For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Zomato Share: జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా.. 4 శాతం పడిపోయిన స్టాక్..

|

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కంపెనీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో Zomato షేర్లు ఈరోజు 4% పైగా పడిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభదాయకంగా మారడానికి కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 4% మందిని తొలగించాలని యోచిస్తోందన్న నివేదికల మధ్య స్టాక్ పై సెంటిమెంట్ కూడా బలహీనపడింది. బీఎస్‌ఈలో జొమాటో షేరు 4.31 శాతం పతనమై రూ.64.25కి చేరుకుంది. క్రితం ముగింపు రూ.67.15తో పోలిస్తే రూ.66.30 వద్ద ప్రారంభమైన షేరు ధర తగ్గింది.

మూవింగ్ యావరేజ్‌
Zomato షేర్లు 20 రోజులు, 50 రోజులు, 100 రోజుల మూవింగ్ యావరేజ్‌ల కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. అయితే 5 రోజులు, 200 రోజుల చలన సగటు కంటే తక్కువగా ఉన్నాయి. ఈ షేరు ఒక సంవత్సరంలో 57.84 శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 52.56 శాతం క్షీణించింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55,115 కోట్లకు పడిపోయింది. మరోవైపు BSEలో మొత్తం 31.18 లక్షల జొమాటో షేర్లు రూ. 20.33 కోట్లకు చేతులు మారాయి.

 Zomatos co-founder Mohit Guptas resignation saw a huge decline in the stock on Monday

రాజీనామాలు
ఈ షేరు నవంబర్ 25, 2021న 52 వారాల గరిష్ట స్థాయి రూ.161.25ని తాకింది. జూలై 27, 2022న 52 వారాల కనిష్ట స్థాయి రూ.40.55కి చేరింది. గుప్తా నాలుగున్నర సంవత్సరాల క్రితం Zomatoలో చేరారు. 2020లో జొమాటో ఫుడ్ డెలివరీ CEO కూడా వైదొలిగారు. జొమాటో పెద్ద పోషన్లలో ఉన్న వారు రాజీనామా చేస్తున్నరాు. వారిలో రాహుల్ గంజూ, సిద్ధార్థ్ ఝవార్, నితిన్ సవారా ఉన్నారు. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన ఫుడ్ డెలివరీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు Zomato ప్రకటించింది.

English summary

Zomato Share: జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా.. 4 శాతం పడిపోయిన స్టాక్.. | Zomato's co-founder Mohit Gupta's resignation saw a huge decline in the stock on Monday

Shares of Zomato fell over 4% today after co-founder Mohit Gupta announced his resignation from the company.
Story first published: Monday, November 21, 2022, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X