For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే రిటర్న్స్: ఈ స్టాక్స్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్లు!

|

ముంబై: స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు భారీ రిటర్న్స్ ఇస్తుందో చెప్పలేం! అయితే ఆయా కంపెనీలకు ఉన్న క్రెడిబులిటీ, ఆ సంస్థలోకి వచ్చే పెట్టుబడులు, నష్టాలు, సంక్షోభాల ఆధారంగా స్టాక్స్ పైకి,కిందకు కదులుతాయి. ఉదాహరణకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి నిన్నటి వరకు, ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటంతో ఈ షేర్ ధర రోజురోజుకు పెరుగుతోంది.

ఇక టీసీఎస్ వంటి స్టాక్స్‌కు క్రెడిబులిటీ ఉంటుంది. అదానీలో 1995లో రూ.1 ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు రూ.800 వచ్చిందని ఇటీవల గౌతమ్ అదానీ తెలిపారు. అయితే కొన్ని సంస్థలు ఊహించని విధంగా భారీ రిటర్న్స్ అందిస్తాయి. గత 20 సంవత్సరాల్లో (2000 సెప్టెంబర్) నుండి 54 స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ అందించాయి.

అదానీలో అప్పుడు రూ.1 పెడితే ఇప్పుడు రూ.800 వచ్చాయి, రెండో స్థానంలోకి భారత్అదానీలో అప్పుడు రూ.1 పెడితే ఇప్పుడు రూ.800 వచ్చాయి, రెండో స్థానంలోకి భారత్

100 రెట్ల నుండి లక్ష రెట్ల వరకు ర్యాలీ

100 రెట్ల నుండి లక్ష రెట్ల వరకు ర్యాలీ

డేటా ప్రకారం దాదాపు 54 స్టాక్స్ ఇన్వెస్టర్ల సంపదను 2000 సెప్టెంబర్ నుండి 100 రెట్లు పెంచాయి. ఇందులో అత్యుత్తమ రిటర్న్స్ రూ.1,00,000 శాతం వరకు కూడా ఇచ్చాయి. ఇందులో చాలా కంపెనీలు బలమైన బ్యాలెన్స్ షీట్స్ కలిగి ఉండటం, రిటర్న్స్ రేషియో ఎక్కువగా ఉండటం, పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్ స్ట్రాటజీ మార్చుకోవడం, పోటీతత్వం వంటి అంశాలు ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ సాధించేలా చేశాయని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు.

అప్పుడు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.10 కోట్లు

అప్పుడు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.10 కోట్లు

- సింఫోనీ 1,71,739 శాతం లాభపడి రిటర్న్స్ ఇచ్చిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

- బాలకృష్ణ ఇండస్ట్రీస్ 1,52,384 శాతం ఫలితాలు అందించింది.

- బజాజ్ ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి 1,24,834 శాతం రిటర్న్స్ వచ్చాయి.

- అంటే ఈ కంపెనీల్లో 2,000 సంవత్సరంలో రూ.1 లక్ష పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు (20 ఏళ్లలో) రూ.10 కోట్లకు పైగా చేతికి వచ్చినట్లు.

- సింఫోని టాప్ లైన్ 2005లో రూ.24 కోట్లు కాగా, ఇప్పుడు రూ.1,103 కోట్లకు పెరిగాయి.

- బజాజ్ ఫైనాన్స్ సేల్స్ 20 ఏళ్లలో రూ.210 కోట్ల నుండి రూ.26,098 కోట్లకు చేరుకున్నాయి.

- బాలకృష్ణ ఇండస్ట్రీస్ రూ.620 కోట్ల నుండి రూ.4,811 కోట్లకు చేరుకున్నాయి.

- పలు షేర్లు ఇంకా ర్యాలీ చేస్తాయని ఇప్పటికీ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉదాహరణకు బాలకృష్ణ ఇండస్ట్రీస్ బై-ప్రైస్ టార్గెట్‌ను రూ.1,671కు పెంచింది ఐసీఐసీఐ సెక్యూరిటీస్. సెప్టెంబర్ 28న ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం రూ.1,482 పలికింది.

- బజాజ్ ఫైనాన్స్ బై-ప్రైస్ టార్గెట్‌ను రూ.3,840కు పెంచింది హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్. ఎన్బీఎఫ్‌సీలో బజాజ్ ఫైనాన్స్ బలంగా, మంచి రాబడి కలిగి ఉంది.

రూ.2 కోట్లకు పైగా..

రూ.2 కోట్లకు పైగా..

- ఫార్మా ప్లేయర్ హెస్టెర్ బయోసైన్సెస్, ఆటో మేజర్ ఐచర్ మోటార్స్ కూడా భారీ లాభాలు అందించాయి. హెస్టెర్ బయోసైన్సెస్ 96,977 శాతం, ఐచర్ మోటార్స్ 93,949 శాతం ర్యాలీ సాధించింది.

- ఐచర్ మోటార్స్ టార్గెట్ ధరను రూ.2,754కు పెంచింది ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్.

- వినతి ఆర్గానిక్స్ 80,651 శాతం, అతుల్ లిమిటెడ్ 57,216 శాతం, JSW స్టీల్ 49,382 శాతం, టైటాన్ 44,925 శాతం, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ 42,925 శాతం రిటర్న్స్ అందించాయి.

- హావెల్స్ ఇండియా, బాలాజీ అమిన్స్, కొటక్ మహీంద్ర బ్యాంకు, అవని ఫీడ్స్, దీపక్ నైట్రైట్, డీఎఫ్ఎం ఫుడ్స్, వోల్టాస్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ జింక్, ఎన్జీఎల్ ఫైన్ కెమ్, కోరమండల్ ఇంటర్నేషనల్, బర్గర్ పేయింట్స్‌లోను 20 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.2 కోట్లకు పైగా రిటర్న్స్ వస్తాయి.

English summary

అదిరిపోయే రిటర్న్స్: ఈ స్టాక్స్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.2 కోట్ల నుండి రూ.10 కోట్లు! | These stocks made crorepatis on Rs 1 lakh investment

Data showed at least 54 stocks multiplied investors wealth by over 100 times between September 2000 and now; with the best ones rallying in excess of 1,00,000 per cent, that’s right 1 lakh per cent.
Story first published: Wednesday, September 30, 2020, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X