న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అంటే ఓ ధీమా! ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో తమకు, తమ కుటుంబానికి భరోసాగా ఉంటుంది. LICలో ఎన్నో ఆకర్షణీయ స్కీంలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని అధిక ప్రయోజనాలు కలిగిన స్కీంల వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతుంటారు. అయితే ఈ ప్రభుత్వరంగ అతిపెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఈ నెలాఖరులోగా కొన్ని పాలసీలను ఉపసహరించుకోనుందని తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నవంబర్ 30 నుంచి కొన్ని పాలసీలు క్లోజ్
దాదాపు ఇరవై నాలుగు వరకు ఇండివిడ్యువల్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్‌ను ఉపసంహరించుకోనుందని తెలుస్తోంది. నవంబర్ 30వ తేదీ నుంచి కొన్ని పాలసీలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎనిమిది వరకు గ్రూప్ ఇన్సురెన్స్ ప్లాన్లు, ఏడెనిమిది రైడర్స్ ఇందులో ఉన్నాయి. జీవన్ ఆనందం, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్యా, జీవన్ లభ్ వంటి రిటైల్ ప్రోడక్ట్ పాలసీలు కూడా ఉపసంహరించుకునే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.

IRDA నిబంధనలకు అనుగుణంగా...
ఇన్సురెన్స్ రెగ్యులేటర్ IRDA నిబంధనలకు అనుగుణంగా LIC తన టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను మార్చాలని చూస్తోంది. అందుకే పలు పాలసీలను ఉపసంహరించుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది.

ఎక్కువ ప్రీమియం రేట్లు, తక్కువ బోనస్
ఉపసంహరించుకునే ప్లాన్స్‌కు బదులు ఇన్సురెన్స్ రెగ్యులేటర్స్‌కు అనుగుణంగా కొత్త ప్లాన్స్‌ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ప్లాన్స్‌లలో కొన్ని మార్పులు చేర్పులు చేయవచ్చు. అలాగే కొత్త పేర్లు కూడా పెట్టవచ్చు. అయితే కొత్త ప్రోడక్ట్స్ వల్ల తక్కువ బోనస్ రేట్లు, ఎక్కువ ప్రీమియం రేట్లు ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

80 వరకు ప్రోడక్ట్స్‌కు చెల్లుచీటి!
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు IRDA నిబంధనలకు అనుగుణంగా లేని పలు ప్రోడక్ట్స్‌ను ఎల్ఐసీ ఉపసంహరించుకోవచ్చు. కొత్త IRDA నిబంధనలు జూలై 8, 2019న జారీ చేశారు. దాదాపు 75 నుంచి 80 వరకు ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్ నవంబర్ 30వ తర్వాత నుంచి అందుబాటులో ఉండకపోవచ్చు. వివిధ ఉత్పత్తులను ఈ నెలాఖరులో క్లోజ్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏజెంట్లు ఈ 30వ తేదీలోగా మరిన్ని ప్రోడక్ట్స్ కొనుగోలు చేయమని కస్టమర్లను అడుగుతున్నారట. ప్రోడక్ట్స్ ఉపసంహరణ పూర్తిగా ఉండదని కూడా అంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం తిరిగి ప్రారంభించవచ్చు.

ప్రీమియం రేట్లు తగ్గవచ్చు..
మార్కెట్లో ఎలాంటి అంతరాయం లేదని, 80 వరకు ప్రోడక్ట్స్‌ను ఉపసంహరించుకోకపోవచ్చునని, కానీ డిసెంబర్ 1వ తేదీ నుంచి మార్పులతో కొన్ని ముందుకు రావొచ్చునని, కొన్ని ప్రోడక్ట్స్‌పై ప్రీమియం రేట్లు తగ్గవచ్చునని అధికారులు చెబుతున్నారట. ఇన్సురెన్స్ ప్రోడక్ట్స్‌ను సవరించడం పెద్ద టాస్క్ అని, ఛాలెంజింగ్ అంశమని అంటున్నారు.

పాలసీలు సవరిస్తే..
బీమా పాలసీలను సవరిస్తే పాలసీ డాక్యుమెంట్స్ రెడీ చేయడం, పాలసీ ప్రయోజనాలు మార్చడం, సాఫ్టువేర్ మార్పులు, కొత్త పాలసీలను మార్కెట్లో విక్రయించేందుకు ఏజెంట్లకు ట్రెయినింగ్ వంటి ఇబ్బందులు ఉంటాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications