ఎక్కువ పాన్‌కార్డులుంటే రూ.10,000 జరిమానా, ఫైన్ తప్పించుకునేందుకు ఇలా చేయాలి?
మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నాయా? అయితే మీకు ఇబ్బందే. రూ.10,000 జరిమానాగా చెల్లించాల్సి రావొచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 చట్టం సెక్షన్ 139A ప్రకారం ఒక వ్యక్తికి కేవలం ఒకే పాన్ కార్డు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉండే ఫైన్ వేస్తారు. అదే చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే రూ.10,000 పెనాల్టీ వేయవచ్చు.

ప్రభుత్వానికి సరెండర్ చేయాలి
వివిధ కారణాల వల్ల చాలామంది వద్ద రెండు లేదా అంతకుమించి పాన్ కార్డులు ఉంటాయి. తమ వద్ద ఎక్కువ పాన్ కార్డులు ఉంటే వాటిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరగా సరెండర్ చేయడం మంచిది. మీకు అవసరం అనుకున్న ఓ పాన్ కార్డు ఉంచుకుంటే చాలు.

మల్టిపుల్ పాన్ కార్డులకు ఇలా ఛాన్స్
ముఖ్యంగా నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా (NRI) వద్ద ఒకటికి మించి పాన్ కార్డులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి వారి వద్ద కూడా ఉంటాయి. తొలుత పాన్ కార్డు తీసుకొని, ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన వారు.. మళ్లీ తిరిగి వచ్చాక వివిధ కారణాలతో మరో కొత్త పాన్ కార్డు తీసుకోవచ్చు. అలాగే ఇండియన్స్ కూడా ఎవరైనా పాన్ కార్డు తీసుకొని అది పోయాక మరో కార్డ్ తీసుకుంటారు. పాతవాటిని సరెండర్ చేయకుండా లేక పాత దాని గురించి తెలియపోవడంతో దానిని వదిలేస్తారు. కొత్తది తీసుకుంటారు.

రూ.10,000 జరిమానా పడవద్దంటే..
ఎక్కువ పాన్ కార్డులు ఉంటే రూ.10,000 జరిమానా విధిస్తారు. తమ వద్ద ఉన్న అదనపు పాన్ కార్డును స్వాధీనం చేయడం ద్వారా ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. అందుకు మీ వద్ద ఉంటే మల్టిపుల్ పాన్ కార్డులను ప్రభుత్వానికి అప్పగించాలి.

ఆఫ్‌లైన్.. ఆన్‌లైన్ మోడ్..
మీ వద్ద మల్టిపుల్ పాన్ కార్డులు ఉంటే ఆఫ్ లైన్, ఆన్‌లైన్ మోడ్‌లోను ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. ఈ పాన్ కార్డులు సరెండర్ చేయడం సులభమే. తద్వారా ఆదాయపు పన్ను శాఖ జరిమానా నుండి తప్పించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా సరెండర్ చేయాలి?
- యూజర్లు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- Surrender Duplicate PAN పైన క్లిక్ చేయాలి.
- పాన్ కార్డు వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. అంటే మీరు దేనిని అయితే సరెండర్ చేయాలనుకుంటున్నారో దాని వివరాలు ఇవ్వాలి.
- ఆ తర్వాత ఆ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది.

ఆఫ్‌లైన్‌లో ఎలా సరెండర్ చేయాలి?
- మీ జూరిస్డిక్షన్ పరిధిలోని ఇన్‌కం ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ అడ్రస్‌కు పాన్ కార్డును సరెండర్ చేస్తున్నట్లు లేఖ రాయాలి.
- అందులో పాన్ కార్డు వివరాలు అందులో పేర్కొనాలి.
- ఆ లేఖను మీ పరిధిలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాలి. ఈ లేఖను ఐటీ విభాగం అందుకున్నట్లుగా రశీదు ఇస్తారు. దానిని అట్టి పెట్టుకోవాలి.


Click it and Unblock the Notifications