For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 4 బ్లూచిప్ బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోలు చేస్తే అదిరిపోయే లాభాలు!!

|

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ నుండి ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇందులో ప్రధానంగా పెద్ద బ్లూచిప్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఈ త్రైమాసికంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల ఆదాయం ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఈ నాలుగు బ్యాంకింగ్ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని ఇన్వెస్టర్లకు సూచిస్తోంది. ఇందులో ICICI బ్యాంకు, HDFC బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంకు ఉన్నాయి.

ICICI బ్యాంకు

ICICI బ్యాంకు

ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. రిటైల్ డిపాజిట్స్‌లో బలమైన వృద్ధిని కొనసాగిస్తోంది ఈ బ్యాంకు. గత కొన్నేళ్లుగా కస్టమర్ల విశ్వసనీయతను పెంపొందించుకుంటోంది. ప్రయివేటు బ్యాంకుల్లో అతి తక్కువ ఫండింగ్ కాస్ట్స్ (డిపాజిట్స్ వ్యయం 4 శాతం క్షీణత) కలిగి ఉంది.

అనవసరమైన బ్యాలెన్స్ షీట్ రిస్క్ తీసుకోకుండా లాభదాయక వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. తద్వారా మార్జిన్‌కు మరింత మద్దతు లభిస్తోంది. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం ఈ స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఇతర కారణం రిటైల్ మిక్స్ ఆరోగ్యకరంగా ఉండటం. కాసా నిష్పత్తి 46. శాతంగా ఉంది. రిటైల్ కాంట్రిబ్యూషన్ టు ఫీజు 78 శాతం, లోన్ మిక్స్ 67 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు ఆరోగ్యకర వృద్ధిని కొనసాగిస్తోంది. ఈ స్టాక్ కొనుగోలు చేయవచ్చునని చెబుతోంది.

HDFC బ్యాంకు

HDFC బ్యాంకు

మరో పెద్ద బ్యాంకు HDFC స్టాక్‌ను కూడా కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్. కార్పోరేట్ పోర్ట్ పోలియోలో ఈ బ్యాంకు దూసుకెళ్తోంది. అలాగే రిటైల్ రుణాల్లో సానుకూలంగా ఉంది. FY21లో రుణ వృద్ధిలో కార్పోరేట్ వాటానే ఎక్కువ. కార్పోరేట్ రుణ వాటా 53 శాతంగా ఉంది. స్ట్రాంగ్ లయబులిటీస్ బలమైన మార్జిన్‌కు మద్దతు ఇస్తుందని చెబుతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్బీఐ స్టాక్‌ను కూడా కొనుగోలు చేయవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచిస్తోంది. అసెట్, లయబులిటీ.. రెండింట్లో బలమైన మార్కెట్ షేర్‌ను కొనసాగిస్తోంది. గత కొన్నేళ్లుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కార్డ్ మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి.

ఫెడరల్ బ్యాంకు

ఫెడరల్ బ్యాంకు

ఫెడరల్ బ్యాంకు స్టాక్ కొనుగోలును కూడా మోతీలాల్ ఓస్వాల్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రికమండ్ చేస్తోంది. హై-రేటెడ్ కార్పోరేట్ రుణాల విషయంలో ఫెడరల్ బ్యాంకు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రిటైల్ రుణ మిశ్రమం FY19లో 28.4 శాతంగా కాగా FY21లో 33 శాతానికి మెరుగుపడింది. వ్యాపార వృద్ధి కాస్త మందగించినప్పటికీ రుణ వృద్ధిలో క్రమంగా వృద్ధి ఉంటుందని భావిస్తున్నారు.

English summary

ఈ 4 బ్లూచిప్ బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోలు చేస్తే అదిరిపోయే లాభాలు!! | 4 Bluechip Banking Stocks To Buy For Good Gains

Motilal Oswal Institutional Equities has placed a buy call on select stocks from the banking and financial space. Most of these are large bluechip banking stocks.
Story first published: Wednesday, July 7, 2021, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X