For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాటిలో వాటాలు పెంచుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, షేర్లు ఎప్పుడు విక్రయిస్తాడంటే?

|

ప్రముఖ ఇన్వెస్టర్, స్టాక్ మార్కెట్ ట్రేడర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో వివిధ స్టాక్స్‌లో తన వాటాను పెంచుకున్నారు. బిగ్‌బుల్ ఫేవరేట్ స్టాక్స్‌లో టాటా కంపెనీ ఒకటి. జూలై-సెప్టెంబర్ కాలంలో టైటాన్ కంపెనీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. జూలై ప్రారంభంలో రూ.1800 దిగువన ఉన్న టైటాన్ స్టాక్ ధర ఇప్పుడు రూ.2,400కు చేరువైంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.2677ని తాకింది. Q2FY22 నాటికి టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, అతని సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు కలిపి 4.87 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్ త్రైమాసికంలో వీరి వాటా 4.81 శాతంగా ఉంది. టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,37,60,395 షేర్లు లేదా 3.80 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆయన సతీమణి రేఖ 95,40,575 షేర్లను లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అదే జూన్ త్రైమాసికం ముగింపు నాటికి రాకేష్‌కు 3,30,10,395 షేర్లు (3.72 శాతం), రేఖకు 96,40,575 షేర్లు (1.09 శాతం) కలిగి ఉన్నారు. జూన్ త్రైమాసికం చివరి నాటికి 4.81 శాతంగా ఉన్న వీరి వాటా సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి 4.87 శాతం పెరిగింది.

టైటాన్‌లో పెరిగిన వాటా కానీ

టైటాన్‌లో పెరిగిన వాటా కానీ

ఝున్‌ఝున్ వాలా దంపతులకు జూన్ 2021 నాటికి టైటాన్ కంపెనీలో 4,26,50,970 షేర్లు కలిగి ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికం ముగిసేనాటికి వారిద్దరికి 4,33,00,970 షేర్లు కలిగి ఉన్నారు. అంటే ఈ మూడు నెలల కాలంలో వారి షేర్లు 6.5 లక్షలు పెరిగాయి. ఆసక్తికర అంశం ఏమంటే జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టైటాన్ కంపెనీలో తన వాటాలను కాస్త వెనక్కి తీసుకున్నారు. FY22 ప్రారంభంలో టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,52,60,395 షేర్లు (3.97 శాతం), రేఖ 96,40,575 షేర్లు (1.09 శాతం) కలిగి ఉన్నారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కంపెనీలో వీరి వాటా 5.06 శాతం. రెండో త్రైమాసికంలో భారీగా తగ్గింది. కానీ మూడో త్రైమాసికంలో పెరిగినప్పటికీ, ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే తక్కువే. టైటాన్ కంపెనీ షేర్లు 2021 క్యాలెండర్ ఏడాదిలో రూ.1560 నుండి రూ.2400కు వచ్చాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో 55 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

వాటాలు పెంచుకున్నారు

వాటాలు పెంచుకున్నారు

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కేవలం టైటాన్ కంపెనీలోనే తన వాటాను పెంచుకోలేదు. సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్), ఫెడరల్ బ్యాంకుల్లోను వాటాలు పెంచుకున్నారు. నాల్కో, కెనరా బ్యాంకులోను షేర్లు కొనుగోలు చేశారు.

డాటా ప్రకారం నాల్కోలో అతను రూ.569.3 కోట్ల వ్యాల్యూ కలిగిన 29,097,400 షేర్లు కొనుగోలు చేశాడు. తద్వారా కంపెనీలో 1.16 శాతం వాటా ఉంది.

కెనరా బ్యాంకులో రూ.569.3 కోట్లతో 1.6 శాతం వాటా కలిగిన 29,097,400 షేర్లను కొనుగోలు చేశారు.

ఇక, ఫెడరల్ బ్యాంకు, సెయిల్, టైటాన్ కంపెనీలో వాటాలను పెంచుకున్నారు. ఫెడరల్ బ్యాంకులో 0.9 శాతం, సెయిల్‌లో 0.4 శాతం వాటాను పెంచుకున్నారు.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సెయిల్‌లో అతని షేర్లు 72,500,000 షేర్లు ఉన్నాయి. తద్వారా 1.8 శాతం వాటాను దక్కించుకున్నారు. టైటాన్ కంపెనీలో కూడా వాటాను పెంచుకున్నారు.

ఈ మూడు సందర్భాల్లో అమ్మకం

ఈ మూడు సందర్భాల్లో అమ్మకం

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడారు. ట్రేడింగ్‌లో ఆయన పాటించే కొన్ని సూత్రాలతో పాటు ప్రస్తుత స్టాక్ మార్కెట్ పోకడపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న స్టాక్స్‌ను ఎప్పుడు విక్రయిస్తారనే దానిపై ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. స్టాక్స్‌ను అమ్మడానికి తాను మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. రిటర్న్స్ గరిష్ఠస్థాయికి చేరుకుంటే, P/E నిష్పత్తి గరిష్ఠానికి చేరితే, మరో చోట మంచి పెట్టుబడి అవకాశం లభిస్తే.. ఈ మూడు సందర్భాల్లో స్టాక్స్ విక్రయిస్తానని చెప్పారు. అలా కాదంటే స్టాక్స్‌ను అమ్మే అవకాశాలు తక్కువ అన్నారు. ప్రస్తుత స్టాక్ ధరను, ఒక్కో షేరుపై ఆ కంపెనీ ఆర్జిస్తున్న మొత్తంతో భాగిస్తే P/E నిష్పత్తి తెలుస్తుంది. ఇది పదిగా ఉందంటే కంపెనీ ఒక రూపాయి ఆర్జనను పొందేందుకు ఇన్వెస్టర్లు రూ.10 చెల్లిస్తున్నట్లు.

English summary

వాటిలో వాటాలు పెంచుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, షేర్లు ఎప్పుడు విక్రయిస్తాడంటే? | Rakesh Jhunjhunwala raises stake in this Tata stock

After raising stake in his portfolio stock Titan Company, ace investor and stock market trader Rakesh Jhunjhunwala has also increased his shareholding in Federal Bank during the July to September 2021 quarter.
Story first published: Thursday, October 21, 2021, 13:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X