English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఫండ్ ద్వారా సిప్ పెట్టుబ‌డులు పెడుతున్నారా? అయితే ఇవి మీ కోస‌మే...

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

చాలా మంది పెట్టుబ‌డులు పెట్టేది ఎందుకంటే ఆదాయ‌పు ప‌న్ను ప‌డ‌కుండా త‌ప్పించుకునేందుకు లేదా అవ‌స‌ర‌మైన దాని కంటే ఎక్కువ డ‌బ్బు ఉంద‌నే విష‌యం చెప్ప‌క‌పోయినా ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల‌కు తెలుస్తుంది. చాలా ర‌కాల పెట్టుబ‌డులు ఎటువంటి ల‌క్ష్యాల్లేకుండా జ‌రిగిపోతుంటాయి. మ‌ళ్లీ ఆ డబ్బును బ‌య‌ట‌కు తీసిన త‌ర్వాత దేనికో ఖ‌ర్చు పెడ‌తారు. ఈ మ‌ధ్య చాలా మంది మిత్రులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని తెలిసి ఆ వైపు సైతం మొగ్గుచూపుతున్నారు. అయితే ఒక ల‌క్ష్యం ఉండి పెట్టుబ‌డి పెడితే మంచిది. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం ఉండి ఒక నిర్దిష్ట‌మైన మొత్తాన్ని సాధించాలంటే మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ఒక మంచి మార్గం. ఈ విధంగా పెట్టుబ‌డులు పెట్టాలంటే ఎటువంటి ప్రణాళిక అవ‌స‌రం, ఏయే విష‌యాలు ఆలోచించి ఉండాల‌నే విష‌యం ఇక్క‌డ తెలుసుకుందాం.

1. ల‌క్ష్యం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్య‌త‌

1. ల‌క్ష్యం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్య‌త‌

నెల‌వారీ చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ కొంత కాలానికి ఎక్కువ డ‌బ్బు సంపాదించేందుకు మ్యూచువ‌ల్ ఫండ్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక 3 లేదా 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఒక విదేశీ ప్ర‌యాణం లేదా ఒక కారు కొనుగోలు వంటివి నిర్దిష్ట‌మైన ల‌క్ష్యాన్ని తెలియజేస్తాయి. లేదా పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, వివాహం వంటివి దీర్ఘకాల ల‌క్ష్యాల కింద‌కు వ‌స్తాయి. ఇప్పుడు మ‌న‌కు వ‌చ్చే సంపాద‌న‌తో మ‌నం క‌నే క‌ల‌లు, మ‌న ల‌క్ష్యాలు వెంట‌నే నెర‌వేర‌క‌పోవ‌చ్చు. కానీ క్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్టుకుంటూ పోతే మ‌న ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అందుకే మొద‌ట సిప్ ప్రారంభానికి ముందు మీ అవ‌స‌రాలు, కోరిక‌లు, ల‌క్ష్యాల జాబితాను తెలుసుకుని ముందుకు సాగండి.

2. ఎంత కాలానికి పెట్టుబ‌డి

2. ఎంత కాలానికి పెట్టుబ‌డి

ఒక‌టి, రెండేళ్ల లోపు చేరుకునే ల‌క్ష్యాలు స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాలుగా భావించండి. ఇలాంటి వాటి కోసం సిప్ మార్గంలో పెట్టుబ‌డి పెడితే చాలా భ‌ద్ర‌మైన‌, సుర‌క్షిత‌మైన వాటిలో పెట్టుబ‌డి పెట్టాలి. ఈ సంద‌ర్భంలో ఒక్కోసారి మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లే సూచ‌నీయం కూడా. 3 నుంచి 5 ఏళ్ల కాలానికి పెట్టే పెట్టుబడులు మ‌ధ్యకాలిక పెట్టుబ‌డుల కింద‌కు వ‌స్తాయి. ఇలాంట‌ప్పుడు ఏమీ ఆలోచించ‌కుండా ఈక్విటీ ఫండ్ల వైపు మొగ్గుచూపొచ్చు. స‌మ‌తౌల్యం కోసం డెట్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. గత కొన్నేళ్ల‌లో ప్ర‌భుత్వం తీసుకున్న సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణ‌లో ఉండ‌టం, క‌రెన్సీ స్థిర‌త్వం వంటి వాటి మూలంగా వీటి ఫ‌లాలు 2020-22 మ‌ధ్య పెట్టుబ‌డిదారుల‌కు అందుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ మ్యూచువ‌ల్ ఫండ్ రాబ‌డులు సైతం వ‌చ్చే మూడేళ్ల‌లో దాని వ‌ల్ల ప్ర‌భావితం అవుతాయ‌ని పైసాబ‌జార్.కామ్ మ్యూచువ‌ల్ ఫండ్ విభాగాధిప‌తి మ‌నీష్ కొఠారి చెప్పారు.

3. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏ ర‌కాల‌ను ఎంచుకోవాలి?

3. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఏ ర‌కాల‌ను ఎంచుకోవాలి?

స‌రైన కాలంలో స‌రైన పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకోవ‌డం ఆస్తులను పెంచుకోవ‌డంలో ముఖ్య‌మైన‌ది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మీరు లిక్విడ్ ఫండ్లు, ఈక్విటీ, డెట్ ఫండ్ గురించి మొద‌ట తెలుసుకోవాలి. లిక్విడ్ ఫండ్ల‌ను స్వ‌ల్ప‌కాలానికి ఎంచుకోవాలి. మ‌ధ్య‌కాలిక ల‌క్ష్యాల కోసం కొంచెం డెట్, కొంచెం ఈక్విటీ ఫండ్ల‌లోనూ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో ఉంచ‌డం ముఖ్యం. అదే దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం అయితే ఈక్విటీ లేదా ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు.

4. సిప్ మార్గంలో పెట్టుబ‌డులు

4. సిప్ మార్గంలో పెట్టుబ‌డులు

క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన పెట్టుబ‌డులు అలవాట‌య్యేందుకు సిప్ మార్గం ఉప‌క‌రిస్తుంది. మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముఖ్యంగా రెండు మార్గాలు ఉంటాయి. ఒక‌టి ఒకేసారి పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం, లేదా క్ర‌మానుగ‌తంగా సిప్ మార్గంలో పెట్టుబ‌డి పెట్ట‌డం. సిప్ పెట్టుబ‌డులు అంటే ఏమో తెలియ‌న‌ప్ప‌టికీ ఈ ప‌దం అయితే చాలా మంది వినే ఉంటారు. సిప్‌(సిస్ట‌మ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) పెట్టుబ‌డి అంటే వారం, నెల‌వారీ, త్రైమాసిక కాల‌ప‌రిమితుల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశం క‌ల్పించేది. సిప్ మార్గంలో డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టేందుకు మార్కెట్‌ను అంచ‌నా వేయాల్సిన అవ‌సరం లేదు. మార్కెట్ ఎలా ఉన్నా సిప్ ద్వారా వ‌చ్చే రాబ‌డుల్లో పెద్ద‌గా మార్పుండ‌దు. ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెడ‌తుంటే మాత్రం అది దీర్ఘ‌కాలానికి అని గుర్తుంచుకోవాలి. క‌నీసం 5 నుంచి 7 ఏళ్ల ల‌క్ష్యం ఉంటేనే ఈక్విటీ పెట్టుబ‌డుల వైపు మ‌ళ్లండి.

5. స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కం

5. స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కం

మీరు పెట్టుబ‌డి పెట్టే మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీకి మార్కెట్లో ఎంత పేరుందో తెలుసుకోండి. ఫండ్ హౌస్ ల‌క్ష్యం ఏమి ఉంది, మ‌న ల‌క్ష్యాల‌ను సాధించేందుకు అది స‌రైన దిశ‌లో సాగుతుందో లేదో ఆలోచించుకోవాలి. గ‌త సంవ‌త్స‌ర కాలంలో, మూడేళ్ల‌లో, ఐదేళ్లలో దాని ప‌నితీరు ఎలా ఉందో గ‌మ‌నించాలి. ఈక్విటీ ఫండ్స్ విష‌యంలో దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 3-5 ఏళ్ల రాబ‌డులు, డెట్ ఫండ్ల విష‌యంలో 1, 3 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో వ‌చ్చిన రాబ‌డుల‌ను ప‌రిశీలించడం మంచిది. అంతే కాకుండా ఎగ్జిట్ లోడ్‌, ఎక్స్‌పెన్స్ రేషియో, రిక‌రింగ్ కాస్ట్ వంటివి సైతం చూస్తే ఫండ్ గురించి మ‌రింత అవ‌గాహ‌న వ‌స్తుంది.

6. సిప్ తేదీ, బ్యాంకు ఖాతా

6. సిప్ తేదీ, బ్యాంకు ఖాతా

మీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు ఎప్పుడు ఉంటాయనే దాన్ని బ‌ట్టి సిప్ తేదీని జాగ్ర‌త్త‌గా ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీకు వేత‌నం 1వ తేదీ వ‌స్తుంద‌నుకుంటే 2 నుంచి 5 లోపు సిప్ పెట్టుకుంటే మంచిది. సిప్ పెట్టుబ‌డుల‌కు స‌మానమైన డ‌బ్బుల‌ను ఎప్పుడూ ఒక నెల ముందు నుంచే సిద్దంగా ఉంచుకునేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సిప్ డీఫాల్ట్ అవ్వ‌కూడ‌దు.

Read more about: mutual fund, investments
English summary

what to know before investing in mutual fund sip

determining the goal is the important factor in investments. It is important to know why you want to start the SIP – Is it for the corpus that you want for your retirement or for the higher education of your kids or the bunglow you want to build at age 50 or maybe the big car you want to buy after 5 years or so. Once you are clear about what is the goal that you should start the SIP. We all know that with our current or even possible future income it will not be enough to fulfil all these goals.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns