For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్

|

ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ 15 రోజుల్లో గోల్డ్ ఫ్యూచర్ 6 శాతం ఎగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి ర్యాలీకి అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వంటి వివిధ అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై కూడా ఎంతోకొంత ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టర్లు క్రిప్టోవైపు ఎక్కువగా మొగ్గు చూపితే బంగారంలోకి పెట్టుబడులు తగ్గవచ్చు. గత 15 రోజుల్లో ధరలు దేశీయ మార్కెట్లో 6 శాతం, అంతర్జాతీయ మార్కెట్లో 4 శాతం పెరిగాయి. నేడు ఏకంగా 1775 డాలర్లను క్రాస్ చేసి, 1800 డాలర్ల దిశగా పరుగెడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు వంటి అంశాలు మరో ర్యాలీకి ఊతమిచ్చే అవకాశముందని అంటున్నారు. కరోనా కారణంగా 2020 ఆగస్ట్‌లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 2072, దేశీయ మార్కెట్లో రూ.56200 పలికింది. ఆ తర్వాత పతనమైనప్పటికీ, మళ్లీ ధరలు ఎగిసిపడుతున్నాయి.

రూ.47,000 క్రాస్ చేసిన పసిడి

రూ.47,000 క్రాస్ చేసిన పసిడి

నిన్న రూ.47వేల పైకి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సెషన్లో ఆ స్థాయి కంటే పైకి చేరుకున్నాయి. ఉదయం తగ్గిన సాయంత్రానికి మళ్లీ పెరిగాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.155.00 (0.33%) పెరిగి రూ.47330.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,099.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,432.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.139.00 (0.29%) పెరిగి రూ.47540.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,370.00 ప్రారంభమైన ధర, రూ.47,628.00 గరిష్టాన్ని, రూ.47,053.00 కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల

వెండి స్వల్ప పెరుగుదల

వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.153.00 (0.22%) పెరిగి రూ.68693.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,400.00 వద్ద ప్రారంభమై, రూ.69,271.00 గరిష్టాన్ని, రూ.67,990.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.188.00 (0.27%) పెరిగి రూ.69800.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,489.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,358.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,087.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిశగా

1800 డాలర్ల దిశగా

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగి 1800 డాలర్ల దిశగా వెళ్తోంది. నేడు 12.85 (+0.73%) డాలర్లు పెరిగి 1,779.65 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,760.45 - 1,784.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.173 (+0.67%) డాలర్లు తగ్గి 26.137 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.797 - 26.378 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్ | Gold prices are up 6 per cent in the past 15 days: is it the start of another rally?

After witnessing a correction gold prices have again started its upward trajectory. In the last 15 days The MCX spot gold prices have surged around 6% to ₹46,648 per 10 grams.
Story first published: Friday, April 16, 2021, 22:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X