For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'రియాల్టీ' సూపర్బ్: అక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్, ఎందుకంటే

|

గత కొద్దికాలంగా రియాల్టీ రంగం చాలా వేగంగా పుంజుకుంటోంది. రియాల్టీ పైన పెట్టుబడులు పెట్టిన వారు తక్కువ కాలంలో మంచి రిటర్న్స్ ఆర్జించారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం వచ్చాక రియాల్టీ వేగం పుంజుకుంది. నాలుగేళ్ల క్రితం జిల్లాల విభజన అనంతరం స్థానికంగా కొన్ని పట్టణాలలో రియాల్టీ రంగం ఒకటి నుండి నాలుగు రెట్లు కూడా పెరిగింది. కొన్ని పరిమిత ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మిగతా వాటి కంటే అధిక రిటర్న్స్ ఇస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ సాధిస్తోంది. దేశ నిర్మాణం వేగంగా జరగాలంటే రహదారులు ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రోడ్లు, రైలు మార్గాలపై దృష్టి సారించింది. దీంతో జాతీయ రహదారుల వెంబడి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది.

అందుకే డిమాండ్

అందుకే డిమాండ్

జాతీయ రహదారుల వెంబడి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుండటం, రియాల్టీ వెంచర్లు పెరగడం కనిపిస్తోంది. కమర్షియల్ ప్లాట్స్, వేర్‌హౌస్, లాజిస్టిక్ పార్క్స్, ట్రావెలర్ ఫెసిలిటీస్, మోటారిస్ట్‌లకు వేసైడ్ సౌకర్యాలు సహా ఎన్నో సౌకర్యాలు జాతీయ రహదారుల మార్గంలో చూస్తున్నాం. దీంతో జాతీయ రహదారుల వెంబడి రియాల్టీ కూడా పుంజుకుంటోంది.

650 ప్రాంతాల గుర్తింపు..

650 ప్రాంతాల గుర్తింపు..

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు పలు రాష్ట్రాల్లో 650 ప్రాంతాల్లో 3000 హెక్టార్లను గుర్తించింది. వచ్చే అయిదేళ్ల కాలంలో ప్రయివేటు సెక్టార్ భాగస్వమ్యంతో దీనిని అభివృద్ధి చేయనుంది. ఇందులో 376 ప్రాంతాలు కొత్త హైవేల పక్కన, 180 ఇప్పటికే ఉన్న హైవేల పక్కన, 94 ప్రాంతాలను ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేలో గుర్తించింది NHAI. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే రానున్న కాలంలో మంచి రిటర్న్స్ వస్తాయని భావిస్తున్నారు. సెలెక్టెడ్ ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధి తర్వాత భూమి వ్యాల్యూ 60 శాతం నుండి 80 శాతం వరకు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.

తెలంగాణ విషయానికి వస్తే...

తెలంగాణ విషయానికి వస్తే...

తెలంగాణ రాష్ట్రం వచ్చాక మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రియాల్టీ డిమాండ్ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతంలో మరింతగా పెరిగింది. జిల్లాల విభజన తర్వాత అక్కడ కూడా వేగవంతమైంది. నాలుగైదేళ్ల క్రితం పెట్టుబడులు పెడితే మూడింతల నుండి ఆరు, ఏడు రెట్ల రిటర్న్స్ అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా 10 శాతం నుండి 15 శాతం వరకు రిటర్న్స్ వస్తున్నాయి.

English summary

'రియాల్టీ' సూపర్బ్: అక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీగా రిటర్న్స్, ఎందుకంటే | Real Investment: More than 15 percent returns along national highways

The national highways and expressways across India have been a point of growth and development over the past few decades.
Story first published: Tuesday, July 6, 2021, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X