For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold ETF: బంగారం ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడితే మంచిది

|

గత కొంతకాలంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇటీవల ధరలు తగ్గినప్పటికీ, కరోనా ముందుస్థాయి కంటే ఇప్పటికీ రూ.10వేలు ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది. రిస్క్ లేని పెట్టుబడి కోసం చాలామంది బంగారం వైపు చూస్తారు. బంగారంపై పెట్టుబడిని ఫిజికల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎప్, గోల్డ్ ఫండ్స్ వంటి వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వేటిని ఎంచుకోవాలనే అంశం మన పెట్టుబడి మొత్తం, కాలపరిమితి, రిటర్న్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. బంగారంపై ఏ రూపంలో ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ ఉంటాయి. అయితే ఇటీవల ఈటీఎఫ్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారంపై పెట్టుబడికి సులభమైన, పారదర్శక మార్గాలలో ఒకటి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి ద్వారా యూనిట్ డిమాండ్ ఖాతాలో ఉన్నందున దొంగతనం, స్వచ్ఛత, ద్రవ్యత్వం, నిల్వ ధర వంటి భౌతిక బంగారంతో సంబంధం కలిగిన ప్రమాద కారకాల గురించి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.

బంగారం వ్యాల్యూ

బంగారం వ్యాల్యూ

గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారం ధరతో ముడివడి ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ బంగారం యొక్క నిర్దిష్ట వ్యాల్యూతో ముడివడి ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారుల తరఫున భౌతిక బంగారాన్ని పెట్టుబడి పెడుతాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లకు అనేక ఇతర అంశాలు ఇక్కడ చూడండి. మ్యూచువల్ ఫండ్స్ బంగారాన్ని వ్యాల్యూ చేయడంలో సెబి నిబంధనలను అనుసరించాలి. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్(LBMA)లో పోల్ పోల్ చేయబడిన ధరల ఆధారంగా వ్యాల్యూను పొందాలి. ఈ ధరలను భారతీయ కొలమానాలు, భారతీయ కరెన్సీకి మార్చాలి.

కొన్ని ఈటీఎఫ్‌ల విషయానికి వస్తే నిప్పోన్ ఇండియా ఈటీఫ్ గోల్డ్, HDFC గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి.

LBMA నిబంధనల మేరకు...

LBMA నిబంధనల మేరకు...

సెబి నిబంధనల ప్రకారం LBMA ప్రమాణాల మేరకు గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారాన్ని కొనుగోలు చేయాలి. LBMA ప్రమాణాల ప్రకారం గోల్డ్ బార్స్ కనీసం 99.5 శాతం స్వచ్ఛతను కలిగి ఉండాలి. ఫిజికల్ గోల్డ్ నిర్వహణకు ఫండ్ హౌస్‌లు సంరక్షకులను నియమిస్తాయి. వారు బంగారాన్ని వాల్ట్‌లలో నిల్వ చేయడానికి వాల్టింగ్ ఏజెన్సీని నియమిస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారాన్ని నిల్వ చేయడానికి, నిర్వహించడానికి ఛార్జీలను కలిగి ఉంటాయి. అలాగే విపత్తుల నుండి వాల్ట్‌లలో ఉంచిన బంగారాన్ని రక్షించడానికి బీమాను కలిగి ఉంటాయి. సెబి నిబంధనల ప్రకారం ETFల పైన ఒక శాతం TER గరిష్ట పరిమితి ఉంటుంది.

స్వచ్చత కలిగిన బంగారంపై పెట్టుబడి

స్వచ్చత కలిగిన బంగారంపై పెట్టుబడి

గోల్డ్ ఈటీఎఫ్‌లు అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారంపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక జ్యువెల్లరీ అయితే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటివి ఉంటాయి. బంగారు ఆభరణాలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి.

బంగారం ధరలపై ఆధారపడి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.41 నుండి రూ.42 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అనేక ఈటీఎఫ్‌లు బంగారం యూనిట్‌ను 0.01 గ్రాము వరకు అందుబాటులో ఉంచాయి.

గోల్డ్ ఈటీఎఫ్‌ల మూడేళ్ల హోల్డింగ్స్ తర్వాత దీర్ఘకాలిక లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు ఇరవై శాతం పన్ను విధిస్తారు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు అధిక నియంత్రణలో ఉంటాయి. అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడికి గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి మార్గం. దేశంలో పదకొండు లిస్టెడ్ గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. ఈ పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా అవసరం. గోల్డ్ ఈటీఎఫ్ సావరీన్ గోల్డ్ బాండ్‌కు సమానమైన వ్యాల్యూను అందిస్తుంది.

English summary

Gold ETF: బంగారం ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడితే మంచిది | How gold ETFs give investors the purest yellow metal

Gold ETFs are linked to the price of gold. Each unit of a gold ETF is pegged to a certain value of gold. Now, gold ETFs invest and hold physical gold on behalf of investors. Here are many other facets to gold ETFs.
Story first published: Wednesday, November 10, 2021, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X