For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

|

నిన్న దాదాపు స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు (19, మంగళవారం, అక్టోబర్) కూడా అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34.00 (0.07%) పెరిగి రూ.47325.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 (0.20%) లాభపడి రూ.47522.00 వద్ద ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.334.00 (0.53%) ఎగిసి రూ.63600.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.355.00 (0.56%) ఎగిసి రూ.64153.00 వద్ద ట్రేడ్ అయింది. కొద్ది రోజుల క్రితం రూ.47,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,500కు చేరువైంది.

రూ.61,000 స్థాయిలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64,000కు సమీపించింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8900 వరకు తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.16,000కు పైగా తక్కువగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మళ్లీ పెరిగింది. ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ +9.60 (+0.54%) డాలర్లు లాభపడి 1,775.30 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.274 (+1.18%) డాలర్లు క్షీణించి 23.538 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఆర్థిక రికవరీ కనిపించడంతో..

ఆర్థిక రికవరీ కనిపించడంతో..

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ కనిపించడంతో బంగారం ధరలు ఇటీవల క్షీణించాయి. కానీ వివిధ పరిణామాలు పెరుగుదలకు కారణమయ్యాయి. గతవారం ఓ సమయంలో 1800 డాలర్లను సమీపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 30 డాలర్ల మేర తగ్గింది. కానీ ఈ వారం మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. ఏడాది కాలంలో బంగారం ధర 8.28 శాతం మేర క్షీణించింది.

గత నెలలో బంగారం సేల్స్ 0.7 శాతం పెరిగాయి. ఇక, దేశీయంగా చూస్తే బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.1,80,000 కోట్లు.

బై-జోన్

బై-జోన్

బంగారం ధరలు నిన్న అతి స్వల్పంగా లాభపడ్డాయని, అలాగే, ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని షేర్ ఇండియా ప్రతినిధి రవిసింగ్ అంటున్నారు. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ ఇటీవల వరుసగా బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం బై-జోన్ రూ.47300, టార్గెట్ ధర రూ.47500, సెల్ జోన్ రూ.47100, టార్గెట్ ధర రూ.46900గా పేర్కొంటున్నారు.

గంగాధర్ కమోడిటీ ప్రతినిధి అమిత్ ఖారే డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ మద్దతు ధర రూ.47,200, నిరోధకస్థాయి రూ.47,500గా పేర్కొంటున్నారు.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

- ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,070

- ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450

- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,620

- కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750

- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300

- కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300

- పుణేలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490

- అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,960

- జైపూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410

- లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200

- పాట్నాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,490

English summary

Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు | Gold Rate Remains Stable, Yellow metal likely to witness breakout

Gold prices inched up on October 19 as a decline in the US dollar and US bond yields provided some support to the precious metal.
Story first published: Tuesday, October 19, 2021, 11:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X