For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో ఇన్వెస్ట్ చేయడానికి టాప్10 క్రిప్టోకరెన్సీలు..

|

క్రిప్టోకరెన్సీలు ఇటీవలి కాలంలో ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్, ఎథేరియం సహా ఎన్నో క్రిప్టోలు ఏడాది కాలంలో భారీగా ఎగిసిపడ్డాయి. ఎథేర్(ఎథేరియం) క్రిప్టో ఇటీవలే 2000 డాలర్లను క్రాస్ చేయగా, బిట్ కాయిన్ ఏకంగా 58వేల డాలర్ల సమీపంలో ఉంది. ఓ సమయంలో 61వేల డాలర్లను దాటింది. 2021 సంవత్సరంలో ఎథేరియంం 170 శాతం వృద్ధిని నమోదు చేసింది. బిట్ కాయిన్ అయితే అంతకంతకూ ఎగిసిపడుతోంది. ఈ డిజిటల్ కరెన్సీలకు టెస్లా ఇంక్, వీసా, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది కూడా క్రిప్టోకరెన్సీకి కలిసి వస్తోంది.

బిట్ కాయిన్, ఎథేరియం...

బిట్ కాయిన్, ఎథేరియం...

బిట్ కాయిన్ ప్రస్తుతం 60వేల డాలర్ల దిశగా వెళ్తోంది. ఆపిల్, గూగుల్, టెస్లా, శాంసంగ్, ఫేస్‌బుక్, పేపాల్, డచ్ బ్యాంకు వంటి సంస్థలు క్రిప్టోకరెన్సీలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. కొంతకాలం క్రితం వరకు ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్లు, బంగారం వైపు చూసేవారు. ఇప్పుడు కొత్తగా క్రిప్టోకరెన్సీలోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామందికి బిట్ కాయిన్, ఆ తర్వాత ఎథేరియం ఎక్కువగా తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా వాటి వైపు చూస్తున్నారు. 2021లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చునని నిపుణులు కొన్ని క్రిప్టోకరెన్సీలను సూచిస్తున్నారు.

క్రిప్టోకింగ్

క్రిప్టోకింగ్

2008లో ప్రారంభమైన బిట్ కాయిన్ పుట్టుకు వచ్చింది. క్రిప్టోకరెన్సీ కింగ్‌గా వర్ధిల్లుతోంది బిట్ కాయిన్. బిట్ కాయిన్‌కు సెంట్రల్ బ్యాంకు లేదు అలాగే సింగిల్ అడ్మినిస్ట్రేటర్ కాదు. బిట్ కాయిన్ వ్యాల్యూ పెరిగినా, తగ్గినా క్రిప్టోలో మాత్రమే ఇప్పటి వరకు దీనిని మించిందిలేదు. బిట్ కాయిన్ అంచనాలు వేయలేని పరిస్థితి అంటున్నారు. ఇందుకు ఈక్విటీ మార్కెట్లు, కరోనా కేసులు, పోటీ కరెన్సీల వ్యాల్యూ, వివిధ దిగ్గజ సంస్థలు క్రిప్టోకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే కరోనా నేపథ్యంలో గత ఏడాదిలో భారీగా ఎగిసింది.

ఎథేరియం సహా ఇవి..

ఎథేరియం సహా ఇవి..

క్రిప్టోకరెన్సీలో అతిపెద్ద మార్కెట్ బిట్ కాయిన్‌ది కాగా, రెండో స్థానం ఎథేరియంది. మార్కెట్ క్యాప్ పరంగా బిట్ కాయిన్ తర్వాత ఉంది. 2013లో ప్రోగ్రామర్ విటాలిక్ బుటేరిన్ దీనిని ప్రతిపాదించారు. జూలై 30, 2015లో ఇది లైవ్‌లోకి వచ్చింది. ప్రాతమికంగా 72 మిలియన్ల క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి.

టాప్ టెన్‌లో బిట్ కాయిన్, ఎథేరియంతో పాటు టెథెర్-USDT, కార్డానో-ADA, పోల్‌కాడాట్-DOT, రిప్పిల్-XRP, యూనిస్వాప్-UNI, లిట్‌కాయిన్-LTC, చైన్‌లింక్-LINK, బిట్ కాయిన్ క్యాష్-BCH ఉన్నాయి.

English summary

2021లో ఇన్వెస్ట్ చేయడానికి టాప్10 క్రిప్టోకరెన్సీలు.. | Top 10 Cryptocurrencies To Invest In 2021

Cryptocurrency is regaining popularity as interest in it increases. The term "crypto" in the context of cryptocurrencies refers to the complex cryptography that enables the development and processing of digital currencies as well as their transactions through decentralised systems.
Story first published: Sunday, April 4, 2021, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X