అలా చేయకుంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది, 5 కీలక నిబంధనలు
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఏదైనా కంపెనీలోని ఉద్యోగి తన పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలను తన ఆఫీస్ హెచ్ఆర్ లేదా అకౌంట్ డిపార్టుమెంటుకు ఇవ్వవలసి ఉంటుంది. మీ ఆదాయం... పన్ను పరిధిలోకి వస్తే కనుక టీడీఎస్ కోసం పాన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి. పని చేసే ఆఫీస్ హెచ్ఆర్ కూడా మీ పాన్ నెంబర్ కచ్చితంగా అడుగుతారు.

పాన్ లేదా ఆధార్ కార్డు ఇవ్వడం తప్పనిసరి
మూలం వద్ద పన్ను తగ్గించేటప్పుడు ఉద్యోగి.. యజమాని మీ పాన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను పేర్కొనవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ TRACES పోర్టల్ ద్వారా టీడీఎస్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. మీ ఆదాయం... పన్ను పరిధిలోకి రాకపోతే(రూ.2.5 లక్షల లోపు) కనుక పాన్ లేదా ఆధార్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 206ఏఏ కింద యజమాని టీడీఎస్‌ను తగ్గించుకోవాల్సినప్పటికీ తప్పనిసరి కాదు.

పాన్ కార్డు వివరాలు ఇవ్వకుంటే
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు ఆదాయపు పన్ను బ్రాకెట్లోకి వస్తే... మీరు మీ కంపెనీకి పాన్ కార్డు వివరాలు ఇవ్వకుంటే యజమాని టీడీఎస్‌ను 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేటుతో తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు 20 శాతం పన్ను పోటు పడుతుంది.

సెక్షన్ 192 ప్రకారం..
సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ కోసం లెక్కించిన ఉద్యోగి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే పన్ను వర్తించదు. కాబట్టి పాన్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

అప్పుడైనా రీఫండ్ పొందవచ్చు
మీ కంపెనీకి పాన్ వివరాలు అందించడంలో విఫలమైతే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత మీరు రీఫండ్ పొందవచ్చు. రీఫండ్ కొన్ని సందర్భాలలో కొందరికి ఆలస్యం అవుతుంది.

ఆధార్ ఇవ్వొచ్చు... అనుసంధానం తప్పనిసరి
గత ఏడాది నుంచి పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డును సమర్పించే అవకాశం ఉంది. కానీ అలా చేసే సమయంలో పాన్ - ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

అలా చేస్తే రూ.10,000 జరిమానా
పాన్‌కు బదులు మీ ఆధార్ నెంబర్‌ను ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు నెంబర్ ఇస్తే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 272బీ కింద రూ.10,000 జరిమానా పడుతుంది. తప్పులు బహుళ రూపాల్లో ఇస్తే జరిమానా కూడా మరింత ఎక్కువ ఉంటుంది.

టేక్ హోమ్ శాలరీ తగ్గొచ్చు
పాన్ నెంబర్ ఇవ్వకుంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గిపోతుంది. మీ యజమాని టీడీఎస్‌ను 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేటుతో తీసివేస్తారు. అయితే దానిని ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన సమయంలో మాత్రం పొందవచ్చు. పాన్ లేకుంటే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేటుతో టీడీఎస్ వర్తింప చేయాలని ఆదాయపు పన్ను శాఖ కంపెనీలను కోరింది.


Click it and Unblock the Notifications