కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది (2020)లో బంగారం, వెండి ధరలు భారీగా ఎగిశాయి. ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.79,000 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 2,072 డాలర్లకు, సిల్వర్ ఫ్యూచర్స్ 29 డాలర్లను క్రాస్ చేసింది. అయితే ఆ తర్వాత కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు దారుణంగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ 24 డాలర్ల దిగువకు, బంగారం 1700 డాలర్ల దిగువకు వచ్చింది. దేశీయ మార్కెట్లోను పసిడి రూ.44వేల దిగువకు, వెండి రూ.60వేల దిగువకు వచ్చింది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తిరిగి ఈ విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయి.

మళ్లీ పుంజుకుంటున్న ధరలు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మున్ముందు మరింతగా పెరగవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్ల కొనసాగింపు, ద్రవ్యోల్భణ ప్రభావం వంటి వివిధ కారణాలు బంగారం, వెండి ట్రెండ్ తిరిగి పుంజుకోవడానికి మరింత ఊతమిచ్చాయని అంటున్నారు. గత ఏడాది బంగారం 45 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి ధరలు ప్రస్తుతం 25 శాతం క్షీణించాయి. అదే సమయంలో వెండి ఆల్ టైమ్ గరిష్టంతో 15 శాతం పడిపోయింది.

మళ్లీ జంప్ చేసే దిశగా
కరోనా సెకండ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీస్ నుండి సురక్షిత పెట్టుబడిగా భావించే బులియన్ మార్కెట్ దిశగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు. అలాగే బలహీనపడుతున్న డాలర్, యూఎస్ బాండ్ యీల్డ్స్ ప్రభావం బంగారం పైన ఉంటుందని, ఈ ధరలు పెరగవచ్చునని అంటున్నారు. గత ఏడాది బులియన్ మార్కెట్ జంప్ చేసినప్పటికీ, మూడు నెలలుగా దాదాపు స్థిరంగా కనిపిస్తోందని, ఇప్పుడు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మళ్లీ ఆ దిశగా పసిడి
బంగారం ధరలు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో గతవారం భారీగా పెరిగి రూ.47,760 వద్ద, వెండి రూ.71,500 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఏకంగా 1800 డాలర్లు దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1,831.95 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 27.558 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. బంగారం ధరలు ఈ వారం 49వేల మార్కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications