ఈ బ్యాంకింగ్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్!
దీపావళికి బోనస్ వచ్చిందా? ఈ వచ్చిన మొత్తాన్ని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలని భావిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ బ్రోగరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఓ బ్యాంకింగ్ స్టాక్‌ను సూచిస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్‌ను కొనుగోలు చేయడం ద్వారా సమీప భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ధర రూ.49.40 వద్ద ఉంది. క్రితం సెషన్‌లో 3.89 శాతం లాభపడింది. అంతకుముందు రూ.47.45 వద్ద క్లోజ్ అయింది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన అంశం. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు అన్నింటిని పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ పైన, కొనుగోలు చేసే స్టాక్ పైన అవగాహన కలిగి ఉండటంతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

మంచి ఫలితాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మంచి ఫలితాలు నమోదు చేసింది. DHFl రికవరీ రిసొల్యూషన్ నేపథ్యంలో హెల్తీ ఎర్నింగ్స్ వచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం ఫీ ఇన్‌కం ట్రెండ్స్ పెరిగాయి. డొమెస్టిక్ మార్జిన్స్ తగ్గాయి. ఎన్ఐఐ వృద్ధి ప్రభావంతో లోన్ గ్రోత్ స్థిరంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో యూనియన్ బ్యాంకు ఏడాది ప్రాతిపదికన 195 శాతం వృద్ధిని నమోదు చేసి 15.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డీహెచ్ఎఫ్ఎల్ అకౌంట్ రిసొల్యూషన్‌తో 16.5 బిలియన్ల రికవరీ జరిగింది.

టార్గెట్ ధర
ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ ధర రూ.47 వద్ద ఉంది. అసెట్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ వృద్ధి ఉంటుందని, ఎన్పీఏలు పెరిగినప్పటికీ కేంద్రం తీసుకు వచ్చిన బ్యాడ్ బ్యాంకుకు వీటిని అప్పగించడం వల్ల ఇవి తగ్గుతాయని అంచనాలు ఉన్నాయి. దీంతో మొండి బకాయిలు తగ్గుతాయి. అదే సమయంలో రీస్ట్రక్చర్డ్ పోర్ట్‌ఫోలియో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్ 41 శాతం లాభపడి రూ.65కు చేరుకోవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. రూ.65 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది.

ఈక్విటీ పెట్టుబడి రిస్క్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు నెలల కాలంలో 43 శాతం, ఏడాది కాలంలో 99 శాతం లాభపడింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో (ఇయర్ టు డేట్) 54శాతం ఎగిసింది. అయదేళ్ల కాలంలో మాత్రం 66శాతం క్షీణించింది. ఈ స్టాక్ దశాబ్దం క్రితం రూ.400 పైన ట్రేడ్ అయింది. ఆ తర్వాత పడిపోయింది. 52 వారాల గరిష్టం రూ.51.70, 52 వారాల కనిష్టం రూ.24.25.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడిన అంశం. ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే లాభపడవచ్చు. నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి స్టాక్స్, మార్కెట్ పైన అవగాహనతో, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయాలి.