For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట‌ర్మ్ పాల‌సీ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విష‌యాలు

మార్కెట్లో వివిధ కంపెనీల ట‌ర్మ్ పాల‌సీలు ల‌భ్య‌మ‌వుతున్నాయి. మీ జీవ‌న‌శైలికి న‌ప్పే ప్లాన్‌ను చూసుకోవాలి. త‌ద్వారా మీరు లేని స‌మ‌యంలో మీ కుటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ట‌ర్మ్ ప్లాన్‌

|

మార్కెట్లో వివిధ కంపెనీల ట‌ర్మ్ పాల‌సీలు ల‌భ్య‌మ‌వుతున్నాయి. మీ జీవ‌న‌శైలికి న‌ప్పే ప్లాన్‌ను చూసుకోవాలి. త‌ద్వారా మీరు లేని స‌మ‌యంలో మీ కుటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ట‌ర్మ్ ప్లాన్‌కు సంబంధించిన వివిధ ముఖ్యాంశాల గురించి చూద్దాం.

ప‌రిపూర్ణ జీవిత బీమా

ప‌రిపూర్ణ జీవిత బీమా

ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌నే అస‌లైన జీవిత బీమా. దీని ద్వారా మీ కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక ర‌క్ష‌ణ ల‌భించిన‌ట్లే. దీన్ని పూర్తి జీవిత బీమా అని ఎందుకంటారంటే ఇది పాల‌సీదారు మ‌ర‌ణించిన‌ప్పుడు మాత్ర‌మే క‌వ‌రేజీని అందిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ ఏదైనా పొదుపు, పెట్టుబ‌డులు లేక‌పోయినా కుటుంబానికి పాల‌సీ బీమా హామీ మొత్తం మేర‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ట‌ర్మ్ ప్లాన్ వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ చాలా మందికి అవ‌గాహ‌న లేక చాలా ప్ర‌భావాల‌కు లోన‌యి ట‌ర్మ్ ప్లాన్ కాకుండా ఏదో ఒక పాల‌సీని తీసుకుని కుటుంబాన్ని ప్ర‌మాదంలోకి నెడుతున్నార‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు చెబుతున్నారు.

త‌క్కువ ప్రీమియంలో మంచి క‌వ‌రేజీ

త‌క్కువ ప్రీమియంలో మంచి క‌వ‌రేజీ

ఇతర‌ సంప్ర‌దాయ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ అన్నింటితో పోలిస్తే ప్యూర్ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ స‌హేతుకుమైన ధ‌ర‌లోనే వ‌స్తుంది. సాధార‌ణ ప్రీమియం రేటుకు మీరు రూ. కోటి వ‌ర‌కూ బీమా చేయించుకోవ‌చ్చు. ఎల్ఐసీ సైతం ఇప్పుడు ట‌ర్మ్ ప్లాన్ల‌కు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. పాల‌సీదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగి మ‌ర‌ణం సంభ‌విస్తే మాత్ర‌మే క‌వ‌రేజీ ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది కాబ‌ట్టి వీటికి సంబంధించిన ప్రీమియం రేట్లు చాలా త‌క్కువ ఉంటాయి. ట‌ర్మ్ పాల‌సీల‌కు ఎటువంటి మెచ్యూరిటీ విలువ ఉండ‌దు. త‌క్కువ బ‌డ్జెట్లోనే మీకు, మీ కుటుంబానికి స‌రైన జీవిత బీమా ర‌క్ష‌ణ కావాలంటే ట‌ర్మ్ పాల‌సీయే ఉత్త‌మ‌మ‌ని గుర్తుంచుకోవాలి.

ఊరికే ప్రీమియం కోసం డ‌బ్బు ఖ‌ర్చు చేయాలా?

ఊరికే ప్రీమియం కోసం డ‌బ్బు ఖ‌ర్చు చేయాలా?

ట‌ర్మ్ పాల‌సీ గురించి చెప్ప‌గానే చాలా మంది అడిగే ప్ర‌శ్న ఎటువంటి పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నం లేక‌పోయినా ఊరికే పాల‌సీ ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలా? అని. జీవిత బీమా అనేది ఆర్థిక ర‌క్ష‌ణ కోసం. అంతే కానీ పొదుపు, పెట్టుబ‌డి క‌ల‌గ‌లిపి ఇత‌ర సంప్ర‌దాయ పాల‌సీల‌ను తీసుకున్నారంటే బీమా క‌వ‌రేజీ మొత్తం ఆ త‌ర్వాత కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిపోక‌పోవ‌చ్చు. అందుకే బీమా, పెట్టుబ‌డుల‌ను వేరు చేయాలి. బీమా కోసం ట‌ర్మ్ ప్లాన్‌, పెట్టుబ‌డుల కోసం మ్యూచువ‌ల్ ఫండ్స్‌, స్థిరాస్తి, బంగారం, షేర్లు, ప్ర‌భుత్వ బాండ్లు వంటి వాటిని ప‌రిశీలించ‌వ‌చ్చు.

క‌వ‌రేజీ, రైడ‌ర్లు

క‌వ‌రేజీ, రైడ‌ర్లు

ఒక‌సారి పాల‌సీ తీసుకున్న త‌ర్వాత పాల‌సీదారుకు ఆక‌స్మికంగా ఏదైనా జ‌రిగితే బీమా కంపెనీ త‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాల‌ను చెల్లిస్తుంది. అయితే మారుతున్న ప‌రిస్థితుల్లో మ‌న అవ‌స‌రాలు సైతం మారిపోతుంటాయి. మామూలుగా ట‌ర్మ్ పాల‌సీలు ఒక నిర్ణీత కాల‌ప‌రిమితి వ‌ర‌కూ మాత్ర‌మే ర‌క్ష‌ణ క‌ల్పించేలా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు చాలా బీమా కంపెనీలు ఉన్న పాల‌సీల‌నే ప‌ర్మ‌నెంట్ లైఫ్ ఇన్సూరెన్స్‌(హోల్ లైఫ్ ఇన్సూరెన్స్) పాల‌సీలుగా మ‌ర్చుకునేందుకు వీలు క‌ల్పిస్తుంటాయి. మ‌రికొన్ని కంపెనీలు పాల‌సీ గ‌డువు పూర్త‌య్యే స‌మ‌యంలో వాటిని హోల్ లైఫ్ పాల‌సీల వ‌లె మార్చేందుకు పాల‌సీదారుకు అవ‌కాశం ఇస్తాయి. ఇంతే కాకుండా మార్కెట్లో చాలా రైడ‌ర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్లు

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్లు

ప్రీమియం లేకుండా చేసే రైడ‌ర్లు

శాశ్వ‌త‌, పాక్షిక వైక‌ల్య రైడ‌ర్లు

బీమా ప్ర‌యోజ‌నాన్ని నెల‌వారి అందుకునే ఆప్ష‌న్‌

బీమా ప్ర‌యోజ‌నాన్ని నెల‌వారి అందుకునే ఆప్ష‌న్‌

పాల‌సీదారు కావాల‌నుకుంటే బీమా ప్ర‌యోజ‌నాన్ని మొత్తం ఒకేసారి కాకుండా వేరే మార్గాల‌ను సైతం ఎంచుకోవ‌చ్చు. ఇందుకోసం పాల‌సీ ఎంచుకునేట‌ప్పుడే ఆప్ష‌న్ ఇవ్వాలి. పాల‌సీదారు లేని స‌మ‌యంలో కుటుంబానికి నెల‌వారీ అవ‌స‌రాలు గ‌డ‌వ‌డం క‌ష్ట‌మైపోవ‌చ్చు. కొంత మొత్తాన్ని పాల‌సీదారు మ‌ర‌ణం తర్వాత చెల్లించి, మిగిలిన సొమ్మును నెల‌వారీగా చెల్లించేలా; ఇంకా నెల‌వారీ కొంచెం ఎక్కువ సొమ్ము చెల్లించేలా ఉండేలా బీమా కంపెనీల ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీల్లో ఆప్ష‌న్ ఉంటుంది. వీటిని బీమాదారుడు పాల‌సీ అందిస్తున్న బీమా కంపెనీ ప్ర‌తినిధుల‌ను అడిగి తెలుసుకోవాలి.

ఆన్‌లైన్ పాలసీ సులువైన‌దే

ఆన్‌లైన్ పాలసీ సులువైన‌దే

ట‌ర్మ్ పాల‌సీ చాలా ఏళ్ల నుంచి ఆఫ్ లైన్ రూపంలో కొన‌డం అంద‌రికీ అల‌వాటు అయిపోయంది. ప్ర‌స్తుతం డిజిట‌ల్ యుగంలో అన్నీ ఆన్‌లైన్ అయిపోతున్నాయి. అదే విధంగా బీమా కంపెనీలు సైతం ఆన్‌లైన్ పాల‌సీల‌ను అందుబాటులో ఉంచుతున్నాయి. మ‌ధ్య‌వ‌ర్తి(బ్రోక‌ర్ లేదా ఏజెంట్) క‌మీష‌న్ లేక‌పోవ‌డం, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు తక్కువ అవ‌డం మూలంగా ఆన్‌లైన్ పాలసీ ప్రీమియం కాస్త త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌క్కువ డాక్యుమెంట్ల‌తో పాల‌సీ కొనుగోలుకు వీలు క‌ల్పించ‌డం మూలంగా ఆన్‌లైన్ ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవ‌డం కాస్త సులువే. అన్నింటినీ బేరీజు వేసుకుని ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ పాల‌సీ ఏది తీసుకోవాలో మీరే నిర్ణ‌యించుకోవాలి. బాబోయ్‌! వీటికి సైతం ఇన్సూరెన్స్ పాల‌సీలు ఉంటాయా?

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ట‌ర్మ్ ప్లాన్ తీసుకునే వారికి ఆదాయపు ప‌న్ను చ‌ట్టం 80సీ కింద ల‌భించే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. దీని కింద మ‌నం క‌ట్టిన ప్రీమియంల‌కు ప్ర‌భుత్వం తెలిపిన విధంగా పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఆదాయపు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(10డీ) కింద మెచ్యూరిటీ బెనిఫిట్‌, డెత్ బెనిఫిట్‌, స్వాధీన విలువ‌(స‌రెండ‌ర్ వాల్యూ) మొద‌లైన వాటికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఏ ట‌ర్మ్ ప్లాన్ కొనేట‌ప్పుడు అయినా క్లెయిం సెటిల్‌మెంట్ ప్ర‌ధాన కార‌కంగా ఉండాలి. అంటే ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అంతే కాకుండా ప్లాన్ ఉద్దేశం, ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు, ప్రీమియం వంటివ‌న్నీ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి ఉత్త‌మ ట‌ర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి.

English summary

ట‌ర్మ్ పాల‌సీ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 7 ముఖ్య విష‌యాలు | Things to know about Term Insurance policy

Term insurance policy doesn’t only provide you an economical option to buy a life insurance policy, but it also gives you the flexibility with a bundle of benefits. A term insurance policy can do wonders to your financial planning if you customize and choose it well.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X