For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఇక గుర్తింపు, ప్రయోజనమెంతో

|

స్టాక్ మార్కెట్లో గుర్తింపు పొందిన ఇన్వెస్టర్ల(అక్రిడిటెడ్ ఇన్వెస్టర్) విధానాన్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబి కొత్తగా తీసుకు వచ్చింది. తద్వారా ఈ మార్కెట్ నియంత్రణ సంస్థ భారతీయ సెక్యూరిటీ మార్కెట్లో గుర్తింపు పొందిన పెట్టుబడిదారులు అనే అంశాన్ని తీసుకువచ్చింది. దీంతో నిధుల సమీకరణకు కొత్త మార్గం తెరుచుకున్నట్లు అవుతుంది.

సెబి నిర్దేశించిన ఆర్థిక అర్హతల ఆధారంగా వ్యక్తులు, HUFలు, కుటుంబ ట్రస్ట్స్, సింగిల్ ఓనర్ కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, కార్పోరేట్ సంస్థలకు గుర్తింపు లభిస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది సెబి. డిపాజిటరీ అనుబంధ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ ధ్రువ పత్రాలను జారీ చేస్తాయి.

అప్పుడు పెట్టుబడిదారుగా గుర్తింపు

అప్పుడు పెట్టుబడిదారుగా గుర్తింపు

నికర వ్యాల్యూ లేదా ఆదాయం ఆధారంగా ఒక వ్యక్తి లేదా సంస్థ గుర్తింపు పొందిన పెట్టుబడిదారుగా గుర్తిస్తారు.

ఆగస్ట్ 3వ తేదీ నాటి నోటిఫికేషన్ ప్రకారం HUFs, కుటుంబ ట్రస్ట్స్, ఏక యాజమాన్య, భాగస్వామ్య సంస్థలు, ట్రస్ట్స్, బాడీ కార్పోరేట్స్, రెగ్యులేటర్ పేర్కొన్న ఆర్థిక పారామితుల ఆధారంగా అక్రిడేషన్ పొందవచ్చు. డిపాజిటరీలు, స్టాక్ ఎక్స్చేంజీల అనుబంధ సంస్థలు ఇలాంటి పెట్టుబడిదారులకు సర్టిఫికెట్ జారీ చేస్తాయని సెబి తెలిపింది.

ఒక వ్యక్తి లేదా HUF, కుటుంబ ట్రస్ట్ లేదా ఏక యాజమాన్య సంస్థ వార్షిక ఆదాయం కనీసం రూ.2 కోట్లు లేదా నికర వ్యాల్యూ రూ.7.50 కోట్లు ఉంటే, అందులో సగం వరకు ఫైనాన్షియల్ అసెట్స్ ఉంటే, గుర్తింపు పొందిన పెట్టుబడిదారులు కావొచ్చు.

రూ.1 కోటి వార్షిక ఆదాయం, రూ.5 కోట్ల నికర వ్యాల్యూ కలయికతో ఉన్న సంస్థలు కనీసం సగం ఫైనాన్షియల్ అసెట్స్ కలిగిన కలిగిన సంస్థలు గుర్తింపు పొందిన పెట్టుబడిదారుగా మారవచ్చు.

ఫ్యామిలీ ట్రస్ట్స్ కాకుండా ఇతర ట్రస్ట్స్, గుర్తింపు పొందిన పెట్టుబడిదారులుగా అర్హత పొందాలంటే కనీసం రూ.50 కోట్ల నికర వ్యాల్యూ అవసరం. అయితే కార్పోరేట్లకు రూ.50 కోట్ల నికర వ్యాల్యూ తప్పనిసరి.

ఇదీ ప్రయోజనం

ఇదీ ప్రయోజనం

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, అవి ఏర్పాటు చేసిన ఫండ్స్, డెవలప్‌మెంటల్ ఏజెన్సీలు, సంస్థాగత కొనుగోలుదారులు, కేటగిరీ 1 ఎఫ్‌పీఐలు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మల్టీలేటరల్ ఏజెన్సీలు గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లుగా ఉంటారు. భాగస్వామ్య సంస్థ విషయానికి వస్తే ప్రతి భాగస్వామి స్వతంత్రంగా అక్రిడిటేషన్ కోసం అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ, పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ నిబంధనల్లో సూచించిన కనీస మొత్తం కంటే తక్కువ పెట్టుబడితో ఆయా పెట్టుబడి ఉత్పత్తుల్లో పాల్గొనడానికి గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు అవకాశం ఉంటుంది.

సెబి పలు చర్యలు

సెబి పలు చర్యలు

కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు ఈజీ బిజినెస్‌కు వీలుగా సెబీ పలు చర్యలు చేపట్టింది. స్వెట్ ఈక్విటీ నిబంధనలు సడలించడంతో పాటు అనుమతుల భారాన్ని తగ్గించే నిర్ణయాలకు శుక్రవారం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్ల విధానాన్ని పక్కనపెట్టి, నియంత్రిత వాటాదార్లు అనే భావనను తీసుకురావడమే కాకుండా, తొలి పబ్లిక్ ఇష్యూలో షేర్ల విక్రయం తర్వాత ప్రమోటర్లకు కనీస లాక్-ఇన్ పీరియడ్‌ను తగ్గించేందుకు బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులను నియంత్రించే నిబంధనల సవరణలను బోర్డు ఆమోదించింది. దేశ, విదేశాల నుండి స్టార్టప్స్ ఆకర్షించే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు సవరించింది. ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫామ్స్ పైన నమోదయిన కొత్త తరం టెక్నాలజీ కంపెనీల వార్షిక స్వెట్ ఈక్విటీ షేర్ల సీలింగ్‌ను పదిహేను శాతానికి, మొత్తం సీలింగ్‌ను పెయిడప్ క్యాపిటల్‌లో యాభై శాతానికి పరిమితం చేసింది. పెంచిన ఈ మొత్తం పరిమితి కంపెనీ వ్యవస్థాపితం నుండి పదేళ్ల వరకు వర్తిస్తుంది.

English summary

సెక్యూరిటీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు ఇక గుర్తింపు, ప్రయోజనమెంతో | Sebi introduces accredited investors concept in securities market

SEBI has introduced the concept of accredited investors in the Indian securities market, a move expected to open up a new channel for raising funds.
Story first published: Sunday, August 8, 2021, 9:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X