For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్య‌క్తిగ‌త రుణం-తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు

వ్య‌క్తిగ‌త రుణానికి సంబంధించి బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు, గోల్డ్ లోన్ కంపెనీలు అంత‌గా ఇబ్బందులు లేకుండానే ప్ర‌యివేటు ఉద్యోగుల‌కు రుణ స‌దుపాయం క‌ల్పిస్తాయి. అలాంటి వ్యక్తిగ‌త రుణానికి సంబంధించి ద‌ర

|

ప్ర‌స్తుత వినిమ‌య ప్ర‌పంచంలో ఏదో అవ‌స‌రం కోసం అప్పు చేస్తూనే ఉంటాం. బ్యాంకులు మాత్రం క్రెడిట్ స్కోర్ చూసిన త‌ర్వాతే అప్పులు ఇవ్వ‌డానికి ఆస్త‌కి చూపిస్తాయి. అయితే వ్య‌క్తిగ‌త రుణానికి సంబంధించి బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు, గోల్డ్ లోన్ కంపెనీలు అంత‌గా ఇబ్బందులు లేకుండానే ప్ర‌యివేటు ఉద్యోగుల‌కు రుణ స‌దుపాయం క‌ల్పిస్తాయి. అలాంటి వ్యక్తిగ‌త రుణానికి సంబంధించి ద‌ర‌ఖాస్తు స్థాయి నుంచి వివిధ ద‌శ‌ల్లో అవ‌స‌ర‌మైన వివ‌రాల‌ను తెలుసుకుందాం.

1. త‌క్కువ వేత‌నం ఉన్నా స‌రే... వ్య‌క్తిగ‌త రుణం

1. త‌క్కువ వేత‌నం ఉన్నా స‌రే... వ్య‌క్తిగ‌త రుణం

అవసరం ఏదైనా గానీ అర్హత ఉంటే వ్యక్తిగత రుణం వెంటనే లభిస్తుంది. ఈ రుణం కోసం చాంతాండంత ప్రక్రియ ఉండదు. వేతన జీవులు లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు తగిన ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం ద్వారా రుణాన్ని సంపాదించవచ్చు. మొత్తం నెల‌ ఆదాయంలో 40 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని ఖరారు చేస్తారు. రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు అర్హతను బట్టి రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్లలోపే ఉంటుంది. వడ్డీ ఎంతుంటుందన్న విషయాన్ని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. రుణం తిరిగి చెల్లించే సత్తా, వేతన స్థాయి, రుణ చరిత్ర ఇలాంటి విషయాలను కంపెనీలు, బ్యాంకులు చూస్తాయి. 13 శాతం నుంచి 32 శాత వరకు వడ్డీ విధించవచ్చు. అర్హత సరిపోకపోతే మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల్లో దరఖాస్తుదారుల అర్హతకు అనుగుణంగా ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంకులు విధిస్తున్నాయి.

2. వ్య‌క్తిగ‌త రుణంపై వడ్డీ రేట్లు

2. వ్య‌క్తిగ‌త రుణంపై వడ్డీ రేట్లు

ఐసీఐసీఐ బ్యాంకు 11.59% - 18.49% వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కింద 0.5 - 2.25% వరకు చార్జ్ చేస్తోంది. ముందస్తు రుణం చెల్లింపులపై 5 శాతం జరిమానాగా చెల్లించుకోవాలి.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 10.99% - 19.80% వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ చార్జీ 1.75 - 2.25% ఉంది. రుణం పది లక్షల రూపాయలు దాటి ఉంటే ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. లేకుంటే 4 శాతం వసూలు చేస్తోంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.60% - 1510% వడ్డీను వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు 1.01% శాతమే. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు.

బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేట్లు 15 శాతం నుంచీ ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంది. ముందస్తు రుణం తీర్చివేతపై 4 శాతం రాబడుతోంది.

3. మీ ఆదాయం ఎంత‌?

3. మీ ఆదాయం ఎంత‌?

ప‌ర్స‌న‌ల్ లోన్ ద‌ర‌ఖాస్తు చూడ‌గానే రుణం ఇచ్చే సంస్థ‌లు మొద‌ట ప‌రిశీలించే అంశం మీ ఆదాయం ఎంత అని. మీ వృత్తి, మీ పెట్టుబ‌డులు, అద్దె ఆదాయం వంటి వాటిని చూసి మీ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఆదాయాన్ని బ‌ట్టి రెండు అంశాల‌ను బేరీజు వేస్తారు. మీరు ఎంత త్వ‌ర‌గా రుణాన్ని తిరిగి చెల్లించ‌గ‌ల‌రు, ఎంత రుణ అర్హ‌త ఉంది అనేవి తెలుసుకోవ‌చ్చు. ఇందుకోసం రుణ సంస్థ‌లు మీ శాల‌రీ స్లిప్పులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇత‌ర ఆర్థిక వివ‌రాల‌ను అడ‌గ‌వ‌చ్చు.

4. క్రెడిట్ స్కోర్‌

4. క్రెడిట్ స్కోర్‌

వ్య‌క్తిగ‌త రుణం కావాలంటే మీకు క్రెడిట్ స్కోర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. మీ రుణ చ‌రిత్ర‌, ఇంత‌కు ముందు మీరు అప్పులు చెల్లించిన తీరు, మీకు ఉన్న అప్పుల సంఖ్య, ఎంత త‌రుచుగా మీరు అప్పులు తీసుకుంటున్నారు అనే అంశాల‌పై క్రెడిట్ స్కోర్ ఆధార‌ప‌డి ఉంటుంది. సాధార‌ణంగా 750 ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఒక్కోసారి మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా కూడా వ‌డ్డీ రేటును నిర్ణ‌యిస్తారు. క్రెడిట్ కార్డు బిల్లు ఆల‌స్యంగా చెల్లించ‌డం, ఒక‌టి కంటే ఎక్కువ‌గా క్రెడిట్ కార్డులు క‌లిగి ఉండ‌టం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తాయి.

5. స్తోమ‌త ఆధారంగా రుణం

5. స్తోమ‌త ఆధారంగా రుణం

చాలా సులువుగా తీసుకోగ‌ల రుణాల్లో వ్య‌క్తిగ‌త రుణం ఒక‌టి. దీన్ని తీసుకునేట‌ప్పుడు రుణం అందించే సంస్థ నుంచి ఎక్కువ‌గా ఇబ్బందులు ఎదురుకావు. మిగిలిన వాటితో పోలిస్తే స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయి. అయితే వీటిలో వ‌డ్డీ రేట్లు 12 నుంచి 30 శాతం వ‌ర‌కూ ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాన్ని చేసే ఉద్యోగం, స్వ‌యం ఉపాధి వ‌ర్గాల ఆర్థిక స్తోమ‌త ఆధారంగా దాదాపు రూ.10 వేల నుంచి సుమారు రూ.2 కోట్ల వ‌ర‌కూ మంజూరు చేస్తారు. వ్య‌క్తిగ‌త రుణాలు అధిక వ‌డ్డీ చెల్లింపుతో కూడుకుని ఉంటాయి. అత్య‌వ‌స‌రాల్లో సుల‌భంగా ల‌భించినా ఇవి కాస్త ఆర్థిక భారం క‌లిగించేవిగా ఉంటాయి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ వ్య‌క్తిగ‌త రుణాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది. ఒక వేళ తీసుకున్నా త‌క్కువ కాలంలోనే చెల్లించ‌డం ద్వారా అధిక వ‌డ్డీ రేట్ల‌ను చెల్లించ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డొచ్చు.

Read more about: personal loan రుణం loan
English summary

వ్య‌క్తిగ‌త రుణం-తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు | how to get personal loan what is eligibility criteria

what is procedure to get personal loan?how much personal loan i will get if i am an private employee?
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X