For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Akshaya Tritiya: బంగారం కొంటారా, ఇలా రూ.1తో కూడా కొనవచ్చు

|

అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనుగోలు చేయడం ఎక్కువమంది భారతీయులకు సెంటిమెంట్. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే ఏడాదంతా అలాగే సంపద ఉంటుందనే విశ్వాసం ఉంటుంది. అయితే బంగారం అంటే కేవలం నగలు కొనడం మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో బంగారంపై పెట్టుబడులు చాలా పెరిగాయి. గోల్డ్ కాయిన్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ ఇలా వివిధ కారకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక శుభకార్యాలు వంటివి ఉంటే మాత్రం నగలు వంటి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇన్వెస్ట్ చేసినా, ఆభరణాలు కొనుగోలు చేసినా.. ఈ క్రింది అంశాలు చూడండి.

వివిధ కంపెనీల ఆఫర్లు

వివిధ కంపెనీల ఆఫర్లు

అక్షయ తృతీయ సందర్భంగా వివిధ నగల కంపెనీలు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. జోయ్ అలుక్కాస్, తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్, మలబార్ గోల్డ్, క్యారట్ లేన్, పీసీ జ్యువెల్లర్స్, త్రిభువన్ దాస్ బీమ్ జీ జవేరి సహా స్థానిక సెల్లర్స్ కూడా ఆఫర్లు ఇస్తుంటారు. ఇందులో వివిధ కంపెనీల ద్వారా రూ.50వేల విలువ చేసే బంగారు నాణెం, 20 శాతం రాయితీ, కొనుగోలు పరిమితి పెరిగితే ఉచిత బంగారు ఆభరణాలు వంటి వివిధ ఆఫర్లు అందిస్తున్నాయి.

పెట్టుబడికి మార్గాలు...

పెట్టుబడికి మార్గాలు...

పెట్టుబడి పెట్టాలనుకుంటే సావరీన్ గోల్డ్ బాండ్స్, గోల్డా కాయిన్స్, గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ వంటివి ఉన్నాయి. గ్రాము, పది గ్రాములు, 50 గ్రాముల బంగారు నాణేలు అందుబాటులో ఉంటాయి. ప్రయివేటు సంస్థలతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంఎంటీసీ హాల్ మార్కుతో కూడిన నాణేలను విక్రయిస్తుంది. విక్రయానికి ఔట్ లెట్స్ ఉన్నాయి.

సావరీన్ గోల్డ్ బాండ్స్ మరో ఎంపిక. వీటిని కొనుగోలు చేస్తే 2.5 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఆరు నెలలకు ఓసారి చెల్లిస్తారు. డీమ్యాట్ ఖాతా, బ్యాంకు ఖాతా ఉన్నవారు ఎవరైనా వీటిని కొనుగోలు చేయవచ్చు.

గోల్డ్ ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్ ఎక్స్చేంజీల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ట్రేడింగ్ రోజుల్లో ఎప్పుడైనా యూనిట్ల వారీగా బంగారాన్ని కొని విక్రయించవచ్చు.

డిజిటల్ గోల్డ్ అంటే బంగారాన్ని వర్చువల్‌గా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలు కొని వారి వద్ద అట్టి పెడతారు. సాధారణ బంగారాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గ్రాము కొనాలన్నా రూ.5వేలకు పైన అవసరం. కానీ డిజిటల్ గోల్డ్ అయితే రూ.1తోను కొనుగోలు చేయవచ్చు.

ఇవి పాటించండి

ఇవి పాటించండి

బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో హాల్ మార్కింగ్ చూసుకోవాలి. ఇది స్వచ్ఛతకు చిహ్నం. చాలామంది 916 కేడీఎం అని, హాల్ మార్క్ అని చెప్పి విక్రయిస్తారు. కానీ హాల్ మార్కింగ్ ముద్ర ఉండదు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే హాల్ మార్క్ తప్పనిసరి. దీంతో ప్రతి నగ ఎన్ని క్యారెట్లతో తేలిపోతుంది.

English summary

Akshaya Tritiya: బంగారం కొంటారా, ఇలా రూ.1తో కూడా కొనవచ్చు | Buying Digital Gold Is A Smart Idea This Akshaya Tritiya

It is good idea to invest in digital gold if you are eyeing long term savings and insurance against uncertainties.
Story first published: Monday, May 2, 2022, 21:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X