For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలు: పూర్తి వివరాలు ఇవీ!

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) నుంచి మరో సరికొత్త పాలసీ వచ్చింది. ఇటీవల చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832ను లాంచ్ చేసింది. ఇందులో మీరు రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే పాలసీ మెచ్యూరిటీ నాటికి రూ.27 లక్షలు అందుకుంటారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇది మంచి ప్లాన్‌గా చాలామంది పేరెంట్స్ భావిస్తున్నారు. ఓ వైపు చదువులు, ఆరోగ్యం, జీవనోపాధి కోసం కుటుంబాలు ఎంతో ఖర్చు చేస్తున్నాయి. వీటితో పాటు పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించాల్సి వస్తోంది. ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ పాలసీ మీకు ఉపశమనం కలిగించవచ్చు. మీరు రోజుకు రూ.206 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి

చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీ మెచ్యూరిటీ 25 ఏళ్లు

చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీ మెచ్యూరిటీ 25 ఏళ్లు

చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీ మెచ్యూరిటీ 25 ఏళ్లు. మీ పిల్లలకు 25 ఏళ్లు వచ్చిన తర్వాతే పాలసీ గడువు ముగుస్తుంది. పిల్లల వయస్సును బట్టి మెచ్యూరిటీ మారుతుంది. ఉదాహరణకు మీ పిల్లలు పన్నెండేళ్లు ఉంటే.. మెచ్యూరిటీ 13 ఏళ్లుగా ఉంటుంది. అంటే అప్పటికి 25 ఏళ్లు అవుతాయి. ఒకవేళ మీ పిల్లలు అయిదేళ్లు ఉంటే 20 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరుతుంది. రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత రూ.27 లక్షలు పొందవచ్చు.

రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత 27 లక్షలు

రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత 27 లక్షలు

ఈ పాలసీ తీసుకుంటే మీరు రోజుకు రూ.206 ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. మీ పిల్లల వయస్సు 0 నుంచి 12 ఏళ్లు ఉండాలి. రోజుకు రూ.206 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత 27 లక్షలు వస్తాయి. నిబంధనల ప్రకారం

తల్లిదండ్రులు వీటిని పిల్లల విద్య, భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చు.

ప్రీమియంలు ఇలా

ప్రీమియంలు ఇలా

చిల్డ్రన్ మనీ బ్యాంక్ ప్లాన్ 832 పాలసీలో వివిధ రకాల ప్రీమియంలు ఉన్నాయి. పాలసీ హోల్డర్లు ఆరు నెలలు, మూడు నెలలు, ఒక నెల లేదా ఒక ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు. కనీసం రూ.లక్ష మినిమం పాలసీ. గరిష్ట పరిమితి లేదు. ఏడాది పేమెంట్ ఆప్షన్ రూ.77,334, 6 నెలల పేమెంట్ ఆప్షన్ 39,086, 3 నెలల పేమెంట్ ఆప్షన్ 19,750, నెల పేమెంట్ ఆప్షన్ 6,584గా ఉంది. అయితే పైన పేర్కొన్న అమౌంట్ పాలసీ తొలి ఏడాదికి సంబంధించినవి. పాలసీదారు 12 వరుస ప్రీమియంలు చెల్లించవచ్చు.

English summary

మీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలు: పూర్తి వివరాలు ఇవీ! | New LIC Policy: Invest Rs 206 per day for your children and get whopping Rs 27 lakh in 25 years

Life Insurance Corporation (LIC) of India has launched New Children's Money Bank Plan 832, that allows you to invest Rs 206 and get Rs 27 lakh on policy's maturity.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X