For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!

|

మన దేశంలో బంగారం వినియోగం చాలా ఎక్కువ. దీనిని ధరించడంతో పాటు పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగించుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాల్సినప్పుడు బంగారాన్ని పెట్టి అప్పు లేదా లోన్ తీసుకు వచ్చే వారు ఎందరో ఉంటారు. గోల్డ్ లోన్ సంస్థలు కూడా చాలా వరకు పుట్టుకు వచ్చాయి. బంగారం పెడితే వడ్డీపై లోన్ ఇస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో లేదా స్వల్పకాల ప్రయోజనం కోసం బంగారంపై వడ్డీ తీసుకుంటుంటారు.

భూమి రిజిస్ట్రేషన్‌కు త్వరపడండి!: మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?భూమి రిజిస్ట్రేషన్‌కు త్వరపడండి!: మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?

పర్సనల్ లోన్‌తో పోలిస్తే కాస్త బెటర్

పర్సనల్ లోన్‌తో పోలిస్తే కాస్త బెటర్

బంగారంపై రుణాలు కాస్త తక్కువ వడ్డీకే వస్తుంటాయి. అయితే పర్సనల్ లోన్స్‌తో పోలిస్తేనే కాస్త బెట్టర్. బంగారంపై లోన్ తీసుకుంటే వివిధ రకాల రీపేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అయితే బంగారంపై రుణాలు తీసుకునే వారు వివిధ అంశాలను విస్మరించడం ద్వారా ఎక్కువ మొత్తం చెల్లిస్తుంటారు. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకునే సమయంలో వీటిని చూసుకోవడం మంచిది....

వడ్డీ రేట్లు పోల్చుకోండి

వడ్డీ రేట్లు పోల్చుకోండి

బంగారంపై వడ్డీ రేటు లోన్ నుంచి ఎల్టీవీ వ్యాల్యూ రేషియో వరకు ఆధారపడి ఉంటుంది. అలాగే, ఆయా బ్యాంకులు లేదా సంస్థలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎల్టీవీ నిష్పత్తిని ఆర్బీఐ 75 శాతం వరకు అనుమతించింది. అంటే బంగారం మోర్టగేజ్ ద్వారా మీ బంగారం ధరలో 75 శాతం లోన్ మాత్రమే తీసుకోగలరు. ఎల్టీవీని తగ్గిస్తే వడ్డీ రేటు తగ్గొచ్చు. బ్యాంకును బట్టి బంగారంపై వడ్డీ రేట్లు 9 శాతం నుంచి 25 శాతం వరకు ఉన్నాయి. ఒకే ఎల్టీవీ నిష్పత్తికి కూడా ఆయా బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లు వసూలు చేయవచ్చు.

తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు

తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకు

బంగారంపై రుణం అంటే సెక్యూర్డ్ లోన్. కాబట్టి దీనికి క్రెడిట్ స్కోర్‌తో సంబంధం లేదు. కాబట్టి బంగారంపై రుణం తీసుకునే సమయంలో మీరు నిర్దిష్ట ఎల్టీవీ నిష్పత్తికి, తక్కువ వడ్డీ రేటుకు ఇచ్చే బ్యాంకును ఎంచుకోవాలి. ఇందుకు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకోండి.

ప్రాసెసింగ్ ఫీజు విస్మరించవద్దు

ప్రాసెసింగ్ ఫీజు విస్మరించవద్దు

చాలా బ్యాంకులు బంగారం మీద రుణంపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు స్థిర ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుండగా, మరికొన్ని రుణ మొత్తాన్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. సాధారణంగా ఇది 0.20 శాతం నుంచి 2 సాతం వరకు ఉంటుంది. ప్రమోషనల్ ఆఫర్స్ సమయంలో కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తుంటాయి కూడా. కాబట్టి వివిధ బ్యాంకుల ప్రాసెసింగ్ ఫీజు సరిపోల్చుకోండి. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు చాలా ముఖ్యం.

ప్రీపేమెంట్ ఛార్జీలు చూసుకోండి

ప్రీపేమెంట్ ఛార్జీలు చూసుకోండి

సాధారణంగా బ్యాంకులు బంగారం మీద రుణంపై ముందస్తు చెల్లింపు జరిమానాలు వసూలు చేయవు. కొన్ని బ్యాంకులు ఆరు నెలల ముందుగానే క్లోజ్ చేస్తే 2 శాతం వరకు ప్రీపేమెంట్ ఛార్జీని వసూలు చేస్తాయి. కాబట్టి ముందస్తు చెల్లింపులకు జరిమానా విధించని బ్యాంకులు ఉంటే వాటిని ఎంచుకోవడం మంచిది.

రీపేమెంట్ ఆప్షన్స్ పోల్చుకోండి

రీపేమెంట్ ఆప్షన్స్ పోల్చుకోండి

బ్యాంకులు లేదా సంస్థలు రుణగ్రహీతలకు అనుగుణంగా ఉండే చెల్లింపులకు మొగ్గు చూపుతాయి. ఇందులో ఈఎంఐ మోడ్, అప్ ఫ్రంట్ ఇంటరెస్ట్ పేమెంట్ ఆఫ్షన్, వడ్డీ-ప్రిన్సిపల్ రెండింటి వేగవంతమైన చెల్లింపు వంటి ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని బ్యాంకులు లేదా సంస్థలు ప్రతి నెల ప్రారంభంలో వడ్డీ చెల్లింపును, మెచ్యూరిటీ సమయంలో చెల్లింపుకు అవకాశం ఇస్తారు. మీకు ఏది యాప్ట్ అయితే దానిని ఎంచుకోండి.

English summary

బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి! | Planning to take a gold loan? Avoid these mistakes to lower cost

Gold loan is an excellent source to borrow money in case of an emergency or for a short term purpose as it is issued quickly and without any income proof.
Story first published: Thursday, December 19, 2019, 21:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X