదేళ్లకు మించి ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులు కొనసాగించిన మదుపరులు గత పదేళ్లలో మంచి రాబడులే పొందారు. గత పదేళ్ల సగటును తీసుకున్నా ఈ పథకాలపై సగటున 10 నుంచి 15 శాతం మ‌ధ్య రాబడులు అందాయి.

ఈక్విటీ పథకాల్లో పెట్టే దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై పన్నుల భారం కూడా పెద్దగా ఉండదు. ఏదైనా ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేసి ఏడాది తర్వాత అమ్ముకుంటే వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. ఈ పథకాల ద్వారా ఏటా అందే రూ.10 లక్షల డివిడెండ్‌ ఆదాయానికీ ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. వార్షిక డివిడెండ్‌ ఆదాయం రూ.10 లక్షలు దాటితే మాత్రం మీ ఆదాయ శ్లాబును బట్టి పన్ను చెల్లించాలి.

ఈక్విటీ పథకాల్లో లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌, ఈల్‌ఎ్‌సఎస్‌, డైవర్సిఫైడ్‌ పేరుతో చాలా రకాలు ఉన్నాయి. పెద్దగా రిస్కు లేకుండా వీలైనంత అధిక రాబడుల కోసం అన్ని రకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. స్మాల్‌ క్యాప్‌ ఈక్విటీ పథకాలతో పోలిస్తే లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులకు భద్రత ఎక్కువ. రాబడులూ అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో రిస్కుతోపాటు, మార్కెట్‌ బాగుంటే రాబడులూ అత్యధికంగా ఉంటాయి.

ఎంపిక ఎలా?

ఎంపిక ఎలా?

ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే ముందు అనేక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ పథకంలో దీర్ఘకాలిక రాబడులు, ఖర్చుల వివరాలు, ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డ్‌, ఇన్వె్‌స్టమెంట్‌ పోర్టుఫోలియో, టర్నోవర్‌ రేషియో, ఆ పథకానికి ఉన్న రేటింగ్‌లు వంటి విషయాలు తెలుసుకోవాలి. ఇంకా అనుమానాలు ఉంటే ఎవరైనా మంచి ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించాకే ఆ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలి.

English summary

how to select mutual fund according to time frame which is suitable for you

It's important to understand that each mutual fund has different risk and reward profiles. In general, the higher the potential return, the higher the risk of potential loss. Although some funds are less risky than others, all funds have some level of risk – it's never possible to diversify away all risk – even with so-called money market funds. This is a fact for all investments. Each mutual fund has a predetermined investment objective that tailors the fund's assets, regions of investments and investment strategies.
Story first published: Saturday, January 6, 2018, 14:18 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns