For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, మార్కెట్ మద్దతు-నిరోధకం అక్కడే!

|

గత కొద్దిరోజులుగా బులియన్ మార్కెట్ క్షీణిస్తోంది. అదే సమయంలో నెల రోజులకు పైగా పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్ గతవారం మాత్రం భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు, కరోనా మహమ్మారి కేసులు, వ్యాక్సినేషన్ వంటి అంశాలు బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. ఓ వైపు బంగారం, మరోవైపు మార్కెట్‌లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ పైన నిపుణుల అంచనాలు భిన్నంగా ఉన్నాయి.

మార్కెట్ పైన వీటి ప్రభావం

మార్కెట్ పైన వీటి ప్రభావం

స్టాక్ మార్కెట్లు ఐదు వారాల పాటు లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వారం సెన్సెక్స్ 60,000 మార్కును దాటి చరిత్ర సృష్టించింది. అయితే వరుసగా ఐదు వారాలు లాభపడిన మార్కెట్లు గతవారం మాత్రం కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ కాస్త దిద్దుబాటుకు గురయింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు తోడు, దేశీయ ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. అదే సమయంలో బంగారం ధర అతి స్వల్పంగా లాభపడింది. గతవారం రూ.46,000 దిగువన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్, వారాంతంలో రూ.46,200 పైన ముగిసింది. అంటే అతి స్వల్పంగా లాభపడింది.

అమెరికాలో టెన్ ఇయర్ బాండ్స్ ఈల్డ్ పెరగడం రూపాయి మారకపు విలువ క్షీణించడం, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, FIIలు పెరగడం వంటి అంశాలు గతవారం మార్కెట్ నష్టాలకు కారణాలు. క్రూడాయిల్ ధరలు ధరలు 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.4 డాలర్లుగా నమోదయింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 0.6 శాతం తగ్గి 74.1 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ప్రధాన సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయంగా కరోనా డెల్టా వేరియంట్ ఆర్థిక రికవరీపై ప్రభావం చూపవచ్చుననే అంచనాలు, చైనాలో విద్యుత్ కొరతతో మందగమన భయాలు, ఫెడ్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి. గతవారంలో FIIs రూ.6,543 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. DIIs రూ.4,305 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి.

దీంతో సెన్సెక్స్ 2.1 శాతం, నిఫ్టీ 1.8 శాతం చొప్పున నష్టపోయాయి.

ఈ వారం ఎలా ఉండవచ్చు

ఈ వారం ఎలా ఉండవచ్చు

ఈ వారం కూడా మార్కెట్ల పైన పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. ఆర్బీఐ పాలసీ, క్రూడాయిల్ ధరలు, ఒపెక్ నిర్ణయాలు, భారత రూపాయి, ఎఫ్ఐఐ ఫ్లో, కరోనా వైరస్-వ్యాక్సినేషన్, ఎకనమిక్ డేటా అండ్ ఎర్నింగ్స్ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును స్థిరంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు మూడేళ్ళ గరిష్టానికి చేరుకున్నాయి. చమురు దేశాల ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ అంశాల ప్రభావం బంగారం, స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపించనుంది.

ఈ వారం సెన్సెక్స్ సపోర్ట్ స్థాయి 58,230, 57,765, తక్షణ నిరోధకస్థాయి 59,12, 59,680. స్టాక్ మార్కెట్లు ఈ వారం కాస్త సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం రూ.45,907 వద్ద స్టాప్ లాస్‌తో రూ.46,100కు సమీపంలో లాంగ్ పొజిషన్లు తీసుకోవచ్చు. ఒకవేళ రూ.45,907 కంటే కిందకు వస్తే ఫ్యూచర్ రూ.45,315 స్థాయికి పడిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ రూ.46,890 స్థాయిని అధిగమిస్తే రూ.47,280 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ రూ.58,135 దిగువకు వస్తే రూ.57,400కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, రూ.61,000ను క్రాస్ చేస్తే రూ.62,000కు కూడా చేరుకోవచ్చునని చెబుతున్నారు.

English summary

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు, మార్కెట్ మద్దతు-నిరోధకం అక్కడే! | Gold Price forecast for this week, RBI, Global cues effect on market

The market is likely to consolidate further in the coming week and will closely watch the RBI commentary along with global cues including the movement in oil prices & US bond yields, and US jobs data.
Story first published: Monday, October 4, 2021, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X