న్యూఢిల్లీ: మీరు మొబైల్ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. కంపెనీ ఎండీయే ఆ ఫోన్‌ను మీ వద్దకు వచ్చి డెలీవరీ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది! ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ సంస్థ కొత్త డివైస్ తీసుకు వచ్చినప్పుడల్లా వైస్ ప్రెసిడెంట్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ దీనిని స్వయంగా కొందరు కస్టమర్‌లకు డెలివరీ చేస్తారు. తాజాగా, షియోమీ ఇండియా కంపెనీ ఎండీ మరోసారి డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. యుగందర్ రెడ్డి అనే కస్టమర్ కమ్ అభిమానికి స్వయంగా ఫోన్ డెలివరీ చేశారు. ఈ విషయమై షియోమీ ఎండీ మను కుమార్ జైన్ స్పందించారు.
కొత్త ఫోన్లను విడుదల చేసిన ప్రతిసారి కొన్ని ఫోన్లను తాను స్వయంగా వెళ్లి కస్టమర్లకు అందిస్తానని, ఈ సందర్భంగా వారి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం నాకు ఇష్టమని చెప్పారు. షియోమీ అభిమానుల కుటుంబాన్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

కొద్ది రోజుల క్రితం యుగందర్ రెడ్డి రెడ్ మీ నోట్ 8ప్రో ఫోన్‌ను ఆర్డర్ చేశారు. ఆయన ఇప్పటికే పలు ఎంఐ ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. Redmi Note 8 Pro ఆయన మరో షియోమీ ఫోన్. అంతకుముందు POCO F1 ఉపయోగించారు. ఆయన సతీమణి Redmi Note 7 Pro వినియోగిస్తున్నారు. Mi A3 అతని తల్లి ఉపయోగిస్తున్నారు. Redmi Note 8 Pro అతని తండ్రి వినియోగిస్తున్నారు.
ఆన్ లైన్ ద్వారా షియోమో సేల్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పోర్టల్స్‌తో పాటు సొంత పోర్టల్ ఎంఐ డాట్ కామ్ కూడా విక్రయిస్తోంది. 2020 ఏడాది మిడిల్ నాటికి భారత్‌లో 10వేల వరకు స్టోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆరువేల స్టోర్స్ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications