For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ కుటుంబానికి అండగా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ పై నిర్లక్ష్యం ఎందుకు?

By Jai
|

ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. మనకు తెలిసీ తెలియక, మన ప్రమేయం ఉండి లేక ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉంటాయి. ఈ ప్రమాదాల్లో చిన్నపాటి దెబ్బలతో బయటపడితే సమస్య లేదు. కానీ ప్రాణాలే పోయే పరిస్థితి ఏర్పడితే మీపై ఆధార పడిన వారి పరిస్థితి ఏమిటి? ప్రమాదాలు కాకుండా ఏవో మాయదారి రోగాలు వస్తున్నాయి. చిన్న దోమ కుడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి దురదృష్టమైన పరిస్థితి వస్తే.. మీరు లేని లోటే తీర్చలేనిది. ఆపై ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడితే వారు తట్టుకోగలరా.. కుటుంబానికి మీరు లేని పరిస్థితుల్లో ఎవరి అండ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. జీవిత బీమాలాంటిది తీసుకోండి. అందులోనూ టర్మ్ ఇన్సూరెన్సుకు ప్రాధాన్యం ఇవ్వండి. అతి తక్కువ మొత్తంతో ఇది ఎక్కువ ఆర్ధిక భరోసాను కల్పిస్తుంది అన్న విషయం మరచి పోకండి.

ఆస్తి ఉండగా అప్పు కోసం ఎందుకు చింత!ఆస్తి ఉండగా అప్పు కోసం ఎందుకు చింత!

నిర్లక్ష్యం ఎందుకంటే?

నిర్లక్ష్యం ఎందుకంటే?

జీవిత బీమా పాలసీ తీసుకుంటే నిర్దేశిత కాలపరిమితి తర్వాత మీరు చెల్లించిన ప్రీమియంకు అదనంగా సొమ్ము వస్తుంది. ఈ పాలసీల్లో మనీ బ్యాక్ సదుపాయం కూడా ఉంటుంది. అంటే కొన్నేళ్ల తర్వాత బీమా సొమ్ములో కొంత మొత్తం మీ చేతికి అందుతుంది. ఇది వడ్ఢననుకుంటే ఒకేసారి బీమా కాలపరిమితి తర్వాత ఏక మొత్తంగా తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీ కాలంలో పాలసీ దారు మరణిస్తే నిబందనల ప్రకారం సొమ్ము చెల్లిస్తారు. అదే టర్మ్ ఇన్సూరెన్సు విషయానికి వస్తే బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తేనే పాలసీ సొమ్ము నామినీకి వస్తుంది. ఇంతకాలానికి ప్రీమియం చెల్లిస్తే అంతకాలానికే బీమా భద్రత ఉంటుంది. బీమా ప్రీమియం వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ఎవరు తాను చనిపోతాను అన్న ఉద్దేశంతో బీమా తీసుకోరు. అందుకే టర్మ్ ఇన్సూరెన్సు పై అంతగా ఆసక్తి పెరగడం లేదు.

యువత ప్రాధాన్యం

యువత ప్రాధాన్యం

చాలా బీమా కంపెనీలు ఆన్ లైన్ ద్వారా, మొబైల్ యాప్ ల ద్వారా టర్మ్ ఇన్సూరెన్సు ను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. నేరుగా ఏజెంట్ల ద్వారా కూడా ఈ బీమాను తీసుకోవచ్చు. యువతలో టర్మ్ ఇన్సూరెన్సు పట్ల అవగాహన బాగా పెరిగిపోతోంది. కాబట్టి ఆన్ లైన్ ద్వారా వీరు ఎక్కువగా టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్లను కొనుగోలు చేస్తున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం మొత్తం చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీమా మొత్తానికి అయ్యే సొమ్మును వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది కాబట్టి యువత ఆసక్తి పెరుగుతోంది. మహిళలు కూడా టర్మ్ ఇన్సూరెన్సు తీసుకుంటుండటం విశేషం. ఈ రోజుల్లో భార్య భర్తలు ఉద్యోగం చేస్తున్నారు. అందుకే ఇద్దరు టర్మ్ ఇన్సూరెన్సు తీసుకుంటున్నారు.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

- టర్మ్ ఇన్సూరెన్సు అనేది నిర్దేశిత కాలానికి నిర్దేశిత ప్రీమియం చెల్లించడం ద్వారా బీమా రక్షణను కల్పిస్తుంది. బీమా మొత్తం తక్కువగా ఉంటుంది.

- పాలసీ కాలంలో దురదృష్ట వశాత్తు పాలసీ దారుడు మరణిస్తే పాలసీ సమయంలో పేర్కొన్న నామినీ బీమా మొత్తాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.ఈ సొమ్మును ఇక మొత్తంగా లేదా నెలవారీగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక అవసరం ఉన్నవారు ఒక్కసారిగా మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. నెలవారీగా అవసరం ఉందనుకుంటే నెలవారీగా పొందవచ్చు.

- టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ల ద్వారా పూర్తిగా ఆర్థిక రక్షణ కలుగుతుంది.

- టర్మ్ ఇన్సూరెన్సు కోసం చెల్లించే ప్రీమియంకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని 80 (సి) కింద గరిష్టంగా ఒక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. కొన్ని ప్లాన్లపై 80డీ, 10డీ కింద కూడా పన్ను ప్రయోజనం కలుగుతోంది.

-టర్మ్ ఇన్సూరెన్సును మీకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇందుకు రైడర్లు దోహదపడతాయి.

- ఉదాహరణకు ప్రమాదం కారణంగా మృతిచెందినప్పుడు అదనపు ప్రయోజనం పొందాలనుకుంటే ఈ రైడర్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే ఆర్ధిక ప్రయోజనం పొందడానికి కూడా రైడర్ ను ఎంచుకోవచ్చు. వీటితో మరికొన్ని రైడర్లు కూడా ఉంటాయి. వాటిని ఎంచుకోవడం ద్వారా ప్రమాద వశాత్తు జరిగే దుర్ఘటనలనుంచి ఉపశమనం పొందవచ్చు.

- కొన్ని ప్లాన్ల ద్వారా జీవిత బీమా కవరేజిని కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ అంశాలపై దృష్టి పెట్టండి

ఈ అంశాలపై దృష్టి పెట్టండి

- నెలకు రూ.700 ప్రీమియంతోనూ టర్మ్ ఇన్సురెన్సు తీసుకోవచ్చు.

- దాదాపు 29 బీమా కంపనీలు విభిన్న రకాల టర్మ్ ఇన్సూరెన్సు పథకాలను అందిస్తున్నాయి. ఆయా కంపనీల వెజ్ సైట్ల ద్వారా కస్టమర్ కేర్ సెంటర్ల ద్వారా ఏజెంట్ల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

- ఎంత మొత్తం ప్రీమియం చెల్లిస్తే ఎంత కవరేజి లభిస్తుందో చూడాలి.

- ఎంత కాలానికి పాలసీ వస్తుండో తెలుసుకోవాలి.

- బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పైన దృష్టి సారించాలి.

- ఎంత ప్రీమియం చెల్లిస్తే ఎంత సమ్ అస్స్యూరెన్సు లభిస్తుందో చూసుకోవాలి.

- మీరు తీసుకునే ప్లాన్ లో భాగంగా అందిస్తున్న రైడర్లు ఏమిటో చూసుకోవాలి.

English summary

మీ కుటుంబానికి అండగా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ పై నిర్లక్ష్యం ఎందుకు? | What is Term Insurance Plan?

Term Insurance Plans for your family. Term insurance is a pure life insurance product, which provides financial protection in case of death of the life insured during the term of the policy.
Story first published: Sunday, June 16, 2019, 11:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X