For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరళ్ జీవన్ బీమా: ఈ ఇన్సురెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి

|

ప్రామాణిక వ్యక్తిగత జీవిత బీమా పాలసీయే సరళ్ జీవన్ బీమా. ఈ పాలసీ ప్రతి ఒక్కరికీ నివాస స్థలం, ప్రయాణం, వృత్తి లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా వర్తిస్తుంది. ఇది నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేషన్ పర్సనల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. ఈ పాలసీ వ్యవధిలో పాలసీ తీసుకున్నవారు దురదృష్టవశాత్తు మరణిస్తే నామినీకి ఒకే మొత్తంలో హామీ మొత్తం అందుతుంది. పాలసీలో ఆమోదించబడిన యాక్సిడెంటల్ బెనిఫిట్, శాశ్వత వైకల్య బెనిఫిట్ ఉంటాయి. ఈ పాలసీ గురించి కొన్ని అంశాలు....

SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..

రూ.25 లక్షలకు మించి హామీ

రూ.25 లక్షలకు మించి హామీ

సరళ్ జీవన్ బీమా పాలసీ తీసుకోవడానికి కనిష్ట వయస్సు 18, గరిష్ట వయస్సు 65. ఈ పాలసీ అయిదేళ్ల నుండి 40 సంవత్సరాల వ్యవధి వరకు తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. హామీ మొత్తం కనిష్టం రూ.5 లక్షలు కాగా, గరిష్టం రూ.25 లక్షలు. బీమా సంస్థలు సరళ్ జీవన్ బీమా కింద రూ.25 లక్షల కంటే ఎక్కువ హామీని అందించే అవకాశం కూడా ఉంది.

ప్రీమియం చెల్లింపులు

ప్రీమియం చెల్లింపులు

ప్రీమియం చెల్లింపులను ఎంపిక చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్రీమియం, పరిమిత ప్రీమియం చెల్లింపు కాలం అయిదేళ్ల, పదేళ్లు ఉంటుంది. సింగిల్ ప్రీమియం ఉన్నాయి. ఇందులో రెగ్యులర్, పరిమిత ప్రీమియం చెల్లింపు ఎంచుకోవచ్చు. అలాగే, ఏడాది, అర్ధ సంవత్సరం, నెలవారీ (నెలవారీ ECS /NACH కింద మాత్రమే) ఉన్నాయి. సింగిల్ ప్రీమియం అయితే ఒకేసారి మొత్తం చెల్లించాలి.

వెయిటింగ్ పీరియడ్

వెయిటింగ్ పీరియడ్

పాలసీ ప్రారంభించిన తేదీ నుండి 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ పునరుద్ధరణలో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఈ పాలసీ పైన ఎలాంటి లోన్ ఉండదు. పాలసీ కింద మెచ్యూరిటీ బెనిఫిట్స్ లేవు. వెయిటింగ్ పీరియడ్‌లో ప్రమాదవశాత్తు కాకుండా ఇతర కారణాలతో మరణిస్తే పన్నులు మినహాయించి పొందిన మొత్తం ప్రీమియంలలో వం శాతానికి సమానమైన మొత్తం చెల్లిస్తారు. హామీ మొత్తం రాదు.

English summary

సరళ్ జీవన్ బీమా: ఈ ఇన్సురెన్స్ పాలసీ గురించి తెలుసుకోండి | Saral Jeevan Bima: Things to know about this standard term insurance policy

Insurers are required to offer standard term life insurance starting January 1, according to the Insurance Regulatory and Development Authority of India's (IRDAI) guidelines.
Story first published: Wednesday, January 6, 2021, 15:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X