For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: బంగారం ధరలపై వడ్డీ రేటు, బాండ్ యీల్డ్స్ ఒత్తిడి

|

బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా కనిపిస్తున్నాయి. నేడు (జనవరి 18, 2022) ప్రారంభ సెషన్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్ అతి స్వల్పంగా తగ్గింది. పసిడి ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. నేడు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో 1830 డాలర్ల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1820 డాలర్ల దిగువకు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 260 డాలర్లు తక్కువగా ఉంది.

నేటి ధరలు

నేటి ధరలు

ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.17 క్షీణించి రూ.47,900 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.33 తగ్గి రూ.47,986 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ 0.15 శాతం తగ్గి 1816.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి లేదా అతి స్వల్పంగా క్షీణించాయి.

వెండి ధరలు రూ.62,000 దిగువకు పడిపోయాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.173 తగ్గి రూ.61,725 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.77 క్షీణించి రూ.62,435 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో 0.072 డాలర్లు తగ్గి 22.990 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వడ్డీ రేట్లు, అమెరికా బాండ్ యీల్డ్స్

వడ్డీ రేట్లు, అమెరికా బాండ్ యీల్డ్స్

యూఎస్ బాండ్ యీల్డ్స్ భారీగా పెరిగాయి. ఇది పసిడి ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు ఈ క్యాలెండర్ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మూడు పర్యాయాలు పెంచనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే పసిడిలోకి ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతాయి.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1804 డాలర్ల నుండి 1792 డాలర్లు. నిరోధకస్థాయి 1830 డాలర్ల నుండి 1844 డాలర్లు. వెండి మద్దతు ధర 22.80 డాలర్ల నుండి 22.55 డాలర్లు. నిరోధకస్థాయి 23.40 డాలర్ల నుండి 23.70 డాలర్లు. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.47,750-47,650. నిరోధకస్థాయి రూ.48,100 నుండి రూ.48,250. వెండి మద్దతు ధర రూ.61,500 నుండి రూ.61,200. నిరోధకస్థాయి రూ.62,300 నుండి రూ.62,800.

English summary

Gold Prices Today: బంగారం ధరలపై వడ్డీ రేటు, బాండ్ యీల్డ్స్ ఒత్తిడి | Gold Prices Today: Yellow metal to feel pressure from higher US bond yield prices

Gold prices were flat on January 18 in the international markets as a weaker dollar partially offset pressure from elevated US Treasury yields, which dim the appeal of a non-yielding bullion.
Story first published: Tuesday, January 18, 2022, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X