Gold Price Today: బంగారం కొనుగోలుకు ఇదే సమయమా?
ముంబై: బంగారం ధరలు భారీగా క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000కు పైగా తక్కువగా ఉంది. దీర్ఘకాలంలో పెట్టుబడుల కోసం, అలాగే కొద్దిరోజుల్లో వివిధ శుభకార్యాలయాలకు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమైనందున దీని ప్రభావాన్ని బట్టి పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ మరింత తగ్గినా పెద్దగా మార్పులు ఉండే పరిస్థితి లేదని, కొంత తగ్గుదల మాత్రమే ఉండవచ్చునని, కాబట్టి పసిడి ఇప్పుడు కొనుగోలు చేయడం బెట్టర్ అని సూచిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్: లాక్డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు

రూ.46,200 దిగువకు బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నిన్న స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తానికి ఈ వారం రూ.46,200 దిగువన ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64.00 (0.14%) పెరిగి రూ.46,191.00 వద్ద ముగిసింది. రూ.45,986.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,490.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,861.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000కు పైగా తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21.00 (0.05%) పెరిగి రూ.46,203 వద్ద ముగిసింది. రూ.46,203.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,039.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.400 పెరిగినా
వెండి ధరలు చివరి సెషన్లో రూ.400కు పైన పెరిగినప్పటికీ రూ.69,000 దిగువనే ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.420.00 (0.61%) పెరిగి రూ.68,914.00 వద్ద ముగిసింది. రూ.68,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,838.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,530.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.392.00 (0.56%) పెరిగి రూ.70,023.00 వద్ద ముగిసింది. రూ.68,932.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,940.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,708.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నిన్న 1783 డాలర్ల వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.35 (+0.47%) డాలర్లు పెరిగి 1783.35 డాలర్ల వద్ద ముగిసింది. ఈ సెషన్లో 1,759.15 - 1,790.70
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.69 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.294
(+1.09%) డాలర్లు పెరిగి 27.372 డాలర్ల వద్ద ముగిసింది. ఈ సెషన్లో 26.180 - 27.700 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.14 శాతం పెరిగింది.