For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ, బంగారం ధర ఎలా ఉందంటే

|

బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. ఈ వారం పసిడి ఫ్యూచర్ రూ.45,257 దిగువకు ట్రేడ్ అయితే రూ.45,000 స్థాయికి చేరుకోవచ్చునని, రూ.44,450 దిగువకు పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.46,630 నిరోధకస్థాయి. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.47,500కు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, డాలర్ కదలికలు వంటివి పసిడి కాంట్రాక్టు ధరలపై ప్రభావం చూపుతాయి.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువ

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువ

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (సోమవారం, మార్చి 1) ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.341.00 (0.75%) పెరిగి రూ.46,077.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,139.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.343.00 (0.75%) పెరిగి రూ.46,212 వద్ద ట్రేడ్ అయింది. 46,210.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,261.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,129.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.70వేల దిగునే వెండి

రూ.70వేల దిగునే వెండి

వెండి ధరలు కూడా వరుసగా పెరిగి రూ.70,000 దిగువనే ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.959.00 (1.43%) పెరిగి రూ.68,220.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,575.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,575.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,924.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.914.00 (1.33%) పెరిగి రూ.69698.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,854.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,854.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,480.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్ల దిగువన పసిడి

1750 డాలర్ల దిగువన పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగినప్పటికీ, 1800 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +18.60 (+1.08%) డాలర్లు పెరిగి 1747.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,732.10 - 1,749.55

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 9.88 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.493 (+1.86%) డాలర్లు పెరిగి 26.933 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.672 - 26.985 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ, బంగారం ధర ఎలా ఉందంటే | Gold edges higher from 8 month low on softer dollar

Gold edged higher on Monday, recovering from an eight-month low touched in the previous session, as a weaker dollar lifted bullion's appeal.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X