స్వల్ప కాలిక రుణ నిధులు అంటే ఏమిటి?

వడ్డీ రేటులో మార్పులు
స్వల్పకాలిక రుణ నిధి పెట్టుబడులలో వచ్చే వడ్డీ రేటులో స్వల్ప మార్పులు ఉంటాయి. రుణ సిద్ధాంతం ప్రకారం మార్కెట్ రుణ విలువ తగ్గితే వడ్డీ రేటు పెరుగుతుంది. అలాగే రుణ విలువ పెరిగితే వడ్డీ రేటు తగ్గుతుంది. దీంతో స్వల్పకాలిక రుణ నిధిపై మార్కెట్ వడ్డీ రేటు వల్ల ప్రభావతమవుతుందని చెప్పుకోవచ్చు.
తక్కువ సున్నితత్వం కలిగిన స్వల్ప కాలిక నిధిపై ఇంటరెస్ట్ రేట్లు, భద్రత, స్థిరమైన లాభాలు రావడం అనేది ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ
ఇలాంటి స్వల్ప కాలిక రుణ నిధులను తమకు అనుకూలంగా ఉన్న సమయంలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే కూడా స్వల్పకాలిక రుణ నిధుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువగా వడ్డీ రేటును పొందవచ్చు.
టాక్స్ ఎఫిసియంట్
ఏడాదికిపైగా పొందే సల్పకాలిక రుణ నిధుల పెట్టుబడులపై తక్కువ స్థాయిలో పన్ను విధించడం జరుగుతుంది. బ్యాంకులలోని ఫిక్సిడ్ డిపాజిట్లతో పోలిస్తే తక్కువ పన్నుల భారం ఉండే అవకాశం ఉంటుంది.
రిస్క్
సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు స్వల్ప కాలిక రుణ నిధి పెట్టుబడులపై కూడా ఉంటాయి. ఈ మార్పుల కారణంగా వడ్డీ రేట్ల రూపంలో వచ్చే ఆదాయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ రిస్క్
కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాము జారీ చేసిన స్వల్ప కాలిక రుణ నిధుల పెట్టుబడులపై తిరిగి పొందే ఆదాయాలలో కూడా తేడాలుంటాయి. కంపెనీలకు పెట్టుబడులు అత్యధిక లాభాలు చేకూర్చితేనే తమ పెట్టుబడులకు పెట్టుబడిదారులు లాభాలను పొందే అవకాశం ఉంటుంది లేదా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడిదారులు కంపెనీ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుని పెట్టుబడి చేస్తే లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ద్రవ్యోల్బణ రేటు రిస్క్
తక్కువ కాలానికి అంటే 2 నుంచి 3 సంవత్సరాలకు సంబంధించిన పెట్టుబడి కావడం వల్ల తక్కువ స్థాయిలోనే లాభాలు ఉంటాయి. స్వల్పకాలిక రుణ పెట్టుబడి నిధులపై ద్రవ్యోల్బణం కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా దీర్ఘ కాలంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పెట్టుబడిదారుడు ఆర్జించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications