For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: రూ.47,000 దిగువకు పడిపోయిన బంగారం ధరలు

|

బంగారం ధరలు నేడు (జూన్ 24, 2021 గురువారం) తగ్గాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో ధరలు క్షీణించాయి. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు రూ.47,000 దిగువకు పడిపోయింది. వెండి రూ.67,600 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్ల దిగువకు, వెండి 26 డాలర్ల దిగువకు క్షీణించింది.

గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి రూ.9300 వరకు తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12వేల వరకు తక్కువగా ఉంది. బంగారం ధర కరోనా సెకండ్ వేవ్‌కు ముందు రూ.44వేల దిగువకు పడిపోయిన విషయం తెలిసిందే.

బంగారం కొనుగోలు...

బంగారం కొనుగోలు...

బంగారాన్ని షార్ట్ టర్మ్ కోసం రూ.47,300 టార్గెట్ ధరతో రూ.46,680 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.46,900 వద్ద కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ బులియన్ నిపుణులు చెబుతున్నారు. వెండి రూ.66,900 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.68600 టార్గెట్‌తో రూ.67,400 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇటీవల పసిడి ధరలు ఊగిసలాటలో ఉన్నాయి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.141.00 (-0.30%) తగ్గి రూ.46931.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,950.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,950.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,811.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.164.00 (-0.35%) క్షీణించి రూ.47224.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,232.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,255.00 గరిష్టాన్ని, రూ.47,162.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా డౌన్

వెండి స్వల్పంగా డౌన్

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.312.00 (0.46%) తగ్గి రూ.67620.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,707.00 వద్ద ప్రారంభమై, రూ.67,707.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,369.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.327.00 (-0.47%) తగ్గి రూ.68660.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,748.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,748.00 గరిష్టాన్ని, రూ.68,448.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 6.90 (0.39%) డాలర్లు తగ్గి 1,776.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,772.90 - 1,780.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.136 (0.52%) డాలర్లు తగ్గి 25.975 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.863 - 26.012 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold price today: రూ.47,000 దిగువకు పడిపోయిన బంగారం ధరలు | Gold price slips below Rs 47,000, Silver down Rs 300

Gold prices edged lower on Thursday as a stronger dollar dented the yellow metal's appeal. Yellow metal slips below Rs 47,000.
Story first published: Thursday, June 24, 2021, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X