For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు లాకర్‌కు బీమా కవరేజ్

By Jai
|

ప్రతి ఇంట్లోనూ ఎంతోకొంత బంగారం లేదా ఆభరణాలు ఉండటం సహజమే. విలువైన ఇంటి లేదా భూమి పత్రాలు కూడా ఉంటాయి. వీటిని చాలా మంది ఇంట్లోనే ఉంచుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇవన్నీ ఇంట్లోనే ఉంటే వారికీ కంటి మీద కునుకు ఉండదు. దొంగతనాలు జరిగినా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నా, విపత్తులు సంభవించినా వీటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది తమ బంగారంతో పాటు ఆస్తుల పత్రాలను లాకర్లలో దాచుకుంటున్నారు. బ్యాంకుల్లో భద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాకర్లను ఎంచుకుంటున్నారు. అయితే బ్యాంకుల్లోను దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మీ లాకర్ లోని ఆభరణాలు లేదా పత్రాలు మరేమైనా విలువైనవి కోల్పోతే మీకు పరిహారం లభించే అవకాశం ఉండదు.

మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే..మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే..

Insurance coverage: Now, a policy to protect bank lockers

- దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ 'బ్యాంకు లాకర్ ప్రొటెక్టర్ పాలసీ ' ని అందుబాటులోకి తెచ్చింది. బీమా పరిశ్రమలోనే మొదటి సారిగా ఇలాంటి పాలసీ వచ్చినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
- ఈ పాలసీ తీసుకుంటే అగ్ని ప్రమాదం జరిగినా, దొంగతనం జరిగినా, భూకంపం వచ్చినా, ఉగ్రవాదుల దాడులు జరిగినా కవరేజ్ లభిస్తుంది.
- నిర్దేశిత పరిమితి వరకు సెల్ఫ్ డిక్లరేషన్ తో ఈ పాలసీ తీసుకోవచ్చు.
- ఈ పాలసీలో ఏడు ఆప్షన్లున్నాయి.
- సమ్ అస్యూరెన్సు రూ. 3 లక్షల నుంచి రూ . 40 లక్షల వరకు ఉంటుంది.
- రూ. 3 లక్షల సమ్ అస్యూరెన్సుకు రూ. 300 (జీ ఎస్ టీ లేకుండా ), రూ. 5 లక్షలకు రూ . 500, రూ.10 లక్షలకు రూ .1,000, రూ. 20 లక్షలకు రూ . 1,500, రూ. 30 లక్షలకు రూ . 2,000, రూ. 40 లక్షలకు రూ. 2,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ పాలసీని ఎవరికీ వారు లేదా బ్యాంక్ గ్రూప్ గా తీసుకోవచ్చు.
- ప్రీమియం మొత్తం ఎక్కువేమీ లేదు కాబట్టి మీ కవరేజి తీసుకుంటే మేలే.

English summary

బ్యాంకు లాకర్‌కు బీమా కవరేజ్ | Insurance coverage: Now, a policy to protect bank lockers

The policy offers a cover against risks including fire, earthquake, burglary, holdup or any act of terrorism. Apart from jewellery and valuables, one can also insure important documents kept in a locker as an add on cover.
Story first published: Monday, May 27, 2019, 14:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X