For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మైండ్ సెట్ ఉండాలి: వారెన్ బఫెట్ సూచన

|

ప్రముఖ ఇన్వెస్టర్, వ్యాపారవేత్త వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఓ సూచన చేశారు. మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని, కానీ లాంగ్ టర్మ్ మైండ్‌తో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెబుతున్నారు. సాధారణంగా స్టాక్స్ షార్ట్ టర్మ్‌లో భారీగా ఎగిసిపడవచ్చు లేదా కుంగిపోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు, ఆయా రంగాలకు, కంపెనీల వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ కదులుతుంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎమోషనల్‌గా ఉండవద్దనేది నిపుణుల సూచన.

లాంగ్ టర్మ్ మైండ్ సెట్

లాంగ్ టర్మ్ మైండ్ సెట్

వారెన్ బఫెట్ కూడా ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ మైండ్ సెట్‌తో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. బెర్క్ షైర్ చరిత్రలో మూడుసార్లు స్టాక్ 50 శాతం వరకు పడిపోయిందని, ఆ సమయంలో ఆతృతతో విక్రయిస్తే ఇన్వెస్టర్లకు ఇప్పుడు అంతగా రిటర్న్స్ రాకపోయి ఉండేవని అభిప్రాయపడ్డారు. వేచి చూడటం వల్ల ఇప్పుడు మంచి రిటర్న్స్ వచ్చాయన్నారు.

స్టాక్స్ పైన అవగాహన

స్టాక్స్ పైన అవగాహన

బెర్క్ షైర్ స్టాక్ పతనంలో ఈ కంపెనీ తప్పు లేదన్నారు. పెట్టుబడిదారులు మార్కెట్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. స్టాక్ హెచ్చుతగ్గులపై ఇతరులు చెప్పే దానిపై పూర్తిగా ఆధారపడవద్దని, మీకు అవగాహన ఉండాలని, అందుకు అనుగుణంగా కొనుగోలు చేయడం, విక్రయించడం చేయాలన్నారు. ఎమోషనల్‌గా ఉండవద్దని అభిప్రాయపడ్డారు.

మానసిక స్థిరత్వం

మానసిక స్థిరత్వం

ఒక్కోసారి స్టాక్ కొనుగోలు చేశాక, ఆ కంపెనీ స్టాక్ 50 శాతం కూడా పడిపోవచ్చునని చెప్పారు. ఇన్వెస్టర్లకు మానసిక స్థిరత్వం ఉండాలని తెలిపారు. లేదంటే షేర్లు కొనుగోలు చేసే సమయంలో విక్రయించడం, విక్రయించాల్సిన సమయంలో కొనుగోలు చేస్తామని వ్యాఖ్యానించారు. ప్లాట్ కొనుగోలు చేయడానికి సిద్ధపడినట్లే, షేర్ల కొనుగోలుకు కూడా సిద్ధపడాలన్నారు.

English summary

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మైండ్ సెట్ ఉండాలి: వారెన్ బఫెట్ సూచన | Warren Buffet bats for long term mindset

Warren Buffett believes that people should not buy stocks unless they expect to hold them for a long time.
Story first published: Friday, June 10, 2022, 8:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X