For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో ఛాన్స్!: పీఎం వయవందన స్కీంలో మార్పులు, అందుబాటులోకి కొత్త పాలసీ

|

వృద్ధులకు భరోసా కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) పెన్షన్ పథకం తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిని ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. ఇందులో స్వల్ప మార్పులు చేసి నేటి నుండి కొత్త పాలసీలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు జీవిత బీమా సంస్థ తెలిపింది. ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం 2017 మే నెలలో తీసుకు వచ్చింది. పదవీ విరమణ తీసుకున్న వారికి, వృద్ధాప్యంలో స్థిర ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి పథకం.

గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా... వడ్డీ రేట్లు ఎంత తగ్గాయో తెలుసా?గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా... వడ్డీ రేట్లు ఎంత తగ్గాయో తెలుసా?

గడువు పొడిగింపులు

గడువు పొడిగింపులు

PMVVYలో తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత దీనిని 2020 మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. తాజాగా మరోసారి మూడేళ్ల పాటు పొడిగించి 2023 మార్చి 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇందులో ఇప్పటికి ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్లు అవకాశం లభించింది.

పెట్టుబడి కాల వ్యవధి పదేళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి తిరిగి వస్తుంది.

పాలసీ కాల వ్యవధిలో మృతి చెందితే నామినీకి పెట్టుబడి మొత్తాన్ని ఇస్తారు.

డిపాజిట్ పరిమితి, వడ్డీ రేటు

డిపాజిట్ పరిమితి, వడ్డీ రేటు

- ఇందులో గరిష్టంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు.

- ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి ఆఫ్ లైన్ ద్వారా లేదా ఎల్ఐసీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.

- 2021 మార్చి ఆర్థిక సంవత్సరంలోపు కొనుగోలు చేసిన పాలసీలకు 7.4 శాతం వార్షిక వడ్డీ ఇస్తారు. ఈ వడ్డీ ప్రతి నెల పింఛన్ రూపంలో పాలసీదారులకు అందుతుంది.

2.21, 2.23 మార్చి లోపు విక్రయించే పాలసీలకు ఆయా ఆర్థిక సంవత్సరాల ప్రారంభంలో ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేటు ఇస్తామని ఎల్ఐసీ తెలిపింది.

వడ్డీ రేటు, పింఛన్ మొత్తం..

వడ్డీ రేటు, పింఛన్ మొత్తం..

ఈ స్కీంలో చేరేందుకు పెన్షన్‌దారు నెల లేదా క్వార్టర్లీ లేదా ఆరు నెలలకు లేదా ఏడాదికి ఓసారి వడ్డీ చెల్లింపు ఆప్షన్ ఎంచుకోవచ్చు.

నెలవారీ ఆప్షన్ ఎంచుకుంటే కనీసం రూ.1,62,162, క్వార్టర్లీ అయితే రూ.1,61,074, ఆరు నెలల ఆప్షన్ అయితే రూ.1,59,574, ఏడాది ఆప్షన్ అయితే కనీసం రూ.1,56,658 పాలసీలు కొనుగోలు చేయాలి.

- ఈ పథకంలో గరిష్టంగా రూ.9,250 నెలవారీ పెన్షన్ అందుకోవచ్చు.

- క్వార్టర్‌కు అయితే రూ.27,750, ఆరు నెలలకు రూ.55,000, ఏడాదికి రూ.1,11,000 చొప్పున పెన్షన్ వస్తుంది.

రుణ సదుపాయం, పాలసీ నుండి బయటకు..

రుణ సదుపాయం, పాలసీ నుండి బయటకు..

- గతంలో ఈ పథకంలో చేరిన వృద్ధులకు 8 శాతం వడ్డీ రేటు ఇచ్చింది. నెలకు గరిష్టంగా రూ.9,250 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 7.4 శాతానికి తగ్గింది. నెలకు గరిష్టంగా రూ.9,250 వస్తుంది.

- కనీసం నెలవారీ పెన్షన్ రూ.1,000 నుండి గరిష్టంగా రూ.9,250 వరకు వస్తుంది.

- నెఫ్ట్ లేదా ఆధార్ ఆదారిత పేమెంట్ సిస్టం రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు.

పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత దీనిపై 75 శాతం వరకు రుణ సదుపాయం ఎల్ఐసీ ఇస్తోంది.

పాలసీదారులకు లేదంటే వారి భాగస్వాములకు అనారోగ్య పరిస్థితులు ఉంటే చికిత్స నిమిత్తం పాలసీ నుండి ముందస్తుగా బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. కొనుగోలు చేసిన పాలసీలో 98 శాతం తిరిగి చెల్లిస్తుంది.

పన్నులు

పన్నులు

PMVVYలో పెట్టుబడులకు ప్రత్యేక పన్నుప్రయోజనాలు లేవు. ఈ పథకంతో పాటు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే వ్యక్తిగత ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. అయితే అందుకునే ఆదాయం మొత్తం రూ.50,000 మించకుంటే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్‌ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశముంది. పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

నచ్చకుంటే 15 రోజుల్లో

నచ్చకుంటే 15 రోజుల్లో

PMVVYలో పెట్టుబడి పెట్టినవారు తమకు పథకం వివరాలు నచ్చకుంటే 15 రోజుల్లోపు వెనక్కి వచ్చేయవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారుకు 30 రోజుల గడువు ఉంటుంది. దీనినే లుకప్ పీరియడ్ అంటారు. స్టాంప్ ఛార్జీల మేరకు నష్టపోవాల్సి ఉంటుంది.

PMVVYలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద, రెండో ఏడాది నుండి మిగతా తొమ్మిది సంవత్సరాలు 0.3 శాతం వ్యయాల కింద కోత విధిస్తారు.

ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు భద్రత ఉంది. ఎందుకంటే దీనికి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది.

English summary

మరో ఛాన్స్!: పీఎం వయవందన స్కీంలో మార్పులు, అందుబాటులోకి కొత్త పాలసీ | LIC launches new PM Vaya Vandana Yojana: Know details and benefits of PMVVY

Life Insurance Corporation of India (LIC) on Monday announced the launch of the Pradhan Mantri Vaya Vandana Yojana (Modified- 2020) Scheme.
Story first published: Tuesday, May 26, 2020, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X