For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మీ బైక్ రెన్యువల్ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు..

|

ఇప్పటిదాకా చాలా మంది తాము నడిపిస్తున్న బైక్ ఇన్సూరెన్సు గురించి మరిచిపోయి ఉంటారు. ఎప్పుడు ఇన్సూరెన్సు రెన్యూవల్ చేశారంటే చాలామంది తమకు గుర్తులేదనే సమాధానమే చెప్పే పరిస్థితి నెలకొంది. బైక్ కు బీమా చేయాల్సిన అవసరం ఉందా అనే చాలా మంది అనుకుంటారు. కొంత మంది బీమా చేయించుకుందామనుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతారు.. ఇలా రోజులు.. నెలలు గడుస్తుంది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నప్పుడు మాత్రమే బీమా చేయించుకుంటే బాగుండు అన్న ఆలోచన వస్తుంది. తర్వాత మళ్ళీ మాములే. అయితే ఇటీవలే వాహనాలకు బీమా లేకపోతే విధించే జరిమానాలు భారీగా పెంచారు. ఈ దెబ్బతో అందరు బీమా తప్పని పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వస్తోంది.

బీమా చేయించుకోవడం వల్ల

బీమా చేయించుకోవడం వల్ల

* బీమా చేయించుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు వాహనానికి జరిగే నష్టాన్ని బీమా కంపెనీ నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. మనవాహనమే మరొకరికి తగిలి డ్యామేజ్ జరిగితే బీమా లేకపోతే భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ బీమా ఉంటె ఆ భారాన్ని బీమా కంపెనీయే భరిస్తుంది.

* రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైనా లేదా మృతి చెందినా ఆ వ్యవహారం కోర్టుదాకా వెళితే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదా వ్యక్తిగతంగా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. అందుకే బీమా తీసుకోవడం మంచిదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

సరైన సమయంలో బీమా రెన్యూవల్

సరైన సమయంలో బీమా రెన్యూవల్

* వాహనానికి బీమా తీసుకున్న వారు దాన్ని సరైన సమయంలో రెన్యూవల్ చేసుకోవాలి. బీమా రెన్యూవల్ కాలపరిమితి దాటినా మూడు నెలల తర్వాత రెన్యూవల్ చేస్తే అప్పటిదాకా మీకు లభించడానికి అవకాశం ఉన్న నో క్లెయిమ్ బోనస్ రాకుండా పోతుంది. అందుకే నిర్దేశిత కాలంలో మీ పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి.

* మీరు తీసుకున్న వాహన బీమా పాలసీ గడువు తీరిపోతే ఆ వాహనాన్ని ఇంట్లోనే ఉంచండి. మీకు బీమా ఇచ్చిన ఏజెంట్ ను సంప్రదించి వాహన బీమాను రెన్యూవల్ చేయమని కోరండి. ఒకే బీమా కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం భారం తగ్గవచ్చు.

ఆన్ లైన్ లో కొనుగోలు చాలా ఈజీ

ఆన్ లైన్ లో కొనుగోలు చాలా ఈజీ

* వాహన బీమాను బీమా ఏజెంట్ ద్వారానే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మనమే సొంతంగా కొనుగోలు చేయవచ్చు.

* బీమా కంపెనీ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా మీకు ఎలాంటి బీమా అవసరమో తెలుసుకోవచ్చు.

* బీమా తీసుకువాల్సి వస్తే మీరు మీకు సంభందించిన వివరాలతో రిజిస్టర్ చేసుకొని వాహన వివరాలు, ఇంతకు ముందటి పాలసీ వివరాలు తెలియజేసి బీమా పాలసీని రెన్యూవల్ చేసుకోవచ్చు.

* బీమా అగ్రిగేటర్ల ద్వారా కూడా మీకు నచ్చిన కంపెనీ నుంచి బీమా తీసుకోవచ్చు. పాలసీ బజార్ డాట్ కామ్, కవర్ ఫాక్స్ ఇన్సూరెన్సు, రెన్యూ బై డాట్ కామ్ వంటి వాటి ద్వారా బీమా ప్రీమియం ఎంత ఉందొ తెలుసుకోవచ్చు.

ఇలా పొదుపు చేసుకోండి..

ఇలా పొదుపు చేసుకోండి..

* వాహన బీమా విషయంలో మనకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. ప్రీమియం భారం ఎక్కువ అవుతుందని భావిస్తే థర్డ్ పార్టీ బీమా ను తీసుకోవచ్చు. ఈ బీమా ప్రతి వాహనానికి తప్పని సరి అన్న విషయం తెలిసిందే. ఒక వేళా సమగ్రమైన బీమా పాలసీ కావాలనుకుంటే దీని ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఈ బీమాలో ఓన్ డ్యామేజ్ కవరేజీ కూడా బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.

* థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు, కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్సు ప్రీమియంల మధ్య వాహనాన్ని బట్టి తేడా ఉంటుంది.

* వాహన విలువలు తగ్గించుకోవడం ద్వారా కూడా ప్రీమియం ను తగ్గించుకోవచ్చు. అయితే వాహనానికి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఆమేరకు మాత్రమే బీమా కంపెనీ నుంచి పరిహారం లభించడానికి అవకాశం ఉంటుంది.

* బీమా పాలసీల రెన్యూవల్ పై కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. వాటిని చూసుకుంటే కొంత మేరకు ఆదా చేసుకోవచ్చు.

English summary

ఇలా చేస్తే మీ బైక్ రెన్యువల్ ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు.. | Motor insurance premium: All you need to know

If you are looking for the best motor insurance policy for your vehicle, it is a good idea to compare policies offered by some popular insurance agencies.
Story first published: Thursday, September 12, 2019, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X