For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ బ్యాంకింగ్ స్టాక్ కొనుగోలు చేయవచ్చా?

|

హెవీ వెయిట్స్ కాకుండా చిన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? వందలు, వేల రూపాయలకు బదులు సేఫ్ సైడ్‌గా రూ.100 లోపు స్టాక్స్ పైన పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఫెడరల్ బ్యాంకు షేర్లను కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ నెలలో 52 వారాల గరిష్టం రూ.107.55కు చేరుకున్న అనంతరం ప్రస్తుతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది ఫెడరల్ బ్యాంకు. ఈవారం రూ.83.55 వద్ద ముగిసింది.

ప్రస్తుతం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్టాక్ 52 వారాల కనిష్టం 77.50 కాగా, దీనికి సమీపంలో (రూ.83.55) వద్ద ఉంది. అలాగే 52 వారాల గరిష్టం రూ.107.55తో పోలిస్తే 22 శాతం తక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు.

 Experts recommend buy on this below ₹100 Jhunjhunwala portfolio stock

స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఫెడరల్ బ్యాంకు Q4FY22 ఫలితాలు బలంగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంకు స్టాక్ రూ.83 నుడి రూ.90 మధ్య ఉంది. ఒకసారి ఇది రూ.90 క్రాస్ చేస్తే, పరుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏడాదిలో ఈ స్టాక్ 2.45 శాతం లాభపడింది. ఈ స్టాక్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, సతీమణి రేఖ సంయుక్తంగా ఇందులో 2,10,00,000 షేర్లు కలిగి ఉన్నారు. అంటే 1.01 శాతం వాటా వీరి సొంతం. అలాగే రాకేష్ ఇండివిడ్యువల్‌గా 5,47,21,060 షేర్లు లేదా 2.64 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే వీరిద్దరి పేరున 7,57,21,060 ఫెడరల్ బ్యాంకు షేర్లు లేదా 3.65 శాతం వాటా కలిగి ఉంది.

English summary

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ బ్యాంకింగ్ స్టాక్ కొనుగోలు చేయవచ్చా? | Experts recommend buy on this below ₹100 Jhunjhunwala portfolio stock

Federal Bank shares are currently trading in ₹83 to ₹90 range and it may become highly bullish after giving breakout above ₹90 on closing basis
Story first published: Saturday, May 14, 2022, 20:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X