For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపాయి కాస్ట్ అవరేజింగ్ అంటే ఏమిటి?

|

Rupee
భిన్నమైన పెట్టుబడి సాధనాలు అంటే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలను ఉపయోగించి రూపాయి సగటు ఖర్చును బట్టి పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ రిస్కును తగ్గించుకోవచ్చు. రూపాయి సగటు ఖర్చు(ఆర్‌సిఏ) అనేది మీరు ఎప్పుడైతే స్థిర మొత్తంలో రెగ్యూలర్ బేసిస్‌పై పెట్టుబడులు పెట్టాలనుకుంటారో అప్పుడు మీకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఈ విధానంతో మీరు సరైన సమయంలో పెట్టుబడులు పెట్టి, అవసరమైన సమయంలో ప్రత్యేకమైన పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చును.

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులను స్థిర డిపాజిట్లలో గానీ లేదా ప్రభుత్వ బాండ్లలో గాని పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మీ రిస్కును పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇందుకు విరుద్ధంగా ఇతర పెట్టుబడి అవకాశలైన ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లు రూపాయి సగటు ఖర్చు పద్ధతిని ఉపయోగించి రిస్కును తగ్గించుకోవచ్చు. అందువల్ల మార్కెట్ నిబంధనలను అనుసరించి పెట్టుబడిదారుడు నిర్భయంగా తన ప్రత్యేకమైన పెట్టుబడులను పెట్టవచ్చును.

మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆర్‌సిఏను వర్తింపచేయడం ఎలా?

మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవి ఫండ్స్ కొన్ని పాయింట్లు తక్కువగా ఉన్న సమయంలో రెగ్యూలర్ స్థిర మొత్తంలో పెట్టుబుడులు పెట్టి ఎక్కువ యూనిట్ల ఫండ్స్ ను పొందే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఒక నెలలో రూ. 1000 పెట్టుబడులు పెట్టారనుకోండి, అప్పుడు ఎన్ఏవి ఫండ్స్ రూ. 20 ఉందనుకోండి, అప్పుడు మీకు 500 యూనిట్లను కేటాయించడం జరుగుతుంది. అయితే మీకు ఎన్ఏవి ధరలు పెరిగిన సమయంలో గానీ లేదా తగ్గిన సమయంలో అందుకు అనుగుణంగా ఆ యూనిట్లను కేటాయించడం జరుగుతుంది. సాధారణంగా పెట్టుబడిదారుడు ఎప్పుడైనా తను పెట్టుబడి పెట్టిన దానికికంటే ఎక్కువ మొత్తం పొందాలను చూస్తాడు. తక్కువ విలువ ఉన్నప్పుడు యూనిట్లలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ విలువ ఉన్నప్పుడు ఉపసంహరించుకోవడం ద్వారా కొంతమేర లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

కాబట్టి అన్ని రెగ్యూలర్ పెట్టుబడులలో ముందుగా నిర్ణయించబడిన కాస్ట్ అవరేజి పెట్టుబడిదారుకు పెట్టుబడి నియమాల ప్రకారం కొంతవరకు సహాయపడగలదు. సగటు ధరను బట్టి సరైన సమయంలో పెట్టుబడులను పెట్టడం ద్వారా, సరైన సమయంలో ఉపసంహరించుకోవడం ద్వారా పెట్టుబడిదారులు వారు పెట్టిన మొత్తానికి కంటే ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.

ఈక్విటీ విషయంలో అయితే రూపాయి సగటు ఖర్చు అవరేజి సూత్రం ద్వారా షేర్ ధర కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడిదారులు కొనుగోలు చేసినట్లయితే తక్కువ ధరకు షేర్లను పొందే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్ వాటి ధర తగ్గినట్లయితే పెట్టుబడిదారులు కొంత మేర నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సగటు ధరను ఉపయోగించి పెట్టుబడులు పెట్టడం వల్ల నష్ట భయాని కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.

English summary

రూపాయి కాస్ట్ అవరేజింగ్ అంటే ఏమిటి? | What is rupee-cost averaging?

The objective of investing in different investment instruments such as mutual funds and equity with lower risk exposure can be met to some extent using rupee-cost averaging (RCA).
Story first published: Tuesday, November 19, 2013, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X