For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ కొత్త పాలసీ: 'నవజీవన్' స్కీం గురించి తెలుసుకోండి, రిటర్న్స్ ఎలా ఉంటాయంటే?

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) ఇటీవల నవజీవన్ పేరుతో కొత్త ప్లాన్ తీసుకు వచ్చింది. దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఇది నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ లైఫ్ అష్యూరెన్స్ పాలసీ. రక్షణతో పాటు ఆదాయం కూడా ఈ పాలసీ ప్రత్యేకత. 90 రోజుల పిల్లల నుంచి 65 ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం లేదా అయిదేళ్ల ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. పాలసీపై లోన్ సౌకర్యం ఉంది. పన్ను ప్రయోజనాలతో పాటు పొదుపు, పాలసీదారుల జీవిత భద్రతను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించారు. 2019 మార్చి 18వ తేదీ నుంచి ఈ కొత్త పాలసీ అమలులోకి వచ్చింది.

ఈ పాలసీలో కస్టమర్లు రెండు రకాల ప్రీమియంలు ఎంచుకోవచ్చు. ఒకటి సింగిల్ ప్రీమియం. మరొకటి అయిదేళ్ల లిమిటెడ్ ప్రీమియం. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్‌లో 45 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండు రకాల బీమా హామీ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో పాలసీదారు మృతి చెందితే ఎంత మొత్తం హామీ కావాలనుకుంటున్నారో ముందే ఎంచుకోవచ్చు. ఆప్షన్ ఒకటి.. వార్షిక ప్రీమియం కంటే పదిరెట్లు. ఆప్షన్ రెండు.. వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రం ఒకే ఆప్షన్ ఉంది. అది వార్షిక ప్రీమియం కంటే పది రెట్లు. నవజీవన్ ప్లాన్ ఆన్‌లైన్‌లో తీసుకుంటే సింగిల్ ప్రీమియం పేమెంట్ పైన 2 శాతం, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ పైన 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి, లాభాలు ఏమిటి? 'నవజీవన్' పాలసీని లాంచ్ చేసిన ఎల్ఐసీ: ఇది ఎవరికి, లాభాలు ఏమిటి?

పాలసీదారు ముందే మరణిస్తే

పాలసీదారు ముందే మరణిస్తే

పాలసీ తీసుకున్న తర్వాత మెచ్యూరిటీకి ముందు పాలసీదారు మరణిస్తే బీమా హామీ ఉంటుంది. అయిదేళ్లలో మరణిస్తే.. రిస్క్ పీరియడ్ ప్రారంభం కాకముందు చనిపోతే వడ్డీ లేకుండా ప్రీమియంలు చెల్లిస్తారు. రిస్క్ ప్రకటించిన తర్వాత మృతి చెందితే బీమా హామీ ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యాక, మెచ్యూరిటీకి ముందు చనిపోతే బీమా హామీతో పాటు కంపెనీ విధానాల ప్రకారం అదనపు లాయల్టీ చెల్లింపులు ఉంటాయి. పాలసీ లాంగ్ టర్మ్ ముగిసేంత వరకు జీవించి ఉంటే.. అన్ని ప్రీమియంలు చెల్లించి ఉంటే.. మెచ్యూరిటీ హామీ, లాయల్టీతో కలిపి ఇస్తారు.

కనిష్ట, గరిష్టం

కనిష్ట, గరిష్టం

ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్.. ప్రమాదవశాత్తు మృతి చెందితే పాలసీ ప్రకారం బీమా హామీ, రైడర్ మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. గరిష్ట పరిమితి రూ.100 లక్షల వరకు ఉంటుంది. ఈ పాలసీ కోసం అర్హతలు ఏమంటే...

కనిష్ట హామీ రూ.1 లక్ష, గరిష్ట హామీ పరిమితి లేదు.

కనీస వయస్సు సింగిల్ ప్రీమియం అయితే 90 రోజులు ఉండాలి.

పరిమిత ప్రీమియం ఆప్షన్ 1... 90 రోజుల వయస్సు ఉండాలి.

పరిమిత ప్రీమియం ఆప్షన్ 2... 45 సంవత్సరాల వయస్సు ఉండాలి.

గరిష్ట వయస్సు సింగిల్ ప్రీమియంలో 44 సంవత్సరాలు ఉండాలి.

లిమిటెడ్ ప్రీమియం 2... 65 సంవత్సరాల వయస్సు.

సింగిల్ ప్రీమియం గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 62 ఏళ్లు

లిమిటెడ్ ప్రీమియంకు 75 ఏళ్లు (ఆప్షన్ 1 క్రింద)

లిమిటెడ్ ప్రీమియంకు 80 ఏళ్లు (ఆప్షన్ 2 క్రింద)

పాలసీ కాలవ్యవధి పదేళ్ల నుంచి 18 సంవత్సరాలు.

చెల్లింపు విధానం.. సింగిల్ ప్రీమియం (లంప్‌సమ్), 12 నెలలు, 6 నెలలు, 3 నెలలు, 1 నెల. ఎన్ఏసీహెచ్ ద్వారా చెల్లింపులు.

ఎండోమెంట్ పాలసీలో బీమా హామీ తక్కువ, ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. రాబడి 4 నుంచి 5 శాతం ఉంటుంది.

రిటర్న్స్ ఎలా ఉంటాయి?

రిటర్న్స్ ఎలా ఉంటాయి?

సమాచారం మేరకు... లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్‌లో మీరు మొదటి ఏడాదికి రూ.9,628 చెల్లించాలి. ఆ తర్వాత ఏడాది నుంచి 9,430 చెల్లించవలసి ఉంటుంది. మెచ్యూరిటీ 15 ఏళ్లయితే రూ.10 లక్షల వరకు వస్తాయి. నవజీవన్ పాలసీలో రిటర్న్స్ 5 నుంచి 6 శాతం వరకు ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టుబడి మీకు సంతృప్తికరమా లేదా చూసుకోవాల్సి ఉంటుంది.

English summary

ఎల్ఐసీ కొత్త పాలసీ: 'నవజీవన్' స్కీం గురించి తెలుసుకోండి, రిటర్న్స్ ఎలా ఉంటాయంటే? | LIC's new Navjeevan plan: All you need to know

LIC's navjeevan plan is available for purchase through both online and offline modes. This is a non linked 'with profit' endowment assurance plan reportedly offering 5-6% returns.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X